Big Stories

Financial Resolutions for 2024-25: కొత్త ఆర్థిక సంవత్సరంలో సరికొత్త ఆర్థిక నిర్ణయాలు ఏంటో తెలుసా?

Financial Goal Setting For 2024 FY
Financial Resolutions for 2024-25

Financial Resolutions for 2024-25: 2023-2024 ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవ్వబోతోంది. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త కొత్త రూల్స్, పలు విషయాల్లో మార్పులు వస్తున్నాయి. ఆదాయ పన్ను, బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈ-బీమా వంటి వాటిలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక నుంచి ఇవన్నీ మనకి కొత్తగా కనిపించనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం..

- Advertisement -

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండడంతో.. చాలా మంది సరికొత్త ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. అలా కొంద మందికి ఎలాంటి లక్ష్యాలు ఎంచుకోవాలనేదానిపై సరిగా అవగాహన ఉండదు. తెలిసినా సరే వాటిని ఎలా నెరవేర్చుకోవాలనే దానిపై స్పష్టత ఉండదు. అలాంటి వారి కోసం ఈ వార్త అంకింతం.

- Advertisement -

ఇలా మొదలు పెట్టండి..
మనకు నెలకు ఎంత జీతం వచ్చినా సరే.. వచ్చిన దానిలో కొంత మొత్తంలో పెదుపు చేయడం అనేది తప్పుకుండా అందరూ చేయాల్సింది. తక్కువ జీతం వచ్చినా సరే వారికి వచ్చే శాలరీలో కొంత మొత్తాన్ని పెట్టుబడి, సేవింగ్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు వీటిని స్టార్ట్ చేయనివారు.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభిస్తే చాలా మంచిది.

Also Read: New Income Tax Rules: కొత్త ఆదాయపు పన్ను పాలసీ ఫేక్.. ఎలాంటి మార్పులు లేవ్

ఆర్థిక స్థితిని అంచనా వేయాలి..
ప్రస్తుతం మీరున్న ఆర్థిక పరిస్థితి ఏంటన్నది మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ నికర విలువను గుర్తించాలి. మీకున్న ఆస్తులు, బాధ్యతల మధ్య ఉన్న వ్యత్యాసమే మీ నిరక విలువగా పేర్కొంటారు. మీ నికర విలువ ఎక్కువగా ఉంటే మీరు లగ్జరీగా జీవించ వచ్చు. మీరు మీకు వచ్చిన ఆదాయంలో ఎంత శాతం ఖర్చు చేస్తున్నారనేది మీ స్థితిని తెలియజేస్తుంది. పెట్టుబడులు, పొదుపు సామర్థాన్ని అంచనా వేయాలంటే ముందు మీరు మీ నికర విలువపై ఓ అంచనాకు రావాలి. ఇది చాలా అవసరం.

ఆర్థిక లక్ష్యాలను గుర్తించాలి..
ఆర్థిక లక్ష్యాలు అనేవి పలు రకాలుగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా అవసరాలు, కోరికల రూపంలో ఉంటాయి. మీరు మీ అవరసరాలు, కోరికలు తీర్చుకోవాలంటే తప్పనిసరిగా డబ్బు అనేది అవసరం. చాలా మంది వీటిలో పిల్లల చదువు, కారు కొనడం, వివాహం వంటివి పెట్టుకుంటారు. అయితే ఇలాంటి వాటితో పాటుగా స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని.. దానికి అనుగుణంగా మీ సంపాదనలో కొంత భాగాన్ని పెట్టుబడి, పొదుపు చేయాల్సి ఉంటుంది.

ఒకే చోట పెట్టుబడి పెట్టవద్దు..
మీరు మీ దగ్గర ఉన్న డబ్బునంతటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే చోట పెట్టుబడి వద్దు. ఎందు కంటే ఆ సంస్థ, కంపెనీకి ఏదైనా ఊహించని దెబ్బ తగిలితే మీ పెట్టుబడిని చాలా మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పలు చోట్ల పెట్టుబడి పెట్టుకోవడం చాలా ఉత్తమం. దీనికోసం మీరు ముందుగా ఎన్ని రకాల పెట్టుబడి పథకాలు ఉన్నాయో తెలుసుకోవాలి. నష్టాన్ని భరించే మీ స్థాయిని అంచనా వేసుకుని దానిక అనుగుణంగా.. మీ లక్ష్యాలకు తగ్గట్టుగా పెట్టుబడి పెట్టాలి.

Also Read: New Rule of PF : పీఎఫ్ కొత్తరూల్.. ఎన్ని ఉద్యోగాలు మారినా ప్రాబ్లమ్ ఉండదట..

బీమా పాలసీ..
మీ సంపాదనపైనే మీ కుటుబం అంతా ఆధారపడి ఉంటే.. మీరు తప్పకుండా వారికి ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి క్షణం మనది కాదు.. ఏ క్షణం ఏమైనా జరగవచ్చు. అందుకే మీరు ముందుగా వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు బీమా పాలసీలు తీసుకోవాలి. పిల్లల చదువు, ఆరోగ్యం వంటి పలు రకాల పాలసీలను ఎంచుకోవాలి.

పన్ను ప్రణాళికలు..
ఆర్థిక సంవత్సరం ప్రారంభం అంటేనే పన్ను ప్రణాశికలను తప్పుకుండా వేసుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమలులోకి రాబోయో పన్ను విధానాలను ఎంచుకునేవారు.. పన్ను ఆదా చేసి పెట్టుబడులు ఎంచుకోవాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News