BigTV English

OTT Movie : ప్రేమ కోసం సైకో కిల్లర్ గా మారే అమ్మాయి…. కేక పెట్టించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie :  ప్రేమ కోసం సైకో కిల్లర్ గా మారే అమ్మాయి…. కేక పెట్టించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చాలా క్రేజీగా ఉంటాయి. ఈ సినిమాలను చూస్తూ ప్రేక్షకులు ఎగ్జైటింగ్ అవుతూ ఉంటారు. ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో ఒక బెస్ట్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ పేరేమిటో? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే…


ఆపిల్ టివి

ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ పేరు ‘బ్యాడ్ సిస్టర్‘ (Bad sister). ఈ మూవీలో హీరోని ఒక అమ్మాయి ట్రాప్ చేస్తుంది. ఆమె నుంచి హీరో ఎలా బయటపడతాడు అనేది సస్పెన్స్ గా ఉంటుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆపిల్ టివి (Apple TV) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోకి మ్యూజిక్ అంటే ఇస్టం ఉండటంతో, కొన్ని వీడియోలను తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఇతనికి చదువు కన్నా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉండటంతో, తండ్రి ఇతనిని మందలిస్తూ ఉంటాడు. ఒకరోజు హీరో చదివే స్కూల్ కి లోరా అనే ఒక టీచర్ వస్తుంది. ఈమె దేవుడి సేవలో ఉండే నన్ గా ఉంటుంది. లోరాకి హీరోని చూడగానే ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఆమె హీరోని ఇష్టపడుతుంది. హీరోకి సారా అనే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. సారాతో హీరో క్లోజ్ గా ఉండటం చూసి లోరా ఒక పథకం వేస్తుంది. లోరా సారా బుక్ లో గంజాయి పెట్టి స్కూల్ నుంచి వెళ్ళిపోయేలా చేస్తుంది. ఆ తర్వాత హీరోతో లోరా క్లోజ్ గా మూవ్ అవుతుంది. హీరోని రెచ్చగొట్టడానికి లోరా తన అందాలను చూపిస్తూ ఉంటుంది. ఒకరోజు వీళ్ళిద్దరూ ఏకాంతంగా దగ్గరవుతారు. లోరా హీరోతో గడిపిన వీడియోలను రికార్డు చేసి బెదిరిస్తుంది. తనకు దూరమైతే ఈ వీడియోలను బయటపెడతానని చెప్తుంది. ఈ లోరా, హీరోని యూట్యూబ్లో చూసి బాగా ఇష్టపడుతుంది. ఆ స్కూల్ కి ఒక కొత్త టీచర్ వస్తుందన్న విషయం తెలుసుకొని, ఆమెను చంపి ఆ స్కూలుకి వస్తుంది.

ఈ విషయం ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తుంది. అయితే హీరో గర్ల్ ఫ్రెండ్ సారా మళ్లీ స్కూల్ కి వస్తుంది. ఆమె గంజాయి తీసుకోలేదని రిపోర్ట్ రావడంతో ప్రిన్సిపల్ స్కూల్ కి ఆహ్వానిస్తుంది. ఈ విషయం నచ్చని లోరా, వాష్ రూమ్ లో సారా ఉండగా తల మీద కొట్టి చంపేస్తుంది. హీరోకి లోరా మీద అనుమానం వస్తుంది. ఆ తరువాత ఈమె ప్రవర్తనపై ప్రిన్సిపల్ కి అనుమానం వస్తుంది. మరోవైపు హీరో లోరా లాప్ టాప్ ను తీసుకొని ఆమె ఎవరో తెలుసుకుంటారు. ప్రిన్సిపల్ ని లోరా గట్టిగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోతుంది. అక్కడికి వచ్చిన హీరో పై కూడా దాడి చేస్తుంది. చివరికి లోరా చేతిలో హీరో ఏమవుతాడు? పోలీసులు లోరాని అరెస్ట్ చేస్తారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఆపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×