E-Paper
Advertisement

Aishwarya Rai: అసలైన ఆత్మగౌరవం దొరికేది అక్కడే.. సోషల్ మీడియాపై ఐశ్వర్య ఫైర్!

Aishwarya Rai: అసలైన ఆత్మగౌరవం దొరికేది అక్కడే.. సోషల్ మీడియాపై ఐశ్వర్య ఫైర్!
Advertisement

Aishwarya Rai: ఈ మధ్య సోషల్ మీడియాలో ఏది పడితే అది రాసేస్తూ విపరీతంగా వైరల్ అవ్వడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందులో నిజం ఉందో అబద్ధం ఉందో తెలియకుండానే సోషల్ మీడియాలో దాన్ని ఒకరి తర్వాత మరొకరు షేర్ చేస్తూ క్షణాల్లో దాన్ని వైరల్ అయ్యేలా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సోషల్ మీడియాపై తాజాగా ఫైర్ అయింది నటి ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai). ముందు సోషల్ మీడియా నుండి బయటికి రండి అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి సోషల్ మీడియాపై ఐశ్వర్యరాయ్ ఎందుకు ఫైర్ అయ్యింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సోషల్ మీడియా ఆత్మగౌరవాన్ని పెంచదు – ఐశ్వర్యరాయ్

Advertisement

తాజాగా ఐశ్వర్యరాయ్ లోరియల్ పారిస్ లెసన్స్ ఆఫ్ వర్త్ సిరీస్ కోసం ఒక పవర్ఫుల్ సందేశాన్ని అందించింది. అయితే ఇందులో సోషల్ మీడియాకి సంబంధించి సంచలన కామెంట్లు చేసింది. “సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు, లైకులు, షేర్లు ఇవి మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని బయట ప్రపంచానికి చూపవు, తెలియనివ్వవు.. మన విలువను ఏది కూడా నిర్ణయించలేదు. నిజమైన అందం అనేది మనలోనే మన మనసులోనే ఉంటుంది. సోషల్ మీడియా పట్ల చాలామంది ఆకర్షితులవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది సోషల్ మీడియాకి బానిస అవుతున్నారు. కానీ సోషల్ మీడియాను దాటి చూసినప్పుడే అసలైన ప్రపంచం ఏంటో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఆత్మగౌరవం అనేది దొరకదు” అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది.

ఆందోళన కలిగించే అంశం – ఐశ్వర్యరాయ్

Advertisement

“ఒక తల్లిగా నేను ఈ సోషల్ మీడియా సమస్యను ఒక తీవ్రమైన ఆందోళన కలిగించే విషయంగా చెబుతాను.
సోషల్ మీడియా , సామాజిక ఒత్తిడి ఈ రెండింటి మధ్య పెద్ద తేడా లేదు. నేను ఒక మహిళగా..తల్లిగా.. యువతపై ఈ సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని ఆలోచించాను. కానీ యువత ఈ సోషల్ మీడియాకి బానిస అవుతున్నారు. ఇదే ఆందోళన కలిగించే విషయం. ఇది ఇలా కొనసాగకూడదని నా అభిప్రాయం” అంటూ ఐశ్వర్య రాయ్ సోషల్ మీడియా గురించి చెప్పుకొచ్చింది. ఐశ్వర్య రాయ్ సోషల్ మీడియా గురించి మాట్లాడిన మాటలను చాలా మంది సమర్థిస్తున్నారు. ఎంతోమంది ఐశ్వర్య ఇచ్చిన సందేశాన్ని మెచ్చుకుంటున్నారు.

ఐశ్వర్య ఆలోచనలకు నెటిజన్స్ ఫిదా..

అంతేకాదు ప్రపంచంలో ఉన్న వాళ్లందరూ ఐశ్వర్య రాయ్ ఎందుకలా చెబుతుందో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఐశ్వర్యరాయ్ , అందం అభినయమే కాదు ఇలాంటి ఆలోచనాత్మక విషయాలను కూడా మాట్లాడడంలో దిట్ట అంటూ పొగుడుతున్నారు. అలా ఐశ్వర్యరాయ్ సోషల్ మీడియా గురించి ఇచ్చిన సందేశం ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఐశ్వర్యరాయ్ సినిమాల విషయానికొస్తే..చివరిగా మణిరత్నం డైరెక్షన్ లో పొన్నియిన్ సెల్వన్-1, పొన్నియిన్ సెల్వన్ -2 రెండు సినిమాల్లో కనిపించింది.ఆ తర్వాత సినిమాలేవి ప్రకటించలేదు.

ALSO READ:Sridevi: అందుకే ఆ ఫీలింగ్ కలగలేదు – శ్రీదేవి కామెంట్స్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×