Gold Price Today: అంతర్జాతీయ పరిణామాలు బంగారం మార్కెట్‌పై పడింది. ఫలితంగా మదుపరులు అమ్మకాలకు పాల్పడడంతో ధర దిగి వస్తోంది. ధర దిగిరావడంతో మహిళల్లో ఆనందం మిన్నంటింది. ధర తగ్గితే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈలోగా మంచి కబురు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ తోపాటు దేశీయంగా వెంబి-బంగారం ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.
అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు రెండో రోజూ తగ్గుతూ వస్తోంది. సోమవారం అర్ధరాత్రి స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 22 డాలర్ల మేర పడిపోయింది. దీంతో ఔన్స్ ధర 4354 డాలర్ల వద్దకు దిగి వచ్చింది. ఈ క్రమంలో వెండి రేటు స్వల్పంగా పెరిగింది. ఔన్స్ వెండి రేటు 0.39 శాతం పెరిగి 66.35 డాలర్ల వద్ద కొనసాగుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, బాండ్ ఈల్డ్స్ గిరాకీ పెరగడంతో పసిడి రేట్లు కిందకు దిగొస్తున్నాయి. వెండి రేటు మూడు రోజుల నుంచి కాస్త అటు ఇటు ఊగిసలాడుతోంది.
దేశీయ బంగారం మార్కెట్లో ధర మంగళవారం స్వల్పంగా తగ్గింది. తులం ధర రూ.1260 మేరా దిగి వచ్చింది.సెప్టెంబర్ 22న అంటే మంగళవారం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో పసిడి, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1260 మేరా తగ్గింది. ప్రస్తుతం తులం రేటు రూ.1,54,580 వద్ద ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1150 మేర తగ్గడంతో రూ.1,41,700 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రేటు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కంటిన్యూ అవుతోంది.
ALSO READ: IIM MBA విద్యార్థి దుస్థితి.. 250పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు
ఇక ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,54,720 వద్ద ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,41,840 వద్ద ఉంది. ముంబై, బెంగుళూరు, కోల్‌కతా నగరాల్లో రూ.200 లేదా 300 తక్కువగా ఉంది. ఇక ధర కూడా నార్మల్‌గా కొనసాగుతోంది. కాస్త ఢిల్లీలో రూ.200 ఎక్కువగా ఉండగా, మిగతా నగరాల్లో అంతా రూ.2,60,000 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.