BigTV English

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

D-Mart E Grocers: దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలో క్వాలిటీ సరుకులు, వస్తువులను అందించడంలో డి-మార్ట్ ముందుంటుంది. బయట ఎక్కడా లేని విధంగా డి-మార్ట్ లో చౌక ధరలు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు దొరుకుతాయి. డి-మార్ట్ తో పాటు మరికొన్ని స్టోర్లలో కూడా తక్కువ ధరలకే సరుకులు, వస్తువుల లభిస్తాయి. ఇంతకీ  ఆస్టోర్లు ఏవి? ఎంత ధరకు నిత్యవసరాలు లభిస్తాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


డి-మార్ట్ కు ప్రత్యామ్నాయ స్టోర్లు

⦿  JioMart


జియో మార్ట్ లో ధరలు ఇంచుమించు డి-మార్ట్ రెడీ ధరలతో సమానంగా ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువగా ఉంటాయి.  కిస్సాన్ కెచప్ లాంటి వస్తువులపై MRP కంటే 40% తక్కువ తగ్గింపు ధరలను అందిస్తుంది. ఎక్కువ ఉత్పత్తులను కొనుగోలు చేయడం, ప్రమోషన్స్ నిర్వహించడంతో పాటు దేశంలోని చాలా ప్రాంతాలకు ఉచిత, తక్కువ ధరలో డెలివరీ అందిస్తుంది. జియో మార్ట్ ప్రైవేట్ లేబుల్స్ తరచుగా బ్రాండెడ్ వస్తువుల కంటే తక్కువ ధరకు లభిస్తాయి. జియో మార్గ్   వెబ్‌ సైట్ లేదంటే యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. మీ సరుకుల కొనుగోళ్లకు సంబంధించిన ధరలను ఇతర స్టోర్లతో సరిపోల్చేకోవడం మంచిది. ఎందుకంటే డిస్కౌంట్లు ఉత్పత్తిని బట్టి మారుతూ ఉంటాయి.

⦿ బిగ్‌ బాస్కెట్

బిగ్‌ బాస్కెట్ ప్రైవేట్ లేబుల్ స్టేపుల్స్‌ పై తరచుగా డిస్కౌంట్లను అందిస్తుంది. దాని బ్రాండెడ్ వస్తువులు డి-మార్ట్ రెడీ లేదంటే జియో మార్ట్ కంటే కాస్త ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. MRPపై 11–12% తగ్గింపు ఉంటుంది. అదనపు పొదుపు కోసం ఆర్గానిక్, ప్రీమియం ఉత్పత్తుల కోసం చాలా మంది దీనిని ఎంచుకుంటారు. బిగ్‌ బాస్కెట్ యాప్, వెబ్‌ సైట్‌ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. మెట్రో,  టైర్-1 నగరాలకు బెస్ట్. స్లాట్-ఆధారిత డిస్కౌంట్లు, బల్క్ డీల్స్ కోసం దీనిని ఉపయోగించవచ్చు.

⦿ బ్లింకిట్

బ్లింకిట్ సరుకులను త్వరగా డెలివరీ చేయడంలో ముందుంటుంది. ఆర్డర్ చేసిన అరగంట లోపు అందిస్తుంది. కిరాణా సామాన్లు, వ్యక్తిగత సంరక్షణ లాంటి రోజువారీ నిత్యావసరాలపై ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఇది డి-మార్ట్ ఆన్‌ లైన్ స్టోర్ అయిన డి-మార్ట్ రెడీకి బలమైన పోటీదారుగా కొనసాగుతోంది. సరుకుల ధరలు డి-మార్ట్ తో సమానంగా లేదంటే కొన్నిసార్లు తక్కువగా ఉంటాయి.

⦿ అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్

రెండు ప్లాట్‌ ఫారమ్‌లు కిరాణా సామాన్లను MRP కంటే 11–12% మేర డిస్కౌంట్లతో అందిస్తాయి.  అయితే, డి-మార్ట్ రెడీ ధరలకు ఇంచుమించు సమానంగా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, దుస్తులు సహా పెద్ద సంఖ్యలో ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతుంది. పండుగల సందర్భంగా మరింత తక్కువ ధరలకు అమ్మకాలు కొనసాగిస్తుంది.

⦿ స్టార్‌ క్విక్

డి-మార్ట్ ఆన్‌ లైన్ ప్లాట్‌ ఫామ్‌ కు పోటీగా స్టార్‌ క్విక్ కిరాణా సామాగ్రి, గృహోపకరణాలను అందిస్తుంది.  ముఖ్యంగా ముంబై, పూణే లాంటి నగరాల్లో బాగా ఫేమస్. స్టేపుల్స్, పర్సనల్ కేర్ వంటి నిర్దిష్ట వస్తువుల కోసం డి-మార్ట్‌ తో సరి పోల్చడం మంచిది.

Read Also:  డి-మార్ట్‌ లో అత్యంత చౌకగా లభించే వస్తువులేంటీ? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారు?

 డి-మార్ట్ కు ఆఫ్‌ లైన్ ప్రత్యామ్నాయాలు

⦿ స్థానిక కిరాణా దుకాణాలు

ఈ దుకాణాలు భారతదేశ కిరాణా మార్కెట్‌లో 88% ఆధిపత్యం చెలాయిస్తాయి.  నిర్దిష్ట వస్తువులపై తక్కువ ధరలను అందించవచ్చు.రోజువారీ అవసరాలకు అనుగుణంగా డి-మార్ట్ ధరల మాదిరిగానే అందిస్తాయి. పర్సనల్ సర్వీస్,  క్రెడిట్  ఆప్షన్స్, డెలివరీ ఛార్జీలు లేకపోవడం వల్ల తక్కువ ధరలకే సరుకులు లభిస్తాయి.

⦿ రిలయన్స్ ఫ్రెష్/రిలయన్స్ స్మార్ట్

రిలయన్స్ రిటైల్ దుకాణాలు డి-మార్ట్ తో నేరుగా పోటీపడతాయి. తక్కువ ధర, బల్క్ డిస్కౌంట్లను అందిస్తాయి.  కొన్ని బ్రాండెడ్ ఉత్పత్తులపై మెరుగైన డీల్స్ అందిస్తాయి.  విస్తృత స్టోర్ నెట్‌ వర్క్, క్లీన్ స్టోర్‌లు, కిరాణా, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను అందిస్తాయి.

⦿ విశాల్ మెగా మార్ట్

కిరాణా సామాగ్రి, దుస్తులు, గృహోపకరణాలపై సరసమైన ధరలకు మరో డెస్టినేషన్  విశాల్ మెగా మార్ట్. ఈ స్టోర్ లోని కొన్ని వస్తువుల ధరలు డి-మార్ట్‌ కంటే తక్కువగా ఉంటాయి. డి-మార్ట్ మోడల్ మాదిరిగానే విస్తృత వస్తువుల శ్రేణి కలిగి ఉంటుంది.

Read Also: రిలయన్స్ ఫ్రెష్, డి-మార్ట్.. దేనిలో ధరలు తక్కువ, ఎందుకు?

Related News

Trump: ట్రంప్ నిర్ణయాలు.. కంప్యూటర్ల ధరలకు రెక్కలు, వాటితోపాటు

EPFO New Rule: పీఎఫ్ డబ్బులతో ఇల్లు కట్టాలి అనుకుంటున్నారా? ఈ గుడ్ న్యూస్ మీకే.. EPFO కొత్త మార్గదర్శకాలివే!

Jio Recharge Plans: మిస్ అయ్యానే.. జియోలో ఇన్ని ఆఫర్లు ఉన్నాయా!

iPhone 17 Air: వావ్ ఎంత స్మూత్‌గా ఉంది.. iPhone 17 Air సూపరబ్బా.

Bank Holidays: ఏంటీ ఆ మూడు రోజులు బ్యాంక్ పనిచేయవా.. ముందుగా ప్లాన్ చేసుకోండి ఇలా..

Big Stories

×