Hyderabad Investment| ఒకవైపు చారిత్రక ఘనత ఇమడ్చుకొని..మరోవైపు ఆధునికత వైపు వేగంగా సాగుతున్న నగరం హైదరాబాద్. ఐటీ, రియల్ ఎస్టేట్, ఫార్మా, సినిమా లాంటి అన్ని రంగాల్లోనూ ఎంత అభివృద్ధి సాధిస్తోందో చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతోంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సర్వే సంస్థ జెఎల్ఎల్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. హైదరాబాద్ అభివృద్ధి వేగం ఇలాగే ఇంకా కొన్ని సంవత్సరాలు కొనసాగుతుందని వెల్లడించింది.
ఒకవైపు చారిత్రక ఘనత ఇమడ్చుకొని..మరోవైపు ఆధునికత వైపు వేగంగా సాగుతున్న నగరం హైదరాబాద్. ఐటీ, రియల్ ఎస్టేట్, ఫార్మా, సినిమా లాంటి అన్ని రంగాల్లోనూ ఎంత అభివృద్ధి సాధిస్తోందో చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతోంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సర్వే సంస్థ జెఎల్ఎల్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. హైదరాబాద్ అభివృద్ధి వేగం ఇలాగే ఇంకా కొన్ని సంవత్సరాలు కొనసాగుతుందని వెల్లడించింది.
నగరం శరవేగంగా అభివృద్ధి చెందడానికి కారణాలు ఇవే..
హైదరాబాద్‌లో ప్రణాళికాబద్ధమైన మౌలిక వసతుల అభివృద్ధి, ప్రపంచ స్థాయి జీవనశైలితో పాటు ఐటీ, స్టార్టప్‌లు, వాణిజ్య భవనాలు, గోడౌన్ విభాగాల్లో వేగంగా వృద్ధి జరుగుతోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం.. మరో 3–4 సంవత్సరాల్లో భాగ్య నగరంలో 1 లక్షకు పైగా కొత్త నివాస యూనిట్ల నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. పలు పెద్ద రిటైల్ కంపెనీలు కూడా నగరంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
ఐటీ రంగం – పురోగతికి ప్రధాన కారణం
హైదరాబాద్ అభివృద్ధిలో ఐటీ/ఐటీఈఎస్ రంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది. 2022–23లో నగరం $32 బిలియన్ల విలువైన ఐటీ ఎగుమతులు చేసి దేశంలో రెండో స్థానంలో నిలిచింది. నగరంలో 4,000కి పైగా స్టార్టప్‌లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న గ్రేడ్-ఏ కార్యాలయ భవనాల్లో 15.6 శాతం హైదరాబాద్‌లో ఉన్నాయి. అంతేకాకుండా, దేశంలో ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో 17 శాతం నగరంలో ఉండటం మరో విశేషం.
బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌కు ఉన్న ప్రత్యేకతలు
ప్రపంచ స్థాయిలో పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు హైదరాబాద్ మీద పడుతోంది. ప్రముఖ పెట్టుబడి నిపుణులు చెబుతున్నట్లు, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ ధరలు తక్కువగా ఉండడం, మెరుగైన మౌలిక వసతులు ఉండటం వల్ల ఇది మంచి పెట్టుబడి ప్రాంతంగా మారుతోంది. ఐటీతో పాటు ఫార్మా, లైఫ్ సైన్స్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో సమతులిత అభివృద్ధి జరుగుతోంది.
భవిష్యత్తు ప్రణాళికలు
ఇవన్నీ నగర అభివృద్ధిని మరింత వేగవంతం చేయనున్నాయి. జెఎల్ఎల్ నివేదిక ప్రకారం.. రాబోయే రెండేళ్లలో 17–19 మిలియన్ స్క్వేర్ ఫీట్ కార్యాలయ స్థలాలు నగరంలో జోడించబడతాయి. అదేవిధంగా గోడౌన్ల సామర్థ్యం 4 మిలియన్ స్క్వేర్ ఫీట్ల మేర పెంచనున్నారు.
Also Read: రాత్రికి రాత్రికి జెండా ఎత్తేసిన దుబాయ్ కంపెనీ.. భారతీయులకు రూ. కోట్లలో నష్టం
పెట్టుబడిదారులకు భవిష్యత్తు కేంద్రం హైదరాబాద్ నగరం
తక్కువ ధరలు, మంచి వసతులు, స్థిరమైన అభివృద్ధితో హైదరాబాద్ దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే భద్రమైన పెట్టుబడి కేంద్రంగా మారుతోంది. వ్యాపారాల స్థాపనకు అనుకూల వాతావరణం ఉండటంతో సంస్థలు ఈ నగరాన్నే ఎంపిక చేసుకుంటున్నాయి. దీంతో కంపెనీలు దీర్ఘకాలికంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి.