BigTV English

Electric Car Sales June 2024: జూన్‌ నెలలో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్..పెరిగాయా..? తగ్గాయా..?

Electric Car Sales June 2024: జూన్‌ నెలలో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్..పెరిగాయా..? తగ్గాయా..?

Electric Car Sales June 2024: దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఈ మేరకు ప్రముఖ కంపెనీలు కస్టమర్స్‌ను పరిగణలోకి తీసుకొని తమ వాహనాలను ఎలక్ట్రిక్ వాహన విభాగంలో లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు అత్యధికంగా సేల్స్ చేశాయి. గత ఏడాది నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.


జూన్ నెలలో పలు కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు మంచి అమ్ముడుపోయాయి. కానీ గతేడాదితో పోల్చితే అమ్మకాలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా, ఎఫ్ఏడీఏ విడుదల చేసిన డేటా ప్రకారం.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో జూన్ 2024లో 13.51శాతం తగ్గడంతో కేవలం 6,894 యూనిట్లకు పడిపోయాయి. అంతకుముందు ఏడాది జూన్ 2023లో 7,971 యూనట్లు అమ్ముడుపోయాయి.

జూన్ నెలలో అత్యధికంగా సేల్స్ అయిన ఎలక్ట్రిక్ వాహనాలలో టాటా మోటార్స్ 4,346 యూనిట్ల విక్రయాలతో అగ్రస్థానంలో ఉంది. ఎఫ్ఏడీఏ విడుదల చేసిన జాబితాలో 58.6శాతం వాటాను కలిగి ఉంది. అంతకుముందు ఏడాది జూన్ 2023లో 5,485 యూనిట్లు, మే 2024లో 5,083 యూనిట్లను విక్రయించింది. టాటా మోటార్స్ ప్రస్తుతం టియాగో, టిగ్గర్‌లను విక్రయిస్తోంది. ఇందులో భాగంగా పంచ్, నెక్సాన్ కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాలను లైనప్‌ను విస్తరించే ప్రక్రియలో కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ, సియెర్రా ఈవీ తీసుకొచ్చింది.


Also Read: జియో, ఎయిర్‌టెల్‌లను దెబ్బతీసేలా BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్.. వారెవ్వా అదిరిపోయింది..!

ఇక, ఈ జాబితాలో ఎంజీ మోటార్ రెండో స్థానంలో కొనసాగుతోంది. జూన్ 2024లో 1,405 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంతకుముందు జూన్ 2023లో 1,160 యూనిట్లు ఉండగా.. ఈ ఏడాది 21.12శాతం వృద్ధి సాధించింది. అలాగే 446 అమ్మకాలతో మహీంద్రా మూడో స్థానంలో ఉంది. జూన్ 2023లో విక్రయించిన 413 యూనిట్ల నుంచి 7.99శాతం వృద్ధితో 446 యూనిట్లు చేసింది. అయితే మే 2024లో 564 యూనిట్ల విక్రయాలు జరిగాయి. కాగా, ప్రస్తుతం xuv400ev ధర రూ.15.49 నుంచి 19.30 లక్షలు వరకు అందుబాటులో ఉంది.

Tags

Related News

బంగారంలో మాత్రమే కాదు ఇకపై ఈ లోహంలో కూడా పుత్తడిని మించిన లాభం రావడం ఖాయం..

ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలని ఉందా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవండి..

ఇకపై టోల్ గేట్ అడ్డంకులు లేవు…నేటి నుంచి ఫాస్టాగ్ పాస్ అమలు..ఇలా రీచార్జ్ చేయించుకోండి..

Scheme for women: మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్ – వడ్డీ లేకుండా 5 లక్షల రుణం

PM Modi On Gst: ఎర్రకోట నుంచి సామాన్యులకు మోదీ శుభవార్త .. దీపావళి గిఫ్ట్, పన్ను రేట్ల తగ్గింపు

DMart Offer: డీమార్ట్ అద్భుతమైన ఆఫర్.. ఇవన్నీ సగం ధరకే.. ఇదే మంచి అవకాశం

Big Stories

×