Monthly Income Scheme:సాధారణంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. అంతర్జాతీయంగా యుద్ధ భయం, మాంద్యం సహా అమెరికా నిర్ణయాలు కూడా భారత స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపిస్తాయి. దీంతో లాభాలతోపాటు నష్టాలు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మాకు ఎలాంటి రిస్క్ వద్దు. ప్రతి నెలలో కూడా స్థిరమైన ఆదాయం కావాలని అనేక మంది కోరుకుంటారు. అలాంటి వారికి పోస్టాఫీస్ మంత్లీ స్కీమ్ బెస్ట్ ఛాయిస్.
ఒకసారి పెట్టుబడి చేసి
దీనిలో బ్యాంక్ వడ్డీల కంటే మెరుగైన రాబడి వస్తుంది. దీంతోపాటు భద్రత కూడా ఉంటుంది. ఇది ప్రధానంగా వృద్ధులు, గృహిణులు, సంప్రదాయ పెట్టుబడిదారుల కోసం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. నెలకు స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. దీనిలో మీరు ఒకసారి పెట్టుబడి చేసి హాయిగా నిద్రపోతూ కూడా నెలకు కొంత మొత్తాన్ని పొందవచ్చు. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. అయితే ఈ స్కీం ద్వారా నెలకు రూ.5,550 రాబడి రావాలంటే, ఎంత పొదుపు చేయాలి, ఎన్నేళ్లు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
అసలు పోస్టాఫీస్ MIS స్కీం అంటే ఏంటి
ఇది పోస్టాఫీస్ గవర్నమెంట్ పొదుపు పథకం. దీంట్లో మీరు ఒకేసారి డబ్బు పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందవచ్చు. మాములుగా చెప్పాలంటే మీ డబ్బు పోస్ట్ ఆఫీస్‌లో ఉంచుతారు. దాని ద్వారా మీకు ప్రతి నెలలో కూడా వడ్డీ రూపంలో నగదు లభిస్తుంది.
Read Also: Bluetooth Earbuds: బ్లూటూత్ ఇయర్‌బడ్ లింక్ కాలేదా..ఈ …
ఎన్నేళ్లు చేయాలంటే
ఈ ఖాతాలో వ్యక్తిగతంగా (Individual) గరిష్టంగా రూ. 9 లక్షలు పెట్టుబడి చేయవచ్చు. సంయుక్త ఖాతా (Joint Account) కోసం రూ. 15 లక్షలు వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. Joint Accountలో ఇద్దరు సభ్యుల పేర్లు ఉండాలి. పెట్టుబడి మొత్తం ఇద్దరిదీ కలిపి రూ. 15 లక్షలకు మించకూడదు. అంటే ఒక్కో సభ్యుడికి రూ. 7.5 లక్షల పరిమితి. ఈ స్కీం కాల వ్యవధి 5 సంవత్సరాలు. మధ్యలో డబ్బు అవసరం అయితే, కొన్ని షరతులతో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
3 నెలలకోసారి
ఈ స్కీంలో ప్రస్తుతం వడ్డీ రేటు సంవత్సరానికి 7.4%. దీన్ని నెలవారీగా చెల్లిస్తారు. దీనిలో మీరు రూ. 9 లక్షలు పెట్టుబడి పెడితే మీకు ఏడాదికి రూ.66,600 రూపాయలు లభిస్తాయి. అంటే నెలకు రూ. 5,550 వస్తాయి. 3 నెలలకోసారి చెల్లింపు తీసుకుంటే రూ.5,550 × 3 = రూ.16,650 వస్తుంది.
MIS 2025లో పెట్టుబడి చేస్తే వచ్చే ప్రయోజనాలు
-ఇది భారత ప్రభుత్వ మద్దతుతో కూడిన స్కీం. కాబట్టి మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది
-నెల నెలా వడ్డీ రూపంలో డబ్బు వచ్చేలా ఉంటుంది. ఇది పెన్షనర్లకు లేదా గృహిణులకు ఎంతో ఉపయోగకరం.
-మార్కెట్‌పై ఆధారపడదు. FD లాగే నిర్దిష్ట వడ్డీ రేటుతో రాబడి లభిస్తుంది
-5 సంవత్సరాల తర్వాత మీరు డబ్బు తీసుకోవచ్చు లేదా మళ్లీ అదే MISలో పెట్టుబడి చేయవచ్చు
అర్హతలు & అవసరమైన డాక్యుమెంట్లు
-కనీసం 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరులు
-మైనర్ కోసం సంరక్షకుడు ఖాతా తెరచవచ్చు
-ఉమ్మడి ఖాతా (జంటగా ముగ్గురు వరకు)
అవసరమైన పత్రాలు:
-ఆధార్ కార్డ్
-పాన్ కార్డ్
-చిరునామా రుజువు
-2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది?
-సమీప పోస్టాఫీస్ బ్రాంచ్‌కి వెళ్లండి
-MIS ఫారమ్ తీసుకుని పూరించండి
-అవసరమైన డాక్యుమెంట్లు జత చేయండి
-చెక్ లేదా క్యాష్ ద్వారా డబ్బు జమ చేయండి
పెట్టుబడి చేసే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
-ఈ వడ్డీపై పన్ను విధించబడుతుంది. మీ ఆదాయ స్లాబ్‌ను బట్టి.
-80C కింద ట్యాక్స్ బెనిఫిట్ లేదు
-ఆన్‌లైన్ సదుపాయం లేదు. ఖాతా నిర్వహణ పూర్తిగా ఆఫ్‌లైన్.
-పూర్తిగా 5 ఏళ్లు కొనసాగించాలి, లేకపోతే ముందస్తు విరమణకు కొంత జరిమానా ఉంటుంది.