భారతీయ రైల్వేలో రోజు రోజుకు గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేగంగా, సేఫ్ గా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఎప్పటికప్పుడు రైల్వే అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో రైళ్ల వేగాన్ని పెంచాలని భావిస్తున్నారు. ముందుగా అహ్మదాబాద్- ముంబై, ఢిల్లీ-హౌరా మార్గంలో నడుస్తున్న రైళ్ల గరిష్ట వేగాన్ని అప్ డేట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్లు గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నారు. ఈ వేగాన్ని త్వరలో గంటకు 160 కి.మీ. వరకు పెంచాలని భావిస్తున్నారు. ఇందుకోసం కావాల్సిన మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేస్తున్నారు.
వేగాన్ని పెంచేందుకు కీలక చర్యలు
ప్రయాణ వేగాన్ని మరింత తగ్గించేందుకు రైళ్ల వేగాన్ని పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం 1,450 కి.మీ పొడవైన ఢిల్లీ- హౌరా సెక్షన్ తో పాటు 1,386 కి.మీ. పొడవైన ఢిల్లీ- ముంబై సెక్షన్ లో రైళ్ల వేగానికి అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ఇందుకోసం రూ. 3,950 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ. 226 కోట్ల అంచనా వ్యయంతో 595 కి.మీ. ముంబై- అహ్మదాబాద్ సెక్షన్ వెంబడి కంచెను నిర్మిస్తున్నారు. ఈ కంచె ఆవులు, గేదెలు సహా ఇతర పశువులు పట్టాల మీదికి రాకుండా అడ్డుకుంటుంది. ఇక గంటలకు 160 కి.మీ వేగంతో రైళ్లు ప్రయాణించేలా 126 వంతెనలపై బ్రిడ్జి అప్రోచ్ లను జియో సెల్ లను ఉపయోగించి బలోపేతం చేశారు.
శరవేగంగా మౌలిక వసతుల అప్ గ్రేడ్
అటు ఢిల్లీ-ముంబై మార్గంలో రైళ్ల వేగం, సామర్థ్యాన్ని పెంచడానికి పలు కీలకమైన పనులు, సర్వేలు జరుగుతున్నాయి. సెక్షనల్ వేగాన్ని గంటకు 160 కి.మీ/గంకు పెంచే ప్రాజెక్ట్ మంజూరు చేయబడింది. పనులు మొదలయ్యాయి. మొత్తం 1,386 కి.మీ మార్గంలో 196 కి.మీ.లో ఇప్పటికే నాలుగు రైలు మార్గాలు ఉన్నాయి. దహను రోడ్- విరార్ (64 కి.మీ) మధ్య 3వ, 4వ లైన్ల నిర్మాణం జరుగుతోంది. మిగిలిన 1,126 కి.మీ. విభాగంలో 3వ, 4వ లైన్ల కోసం సర్వేలు మంజూరు అయ్యాయి. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డబుల్ లైన్) 1,404 కి.మీ పరిధిలో. ప్రారంభించబడింది. మిగిలిన 102 కి.మీ. విభాగంలో పనులు జరుగుతున్నాయి. అటు 508 కి.మీ. పొడవునా ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ (డబుల్ లైన్) నిర్మాణం కొనసాగుతోంది.
Read Also: సమ్మర్ లో తిరుపతి, శ్రీకాళహస్తికి వెళ్లాలి అనుకుంటున్నారా? IRCTC స్పెషల్ ప్యాకేజీ ట్రై చేయండి!
ఇక 2014- 2024 మధ్య గుజరాత్ లో 165 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, 779 రోడ్ అండర్ బ్రిడ్జిలు నిర్మించారు. అదనంగా, 1,264 మనుషుల కాపలా అవసరం లేని రైల్వే క్రాసింగ్ లు, 614 రైల్వే గేట్లు మూసివేయబడ్డాయి. ముఖ్యంగా, గుజరాత్ లోని 4,640 కి.మీ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లలో 100% పనులు పూర్తయ్యాయి. మొత్తంగా రైళ్ల వేగాన్ని పెంచే దిశగా భారతీయ రైల్వే కీలక చర్యలు తీసుకుంటున్నది.
Read Also: ఇక రైలు ప్రయాణంలోనూ డబ్బులు డ్రా చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?