Srikanth Iyengar: ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు. నటనలో కానీ, డైరెక్షన్ లో కానీ వారిని తీసిపడేయడానికి లేదు. కానీ, బయట వారి బిహేవియర్ మాత్రం ట్రోల్ అయ్యేలా ఉంటుంది. అలా ట్రోల్ అయ్యేలా చేసుకొనేవారిలో శ్రీకాంత్ అయ్యంగర్ ఒకరు. ఆయన నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలనిజం అయినా, కామెడీ అయినా.. సపోర్టింగ్ రోల్ అయినా ఆ పాత్రలోకి శ్రీకాంత్ పరకాయ ప్రవేశం చేయనంత వరకే. ఒక్కసారి ఆ పాత్రలోకి దూరాడు అంటే అంతే.
అంతలా నటనతో కట్టిపడేసే శ్రీకాంత్ అయ్యంగర్ బయట చేసే పనులు అస్సలు నమ్మలేనివిగా ఉన్తయి. తాగిన మత్తులో చేస్తాడో.. కావాలని ఫాలోవర్స్ కోసం చేస్తాడో తెలియదు కానీ.. వివాదాలను కొని తెచ్చుకోవడంలో ముందు ఉంటాడు. ఇక గత కొంతకాలంగా శ్రీకాంత్.. తనకు గర్ల్ ఫ్రెండ్స్ కావాలని నిత్యం సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్న విషయం తెల్సిందే. మొన్నటికి మొన్న నటి జ్యోతితో తన పెళ్లి అంటూ రాసుకొచ్చాడు. ఇక నిత్యం అమ్మాయిలు కావాలని ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తూ ఉంటాడు.
కొందరు శ్రీకాంత్ పెట్టే వీడియోలు ఫన్నీ అనుకోని అలాగే కామెంట్స్ పెడతారు. ఇంకొందరు ఆయన వయస్సు ఏంటి.. ? చేసే పనులు ఏంటి అని తిట్టిపోస్తారు. ఇక ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఈ నటుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక కొత్త అనుమానానికి ఆజ్యం పోశాడు. ఈ జనరేషన్ లో రిలేషన్స్ ను పూర్తిగా పిలవలేక అందరిని బ్రో అని పిలవడం కామన్ అయ్యిపోయింది. అంతెందుకు ఆ టైటిల్ తో సినిమా కూడా వచ్చింది. బ్రో అంటే బ్రదర్ అని అర్ధం. అంటే ఇప్పటివరకు అందరూ ఇదే మీనింగ్ అనుకున్నారు. కానీ, శ్రీకాంత్ మాత్రం బ్రో కు కొత్త అర్ధం చెప్పుకొచ్చాడు. బ్రో అనే పదమే పెద్ద బూతు చేసేశాడు.
తెల్లోళ్ళు అందరూ బ్రో బ్రో అని పిలుస్తుంటే.. మనోళ్లు కూడా కాపీ కొట్టేసి బ్రో బ్రో అనేస్తున్నారు. అసలు బ్రో మీనింగ్ తెలుసా మీకు. న్యూయార్క్ లోని కొన్ని ప్లేస్ లలో బ్రోకర్లను బ్రో అంటారు అని చెప్పుకొచ్చాడు. ఇది ఫేక్ కాదని, నిజం అని కూడా చెప్పుకొచ్చాడు. దీంతో ఆ మాట విన్నవారందరూ షాక్ కు గురవుతున్నారు. ఏం మాట్లాడుతున్నావ్ స్వామి.. బ్రో అంటే అంత పెద్ద బూతా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక కొంతమంది మాత్ర ఒక పదానికి చాలా అర్దాలు ఉంటాయి. అది ఎదుటివారి ఇంటెన్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది అంటూ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో. నెట్టింట వైరల్ గా మారింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">