సీఎం రేవంత్ రెడ్డి తమ ఇంటి వస్తున్నారని తెలియడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గతంలో ఇక్కడ ఉండే సమయంలో రేవంత్ రెడ్డి తమ కుటుంబ సభ్యుడిగా ఉండేవాడని ఇంటి ఓనర్ పార్వతమ్మ గుర్తుచేసుకున్నారు. తాను చేసిన కూరలు అంటే రేవంత్ రెడ్డికి ఎంతో ఇష్టమని పార్వతమ్మ తెలిపారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి తన భర్తను మామ అని ఆప్యాయంగా పిలిచేవారని పార్వతమ్మ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు తన కొడుకు, కూతురు రేవంత్ రెడ్డిని మామ అంటూ పిలవడం ఎంతో సంతోషంగా ఉందని పార్వతమ్మ సంతోషం వ్యక్తం చేశారు.
తమ ఇంట్లో ఉండి చదువుకుని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమ ఇంటికి రావడం ఎంతో అదృష్టం అంటున్నారు వనపర్తి జిల్లాకు చెందిన పార్వతమ్మ. రేవంత్ తమ కుటుంబ సభ్యుడిగా ఉండేవాడని తాను చేసిన కూరలు అంటే ఆయనకు ఎంతో ఇష్టమని పార్వతమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
Also Read: వనపర్తిలో సీఎం రేవంత్ పర్యటన.. వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
కాగా వనపర్తిలో తాను 12 సంవత్సరాలు అద్దెకి ఉన్న ఇంటిని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు.. సీఎంకు హారతి ఇచ్చి ఇంటి యజమాని కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. ఇంటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.