Today Gold Rate: గోల్డ్ కొనుగోలు చేసేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వరుసగా గత కొద్ది రోజుల నుంచి గోల్డ్ రేట్స్ దిగొచ్చాయి. ఈ నాలుగు రోజుల నుంచి చూస్తే సుమారు రూ.1500 వరకు తగ్గింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,400 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,620 వద్ద కొనసాగుతోంది. గాకా గోల్డ్ రేట్స్ భారీగా తగ్గడంతో ఈ ప్రభావం మార్కెట్లపై పడింది. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగు, ఐదు రోజుల నుంచి పసిడి ధరలకు కాస్త బ్రేక్ పడింది.
ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ $29 డాలర్లు తగ్గి $2,867 డాలర్లగా ఉంది. గత మూడు నెలల్లో బంగారం ఈవారం తొలిసారిగా భారీగా తగ్గింది. ఒక దశలో రికార్డు స్థాయిలో ఈ వారం గోల్డ్ $2956 డాలర్లు దాటింది. అయితే ఆ తర్వాత పసిడి ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్‌కు గురయ్యింది. ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయాలు గోల్డ్ శాపంగా మారుతున్నాయి. తాజాగా ట్రంప్‌తో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్స్కీ చర్చలు కొలిక్కి రాకపోవడం.. రాబోయే పరిణామాలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తున్నారు. అమెరికా టారిఫ్ అమలుతో గోల్డ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఢిల్లీలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,500కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86, 770 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
చెన్నైలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,620 పలుకుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,400 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86, 620కి చేరుకుంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86, 620 ట్రేడ్ అవుతోంది.
కేరళ, కోల్‌కత్తాలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,400 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86, 620 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇలా..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86, 620 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,400 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86, 620 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86, 620 పలుకుతోంది.
Also Read: ఆదాయపు పన్ను రిటర్న్స్ లో చేశారా? సవరించుకోవడానికి ఇలా ఫైల్ చేయండి.
వెండి ధరలు పరిశీలిస్తే..
గోల్డ్ రేట్స్ మాదిరిగా వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు హైదరబాద్, వైజాగ్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.1,05,000 కి చేరుకుంది.
బెంగళూరు, కోల్‌కత్తా, ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.97,000 వద్ద కొనసాగుతోంది.