BigTV English

EPFO: పీఎఫ్ డబ్బులు త్వరలోనే ఏటీఎం నుంచి తీసుకునే ఛాన్స్..ఈపీఎఫ్ నుంచి బిగ్ అప్ డేట్ ఇదే..

EPFO: పీఎఫ్ డబ్బులు త్వరలోనే ఏటీఎం నుంచి తీసుకునే ఛాన్స్..ఈపీఎఫ్ నుంచి బిగ్ అప్ డేట్ ఇదే..

కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ విషయంలో కోట్లాదిమంది ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేలా అనేక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈపీఎఫ్ఓ 3.0 పేరిట అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా గతంలో పిఎఫ్ డబ్బులను ఉపసంహరించుకోవాలంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. ఆ తర్వాత ఆమోదం పొందడానికి మరికొన్ని రోజులు పట్టేది ఇలా డబ్బులు ఉపసంహరించి మీ అకౌంట్లో పడేందుకు మరింత ఎక్కువ రోజులు సమయం పట్టేది. అయితే ఎక్కువగా ప్రైవేటు ఉద్యోగులు వివిధ కారణాల వల్ల పీఎం డబ్బులను ఉపసంహరించుకోవాలి అనుకుంటారు. ఇందులో ప్రధానంగా ఇంటి నిర్మాణము, ఆరోగ్య కారణాలు, వివాహము, ఉద్యోగం కోల్పోవడం వంటివి ప్రధానమైన కారణాలుగా చెప్పవచ్చు. కారణం ఏదైనాప్పటికీ పీఎఫ్ డబ్బులు గతంలో ఉన్న విధానాల వల్ల ఎక్కువ సమయం పట్టేది. దీని దృష్టిలో ఉంచుకొని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ బోర్డు ట్రస్టీలు పలు కీలకమైన విప్లవత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా తీసుకున్న నిర్ణయాలను ఈపీఎఫ్ఓ 3.0 పేరిట అమలు చేస్తామని పేర్కొన్నారు.


ఈపీఎఫ్ఓ 3.0లో అత్యంత కీలకమైనది ఏటీఎం ద్వారా పిఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌలభ్యం కల్పించడం. సంస్కరణలో భాగంగా ఏటీఎం ద్వారా ఈపీఎఫ్ఓ సభ్యుడు తమ డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది. గతంలో ఉన్న పద్ధతుల ప్రకారం చూసినట్లయితే, ఇది చాలా సులువైన మార్గం అని చెప్పవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన ఏటీఎం కార్డులను సైతం ఈపీఎఫ్ఓ సభ్యులకు జారీ చేసేందుకు కూడా సంస్థ సిద్ధంగా ఉన్నట్లు ప్రతిపాదనలు వచ్చాయి. ఈపీఎఫ్ఓతో అనుసంధానం అయినటువంటి బ్యాంకుల ఏటీఎం నుంచి ఈ పిఎఫ్ డబ్బులను, ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డు ద్వారా ఉపసంహరించుకునే అవకాశం కల్పించనున్నట్లు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ 3.0 నిబంధనల్లో భాగంగా 1 లక్ష రూపాయల విత్ డ్రా లిమిట్ ను ఐదు లక్షల రూపాయలకు పెంచారు. గతంలో ఈ నిబంధన వల్ల ఉద్యోగులు ఎంతో ఇబ్బందులు పడ్డారు.. అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే పిఎఫ్ డబ్బులను ఉపసంహరించుకునే అవకాశం కల్పిస్తారు.


ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంకా ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డు విషయంలో ఎలాంటి కీలకమైన నిర్ణయం కార్యాచరణ ప్రారంభించలేదు. అయితే భవిష్యత్తులో యూపీఐ ద్వారా కూడా పిఎఫ్ డబ్బులను ఉపసంహరించుకునే అవకాశం కల్పిస్తామని ఈపీఎఫ్ఓ 3.0లో పేర్కొన్నారు. దీనివల్ల ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను కష్ట సమయాల్లో ఉపసంహరించుకోవడానికి వీలు కలుగుతుంది.

మరోవైపు ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు కొన్ని ముఖ్యమైన అర్హతలను నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో అత్యంత ప్రధానమైనది మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్. (యూఏఎన్) యాక్టివేట్ అయి ఉండాలి . దీంతోపాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యూఎఎన్ తో లింక్ అయి ఉండాలి. దీంతోపాటు మీ బ్యాంకు ఎకౌంటు కూడా యాక్టివ్ గా ఉండాలి.

Related News

Ola Super Bike: ఓలా నుంచి సూపర్ బైక్, ధర రూ.5 లక్షలు.. భారత్ లో ఎంట్రీ ఎప్పుడంటే?

అమెరికా నుంచి మీ పిల్లలు డబ్బులు పంపుతున్నారా..అయితే ఈ ఐటీ రూల్స్ తెలుసుకోవాల్సిందే..

బంగారం vs రియల్ ఎస్టేట్: భూమిపై పెట్టుబడి పెడితే లాభమా…బంగారం కొంటే లాభమా..?

GST: కొత్త జీఎస్‌టీ ఎఫెక్ట్.. వీటి ధరలు బాగా తగ్గుతాయట.. అవి మాత్రం కాస్ట్లీనే!

Biggest Gold Mines: దేశంలో బయటపడుతున్న బంగారు గనులు.. ఈ ప్రాంతాల్లో టన్నుల కొద్ది పసిడి నిక్షేపాలు..

Big Stories

×