E-Paper
Advertisement

అక్టోబర్ ఒకటి నుండి FDలపై కొత్త రూల్స్.. ఎక్కడైనా ఒకటే వడ్డీ, బల్స్ అయితే ఆ రూటే వేరు

అక్టోబర్ ఒకటి నుండి FDలపై కొత్త రూల్స్.. ఎక్కడైనా ఒకటే వడ్డీ, బల్స్ అయితే ఆ రూటే వేరు
Advertisement

FD New Rules October 1st: దేశంలోని బ్యాంకులు ప్రతీ నెలా ఒకటి నుంచి రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి. అక్టోబర్ ఒకటి నుంచి అనేక మార్పులను తీసుకురాబోతున్నాయి. ఈ మార్పులు బ్యాంకులలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించినవి. పాత వాటి స్థానంలో కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ నిబంధనలు రానున్నాయి. FD వడ్డీ రేట్లతోపాటు అనేక నిబంధనలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం.

అక్టోబర్ ఒకటి నుండి FDలపై కొత్త రూల్స్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- RBI డిపాజిట్లపై వడ్డీ రేట్లకు సంబంధించిన కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకులు వడ్డీ రేట్లను పారదర్శకంగా ఉండేలా చేయడం, కస్టమర్లకు సమాన వడ్డీ రేట్లు అందేలా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. డిపాజిట్ వడ్డీ నిబంధనల్లో బ్యాంకుల కోసం రకరకాల మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయి. కొత్త నిబంధనల వల్ల కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకుల డిపాజిట్ వడ్డీ విధానాల్లో మార్పులు ఉండనున్నాయి.

ఏ బ్రాంచ్‌లో ఎఫ్‌డీ చేసినా ఒకటే వడ్డీ రేటు

Advertisement

ఒకే బ్యాంకు, ఒకే కాలవ్యవధి, సంబంధించిన FDలకు కేవలం బ్రాంచ్ మారిందనే కారణంతో వడ్డీ రేట్లు వేర్వేరుగా ఇవ్వకుండా నిబంధనలు ఉన్నాయి. ఓ కస్టమర్ ఒక బ్రాంచ్‌లో FD చేస్తే.. మరో కస్టమర్ అదే బ్యాంకు బ్రాంచ్‌లో అదే రోజు చేసే కాల వ్యవధికి FD చేస్తే వర్తించే రేటు ఒకేలా ఉండాలి. బ్యాంకులు తమ డిపాజిట్ వడ్డీ రేట్లను కస్టమర్లకు స్పష్టంగా తెలపాలి. FD చేయాలనుకునేవారు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చు. బల్క్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లు ప్రతి రోజు ఉదయం 10:10 గంటల లోపు వెబ్‌సైట్‌లలో అప్‌డేట్ తప్పనిసరిగా చేయాలి.

బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు బ్యాంకుల నిర్ణయం

భారీగా FDలను చేస్తే బల్క్ డిపాజిట్లుగా పరిగణిస్తారు. RBI సమాచార ప్రకారం.. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లు బల్క్ డిపాజిట్ల పరిధిలోకి రానున్నాయి. ఇతర బ్యాంకుల విషయంలో వర్తించే పరిమితులు భిన్నంగా ఉంటాయి. బ్యాంకులు తమ లిక్విడిటీ అవసరాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా బల్క్ డిపాజిట్లపై వేర్వేరు వడ్డీ రేట్లు ఇచ్చే స్వేచ్ఛ ఉంటుంది. ఇటీవలి కాలంలో ఎఫ్‌డి పథకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఎందుకంటే బ్యాంకులు సాధారణ కస్టమర్ల కంటే సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డిలపై 8 నుండి 9 శాతం వరకు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అనేక బ్యాంకులు వివిధ కాలపరిమితులతో కూడిన ప్రత్యేక ఎఫ్‌డి పథకాలపై అదనపు వడ్డీ, ఇతర ప్రయోజనాలను అందిస్తున్నాయి.

Advertisement

ALSO READ: మహిళలకు తీపికబురు.. దిగొస్తున్న బంగారం ధర, ఇవాళ మార్కెట్లో ఎలా ఉన్నాయి?

Related News

యుపిఐ ఎండిఆర్ తప్పుడు నిర్ణయం, మళ్లీ క్యాష్ వైపు దేశం.. మాజీ నీతి ఆయోగ్ చీఫ్ వార్నింగ్

మీ ముఖాన్ని అద్దెకు ఇస్తారా? కొత్త పార్ట్ టైమ్ బిజినెస్ గురూ

40 ఏళ్ల వయసులో రూ.80 లక్షలు సేవింగ్స్.. రూ.1 లక్ష నెలజీతంతో ఇలా సాధ్యం

మహిళలకు తీపికబురు.. దిగొస్తున్న బంగారం ధర, ఇవాళ మార్కెట్లో ఎలా ఉన్నాయి?

IIM MBA విద్యార్థి దుస్థితి.. 250పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు

బ్రాండెడ్ vs జనరిక్.. తక్కువ ధరకే లభించే జనరిక్ మందులు.. నిజంగా పనిచేస్తాయా?

మీ జీతంలో సగం ఈఎంఐలకే పోతే.. జీవితం ఎంత డేంజరో తెలుసా!

Big Stories

Advertisement
×