Balakrishna : కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో రానున్న సినిమా 45. ఈ సినిమాలో ఉపేంద్ర రాజ్ బి.శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.అర్జున్ జన్య దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా రానుంది. సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. మూవీ టీం ప్రమోషన్ లో భాగంగా హైదరాబాదులో టీజర్ ని రిలీజ్ చేశారు. అందులో భాగంగా శివరాజ్ కుమార్, ఉపేంద్ర,మూవీ టీం మీడియాతో ముచ్చటించారు. జైలర్ 2 సినిమా గురించి, అందులో టాలీవుడ్ బడా హీరో నటిస్తున్నారన్న దాని గురించి శివన్న ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..
జైలర్ 2 లో అయన వున్నారా ..
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాలో అతిధి పాత్రలో మెప్పించారు శివన్న. ఈ సినిమా తో తమిళ్,తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యారు శివన్న. హైదరాబాదులో ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాంలో, శివన్నను జైలర్ టు సినిమా గురించి, ఆ సినిమాలో మీరు బాలకృష్ణతో కలిసి నటిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు శివన్న మాట్లాడుతూ ‘ జైలర్ టు సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారన్న విషయం నాకు తెలియదు. ఆ సినిమాలో నా పాత్ర మాత్రం దర్శకుడు నెల్సన్ చెప్పాడు. బాలకృష్ణ కూడా ఆ సినిమాలో ఉంటే నాకు సంతోషమే ఇప్పటివరకు మేమిద్దరం కలిసి ఏ సినిమాలోనూ చేయలేదు. బాలకృష్ణ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో ఒక పాత్రలో నేను నటించాను. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్సే లా కలిసే ఉంటాము. ఆయన జైలర్ 2 చేస్తున్నారా లేదా అన్న విషయం నాకు తెలియదు’ అని శివన్న సమాధానం చెప్పాడు. జైలర్ మొదటి భాగం లో ఇద్దరు స్టార్ హీరోలను అతిధి పాత్రలో తీసుకున్నారు. శివన్న, మోహన్ లాల్, ఇద్దరు నటించారు ఇప్పుడు జైలర్ 2 లో అలానే తీసుకుంటారు అని అందరు అనుకున్నారు. శివన్న, బాలకృష్ణ ఇద్దరు చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు శివన్న సమాధానం తో అది నిజం కాదని తేలిపోయింది.
45 సినిమా పాయింట్ అదే ..
ఇక శివన్న తన 45 సినిమా గురించి ముచ్చటించారు. ఈ సినిమా సనతన ధర్మానికి సంబంధించినది. సినిమా పోస్టర్, టీజర్ దానికి భిన్నంగా ఉన్న సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అని, 45 రోజుల్లో ఏం జరిగింది అనే పాయింట్ ఆధారంగా సినిమా ఉంటుంది అని శివన్న తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ చూసిన అభిమానులు సినిమాలో విజువల్ ఎఫెక్ట్ అద్భుతంగా ఉందని, హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఈ సినిమాను నిర్మించారని అంటున్నారు.ఈ టీజర్ లో శివన్న ప్రత్యేకంగా డిజైన్ చేసిన బైక్ పై కనిపిస్తారు. ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో ఉపేంద్ర నటించారు. ఈ సినిమాను ఆగస్టు 15 న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకులకు అందించనున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అటు కన్నడ లోనే కాక తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అవుతుందని లో ఎటువంటి సందేహం లేదు.
Kruthi Shetty: అప్పుడే కంప్లీట్… హీరో హీరోయిన్ సూపర్ స్పీడ్ లో ఉన్నారు