Portable Air Cooler: ప్రస్తుతం వేసవి కాలం రానే వచ్చింది. దీంతో ప్రతి ఇంట్లో కూడా కూలర్ తప్పక ఉపయోగిస్తారని చెప్పవచ్చు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు అనేక మంది కూడా వారి ఇళ్లల్లో కూలర్లను వినియోగిస్తారు. అయితే మారుతున్న కాలం ప్రకారం కూలర్లలో కూడా అనేక రకాలు వచ్చాయి. ఎక్కడికైనా తీసుకెళ్లే చిన్న పోర్టబుల్ కూలర్లు కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉండగా, దీంతోపాటు ఇంట్లో ఏర్పాటు చేసుకునేవి కూడా వచ్చాయి.
అయితే మీకు తక్కువ ధరకు రూ. 575కే లభించే కూలర్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. అదే NTMY ఎయిర్ కండిషనర్ పోర్టబుల్ కూలర్. ఇది అందరికీ అందుబాటులో ఉండే విధంగా చిన్నగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాదు ఇది అన్ని వయసుల వారికీ ఉపయోగపడుతుంది. దీంతోపాటు దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన ఈ మోడల్లో అనేక ఫీచర్లు ఉన్నాయి.
NTMY ఎయిర్ కండిషనర్ పోర్టబుల్ కూలర్ చిన్న పరికరం మాదిరిగా కనిపిస్తుంది. దీన్ని మీరు ఇంట్లో లేదా ఏదైనా బయట ప్రాంతానికి వెళ్లినప్పుడు కూడా తీసుకెళ్లి ఉపయోగించుకోవచ్చు. వేసవి కాలంలో ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వారికి ఇది ఎంతో సౌకర్యంగా పనిచేస్తుంది.
ఈ పరికరంలో మరో అదనపు విశేషం ఏంటంటే, దీనిలో 7 రంగుల LED లైట్ కలదు. ఇది మీ పరికరాన్ని చక్కగా ఆకర్షణీయంగా చూపిస్తుంది. మీరు దీన్ని మీ డెస్క్, నైట్‌స్టాండ్ లేదా కాఫీ టేబుల్ పై పెట్టుకుంటే వెలుగులతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని రంగులు కాంతివంతంగా ఉండడంతో మీరు దీన్ని ఉపయోగించే సమయంలో ఒక రకమైన స్టైలిష్ అనుభూతిని పొందుతారు.
Read Also: Investment Tips: నెలకు జస్ట్ రూ. 5400 సేవింగ్.. ఈ స్కీంలో రెండు కోట్ల రాబడి పక్కా..!
NTMY పోర్టబుల్ కూలర్ మినీ ఎవాపరేటివ్ ఎయిర్ కూలర్ గా పని చేస్తుంది. ఇది నీటిని తీసుకుని, గాలిని శీతలీకరించడంలో సహాయం చేస్తుంది. ప్రధానంగా వేసవిలో చల్లగా ఉండాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా ఉంటుంది.
ఈ పోర్టబుల్ కూలర్‌లో 3 గాలి వేగాలు ఉన్నాయి. అంటే మీరు గాలిని ఇష్టానుసారం వేగంగా లేదా మెల్లగా మార్చుకోవచ్చు. అదేవిధంగా ఇందులో 3 స్ప్రే మోడ్‌లు కూడా ఉన్నాయి. ఈ మోడ్‌ల ద్వారా మీరు గాలి పరిమాణాన్ని నియంత్రించుకోవచ్చు. అవసరానికి అనుగుణంగా మీరు గాలిని ఎక్కువగా లేదా తక్కువ చేసుకోవచ్చు.
NTMY పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ ఫ్యాన్ లో 1/2/3 గంటల టైమర్ ఫీచర్ కూడా ఉంది. మీరు కావలసిన సమయానికి ఈ ఫ్యాన్ ఆగిపోయేలా టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మీకు మరింత సౌకర్యవంతంగా ఉపయోగపడుతుంది.
ఈ కూలర్ ను మీరు అనేక ప్రదేశాల్లో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మీ డెస్క్, నైట్‌స్టాండ్ లేదా కాఫీ టేబుల్ లేదా బయట ప్రదేశాలలో కూడా అమర్చుకోవచ్చు. ఎక్కడైనా పరికరాన్ని పెట్టి వాడుకోడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
NTMY పోర్టబుల్ కూలర్ కాబట్టి ఇది విద్యుత్ అవసరాలను చాలా వరకు తగ్గిస్తుంది. ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఎక్కువగా ఎలక్ట్రిసిటీ ఖర్చు చేయకుండా, సులభంగా ఈ పరికరాన్ని వాడుకోవచ్చు. ఇది ప్రస్తుతం అమెజాన్లో అందుబాటులో ఉంది.