Cyber Fraud: అరచేతిలో స్మార్ట్ ఫోన్ విప్లవం వచ్చాక చాలా సర్వీసులు వినియోగదారులకు తేలిక అవుతున్నాయి. కేవలం సర్వీసు మాత్రమే కాదు.. కష్టాలు అదే స్థాయిలో రెట్టింపు అవుతున్నాయి. జనాభా ఎక్కువగా వున్న మనదేశంలో సైబర్ నేరాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుపోతున్నాయి. ఫలితంగా కోట్లాది రూపాయలు తస్కరిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. రోజు రోజుకూ వీరి ఆగడాలు తీవ్రం కావడంతో అటువైపు దృష్టి పెట్టింది టెలికాం విభాగం. కొత్తగా ‘ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్’ పద్దతిని ఇంట్రడ్యూస్ చేసింది. దీనివల్ల సైబర్ ఆగడాలు తగ్గుతాయా? లేదా అనేది కొద్దిరోజుల్లో తేలనుంది.
సైబర్ మోసాలను అరికట్టేందుకు టెలికం విభాగం-DOT ‘ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్’-FRI పేరిట వినూత్న సాధనాన్ని ప్రవేశ పెట్టింది. మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్ నెంబర్లను రిస్కు స్థాయిని బట్టి వర్గీకరించనుంది. ఆ వివరాలను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లకు టెలికాం అందజేయనుంది. రిస్కులో ఉన్న మొబైల్ నెంబర్లతో ఆర్థిక లావాదేవీలను వెంటనే నిలిపి వేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది.
వాస్తవానికి సైబర్ ఫ్రాడ్ కేసులతో ముడిపడి ఉన్న మొబైల్ నెంబర్లను గుర్తించవచ్చు. దీనితో చెక్ పెట్టేందుకు అవకాశాలున్నట్లు ఫోన్‌పే గణాంకాల్లో వెల్లడైందన్నది డాట్ మాట. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఉంటాయి. వీటితోపాటు చక్షు ప్లాట్‌ఫాం, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లభించే వివరాల ప్రాతిపదికన మొబైల్ నెంబర్లను మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తుంది. మధ్య స్థాయి, అధిక, అత్యధిక రిస్కు నెంబర్లు ఎఫ్‌ఆర్‌ఐ వర్గీకరించనుంది.
మోసగాళ్ళు తరచుగా మొబైల్ నెంబర్‌ను కొన్నిరోజులు ఉపయోగించి దాన్ని నిలిపి వేస్తున్నారు. దీనివల్ల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ చాలా ఉపయోగకరంగా ఉంటుందని DOT అధికారుల మాట. అనుమానాస్పద సంఖ్యల గురించి ముందస్తు నోటిఫికేషన్ అందిజేస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్‌ను PhonePe ఇప్పటికే ఉపయోగిస్తోంది.
ALSO READ: అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్
PhonePe ప్రొటెక్ట్ ఫీచర్ కింద మీడియం రిస్క్ నంబర్‌ల కోసం హెచ్చరికలను చూపుతుంది. దేశంలో 90 శాతం లావాదేవీలు UPI లావాదేవీలను నిర్వహణ జరుగుతోంది. Paytm, Google Payతోపాటు ఇతర UPI ప్లాట్‌ఫారమ్‌లు FRI సేవలు ప్రారంభించినట్టు తెలిపింది. దీనివల్ల లక్షలాది మంది సైబర్ మోసాల బారిన పడకుండా కాపాడుతుంది.