BigTV English

ITR Filing: మీరు తెలివైన వారేనా? అయితే IT రిటర్న్స్ ఫైలింగ్ లో ఈ తప్పులు చేయొద్దు

ITR Filing: మీరు తెలివైన వారేనా? అయితే IT రిటర్న్స్ ఫైలింగ్ లో ఈ తప్పులు చేయొద్దు

ఆదాయపు పన్ను రిటర్నులకు దరఖాస్తులు దాఖలు చేసే ప్రక్రియ (ITR) మొదలైంది. తుది గడువు సెప్టెంబర్-15. ఈలోగా ఐటీ రిటర్న్స్ కోరేవారు దరఖాస్తులు దాఖలు చేసుకోవాలి. ఆన్ లైన్ లో ITR ఫైలింగ్ సమయంలో సహజంగా మనం చాలా తప్పులు చేస్తుంటాం. ఆ తప్పుల వల్ల రీఫండ్ రాకపోతే మనం బాధపడతాం. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కామన్ గా మనం చేసే ఈ 7 తప్పుల్ని అవాయిడ్ చేయాలి. ఇంతకీ ఆ తప్పులేంటి? వాటిని ఎలా తప్పించుకోవచ్చు? క్లియర్ గా, క్లారిటీగా, ఈ స్టోరీలో చూసేయండి


మిస్టేక్ నెంబర్-1
ఐటీఆర్ ఫైలింగ్ లో తప్పులు జరగడం సహజం. అయితే వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడం సులభం. ఇక బేసిక్ మిస్టేక్ కరెక్ట్ ITR ఫామ్ ని ఎంచుకోకపోడవం. విభిన్న రకాల ఆదాయ వనరులు ఉన్నవారు, పన్ను చెల్లింపు కేటగిరి పరిధిలోకి వచ్చేవారు.. వారికి తగిన ITR ఫామ్ ని ఎంపిక చేసుకోవాలి. తప్పుగా ఫామ్ ఎంపిక చేసుకుంటే ఐటీ రిటర్న్స్ లభించవు. రిటర్న్ ఫామ్ తిరస్కరణకు గురవుతుంది. లేకపోతే ప్రాసెసింగ్ ఆలస్యమవుతుంది. షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.1.25 లక్షల వరకు దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG) ఉంటే, ఐటీఆర్ ఫామ్-1 ను ఉపయోగించాలి. ఇక ఆదాయ వనరులు లేవు అనే ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో రిటర్న్స్ దాఖలు చేయకుండా ఉండటం కూడా నేరం అవుతుంది. విదేశీ ప్రయాణాలపై 2 లక్షల రూపాయలు ఖర్చు చేసిన వారు, కరెంటు బిల్లు లక్ష రూపాయలకు పైగా కట్టేవాళ్లు కచ్చితంగా రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే.

మిస్టేక్ నెంబర్-2
ITR ఫైలింగ్ లో సహజంగా జరిగే మరో తప్పు బడ్జెట్ మార్పులను పరిగణించకపోవడం. 2024-25 బడ్జెట్‌లో ఐటీఆర్ ఫారమ్‌ల విషయంలో నిర్మాణాత్మక మార్పులు చాలానే జరిగాయి. దీర్ఘకాలిక మూలధన లాభాల నుంచి ఇండెక్సేషన్ తొలగింపు ఇందులో ఒకటి. ఇది 2024 జూలై 23 నుంచి అమలులోకి వచ్చింది. ITR 1, 2, 3, 5 ఫామ్ లలో ఆధార్ నెంబర్ మాత్రమే ఉపయోగించాలి. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఉపయోగించడం పొరపాటు.


మిస్టేక్ నెంబర్-3
యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS), ఫారమ్ 26ASని చెక్ చేసుకోకపోవడం కూడా పెద్ద మిస్టేక్ అని చెప్పొచ్చు. AIS, 26ASలోని సమాచారాన్ని ఫారం 16, బ్యాంక్ స్టేట్‌మెంట్స్, పెట్టుబడి రుజువులతో పోల్చి చూసుకోవాలి. ఆ తర్వాతే రిటర్న్స్ ఫైల్ చేయాలి.

మిస్టేక్ నెంబర్-4
మనకు ఒకటికంటే ఎక్కువ ఆదాయ వనరులు ఉంటే, వాటన్నిటినీ దాచి పెట్టకుండా ఐటీ శాఖకు తెలియజేయాలి. పొరపాటున మనం వాటిని వదిలేసినా, ఉద్దేశపూర్వకంగానే వాటిని దాచిపెట్టామని ఐటీశాఖ అనుకోవచ్చు. దానివల్ల మనపై జరిమానా విధించే అవకాశం కూడా ఉంది.

మిస్టేక్ నెంబర్-5
పన్ను మినహాయింపు ఉన్న ఆదాయాన్ని ITR ఫైలింగ్ లో చూపించకపోవడం కూడా పొరపాటే. ఫర్ ఎగ్జాంపుల్ సావరిన్ గోల్డ్ బాండ్స్ పై వచ్చే వడ్డీ పన్ను పరిధిలోకి రాదు. కానీ దాన్ని మనం ఫైలింగ్ లో చూపించాలి. పరిధిలో లేదు కదా అని దాన్ని దాచేస్తే రిటర్న్స్ ఫామ్ చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది.

మిస్టేక్ నెంబర్-6
ఇది ఉద్యోగం మారిన వారికి సరిపోతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలు మారి వేర్వేరు ఉద్యోగాల్లో స్థిరపడిన వారు, ఆయా యాజమాన్యాల నుంచి జమానుల నుంచి ఫారం 16లను సేకరించి వాటిని సమప్ చేయాలి. అరియర్స్, బోనస్ మొదలైన వాటిని మిస్ కాకుండా ITR ఫైల్ చేయాలి.

మిస్టేక్ నెంబర్-7
హెచ్ఆర్ఏ క్లెయిమ్ విషయంలో తప్పులు చేయకూడదు. ఒకవేళ తప్పుగా మనం హెచ్ఆర్ఏ కోసం రశీదులు సృష్టించినా, యజమానులకు చెందినవి అనేట్టుగా తప్పుడు పాన్ నెంబర్లు ఇచ్చినా అది మోసం కిందకు వస్తుంది. దానికి 200 శాతం జరిమానా విధిస్తారు. ఇవీ బేసిక్ గా మనం చేసే ఏడు తప్పులు. మీరు ITR ఫైల్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ దొర్లే అవకాశముంది, జాగ్రత్త.

 

Related News

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Jio Prepaid Plans: వామ్మో .. ఏమిటి, జియో ఇన్ని రిచార్జ్ ప్లాన్స్ తొలగించిందా?

Foreclosing Loan: బ్యాంక్ లోన్ ఫోర్ క్లోజ్ చేయడం మంచిదా? కాదా? మన క్రెడిట్ స్కోర్ పై దీని ప్రభావం ఉంటుందా?

Big Stories

×