BigTV English

Dilraju: రాజుగారికి ఏం అయింది.. ఆయన జడ్జిమెంట్‌కి ఏం అయింది ?

Dilraju: రాజుగారికి ఏం అయింది.. ఆయన జడ్జిమెంట్‌కి ఏం అయింది ?

Dilraju: దిల్ రాజు.. సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక బ్రాండ్ అనే చెప్పాలి.. పంపిణీదారుడిగా కెరియర్ మొదలుపెట్టిన దిల్ రాజు.. సినిమా కథల ఎంపిక విషయంలో తన టాలెంట్ ను ఉపయోగించి ఒక్కో మెట్టు ఎక్కుతూ…రెండు దశాబ్దాల కాలంలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సొంతం చేసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించి.. అద్భుతమైన జడ్జ్మెంట్ తో.. సినిమాలను ఎంపిక చేసుకొని.. వాటి విజయాలతో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఒక కథను ఫైనలైజ్ చేశారు అంటే తెరపై ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే టాక్ వినిపించిన రోజులు కూడా ఉన్నాయి.


దిల్ రాజు జడ్జిమెంట్ లో భారీ మార్పు..

అంతేకాదు ఒక డైరెక్టర్ కథ చెప్పాడు అంటే అప్పుడే అంచనా వేయగల నిపుణుడు కూడా.. కానీ ఈ మధ్య ఆయన జడ్జిమెంట్ దారి తప్పుతోంది. ఆయన నిర్మించే సినిమాలు, ఆయన డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడుతూ… డిజాస్టర్ అనే ట్యాగ్ ను మూటగట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సమంత శాకుంతలం సినిమా నుంచి ఈయన జడ్జిమెంట్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా నుంచే దిల్ రాజు జడ్జిమెంట్ లోపించింది అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.


దిల్ రాజుకి ఏమైంది?

దీనికి తోడు రీసెంట్ గా వచ్చిన నితిన్ (Nithin) ‘తమ్ముడు’ సినిమాతో కూడా దిల్ రాజు జడ్జిమెంట్ పూర్తిగా గాడి తప్పిందని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. నిజానికి ఈ సినిమాకు రూ.75 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే.. కేవలం రూ.10 కోట్లు కూడా రాబట్టలేకపోయింది ఈ సినిమా. దీన్నిబట్టి చూస్తే నిర్మాతగానే కాకుండా తన నిర్ణయాల విషయంలో కూడా ఆయన ఫెయిల్ అయ్యారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిర్మాతగానే కాదు ఇటు డిస్ట్రిబ్యూటర్ గా చేసిన సినిమాలు కూడా ఫెయిల్ అవ్వడంతో.. రాజుగారికి ఇప్పుడు ఏమైంది? ఆయన జడ్జిమెంట్ కి ఏమైంది? ఆయన సెలెక్ట్ చేసుకుంటున్న సినిమా కథలు ఏవీ కూడా ఎందుకు ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించలేదు? అంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రేక్షకులు..

నిర్మాతగానే కాదు డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఫెయిల్..

ఒకప్పుడు వందల కోట్ల బడ్జెట్ పెట్టిన చిత్రాలకు కూడా దిల్ రాజు జడ్జిమెంట్ ఇచ్చారు అంటే అది పక్కా బ్లాక్ బాస్టర్ అవ్వాల్సిందే. అలాంటి ఈయన కనీసం ఇప్పుడు చిన్న సినిమాలకి కూడా జడ్జిమెంట్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. 1999 నుండి నిజాం ఏరియాతో పాటు అప్పుడప్పుడు వైజాగ్ ప్రాంతంలో కూడా చిత్రాలను పంపిణీ చేసేవారు. అలా ‘ఒకే ఒక్కడు’ సినిమాతో నైజాం ఏరియాకి పంపిణీదారుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టారు దిల్ రాజు. ఆ తర్వాత నువ్వు వస్తావని, సఖి , మురారి, ఖుషి, నువ్వు నాకు నచ్చావ్, అమృత, ఆది, దిల్, ఆర్య, భద్ర ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసి.. తన జడ్జిమెంట్తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈయన డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి సినిమా కూడా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.

డిస్ట్రిబ్యూషన్ చేసి లాస్ అయిన సినిమాలు..

అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఫెయిల్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఉదాహరణకు గత రెండు మూడు సంవత్సరాలలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అందులో మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 1 & 2, డంకీ, బీస్ట్, పెళ్ళికాని ప్రసాద్, ఎల్ 2: ఎంపురాన్ వంటి చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసి డిజాస్టర్ చూశారు. ఆశించిన స్థాయిలో ఈ చిత్రాలు కలెక్షన్స్ వసూలు చేయలేకపోయాయి.

శాకుంతలం సినిమా నుంచి జడ్జిమెంట్లో మార్పులు..

డిస్ట్రిబ్యూటర్ గానే కాకుండా ఇటు నిర్మాతగా ‘వరిసు’ సినిమా వరకు సక్సెస్ అయిన దిల్ రాజు ..ఆ తర్వాత వచ్చిన శాకంతలంతో తన విజయపరంపరను కొనసాగించడంలో చతికిలబడ్డారు. ఆ తర్వాత వచ్చిన ది ఫ్యామిలీ స్టార్, గేమ్ చేంజర్, తమ్ముడు ఇలా వరుసగా చిత్రాలు డిజాస్టర్ ను మూటగట్టుకున్నాయి.. ఇక దీన్ని బట్టి చూస్తే దిల్ రాజు జడ్జిమెంట్ కి బ్రేకులు పడ్డాయి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

జడ్జిమెంట్లో మార్పులు రావడానికి కారణం..

ఇకపోతే ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది ఎఫ్డిసి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు ఎక్కువగా ఆ వైపే ఫోకస్ చేస్తున్నారు. తాను నిర్మించే లేదా డిస్ట్రిబ్యూట్ చేసే చిత్రాలపై పెద్దగా ఫోకస్ చేయడం లేదు. అందుకే ఆయన జడ్జిమెంట్ తప్పుతోంది అని కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది దిల్ రాజుకి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరుగుతోంది కానీ ఆ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

దిల్ రాజు ఆలోచనలలో మార్పులు వస్తున్నాయా?

అసలే ఇండస్ట్రీలో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీనికి తోడు కథల ఎంపిక విషయంలో ఇలాంటి పెద్దవారే వెనకడుగు వేస్తే.. ఇక చిన్న సినిమాల పరిస్థితి ఏంటి అంటూ కూడా కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా దిల్ రాజులో జడ్జిమెంట్ లోపం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పవచ్చు.

 

ALSO READ:Sridevi: అందుకే ఆ ఫీలింగ్ కలగలేదు – శ్రీదేవి కామెంట్స్!

Related News

Producer SKN: ఇది సమ్మె కాదు.. నిర్మాతలకు సమ్మెట పోటు..తమ్మారెడ్డికి ఎస్కేఎన్ కౌంటర్

Yellamma Movie : ఎల్లమ్మ ఆగిపోయిందా ? బయటికొచ్చేసిన బలగం వేణు ?

Jr. NTR: ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచిన సింగర్… మనకు ఆ పరిస్థితి రావచ్చు అంటూ!

Rashmika: అందరి ముందు విజయ్‌తో అలాంటి పని చేసిన రష్మిక.. వీడియో వైరల్

Aishwarya Rai: అసలైన ఆత్మగౌరవం దొరికేది అక్కడే.. సోషల్ మీడియాపై ఐశ్వర్య ఫైర్!

Big Stories

×