Flipkart Sale: షాపింగ్ ప్రియులకి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మళ్లీ ప్రారంభమైంది. ఈసారి మార్చి 7 నుంచి మార్చి 13 వరకు ఇది కొనసాగనుంది. దీనిలో భాగంగా iPhone 16 Pro, iPhone 16, iPhone 13, iPhone 16e, Samsung Galaxy S24 సిరీస్, Nothing Phone 2a Plus, Moto G85 సహా మరికొన్ని ఉత్పత్తులపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఇది కాకుండా ఫ్లిప్‌కార్ట్ అనేక ఇతర ఫోన్‌లపై కూడా భారీ డిస్కౌంట్లను ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు అందిస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
ఆపిల్ కొత్త మోడల్ హ్యాండ్‌సెట్ ఐఫోన్ 16e కూడా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మంచి తగ్గింపు ధరలతో లభిస్తుంది. ఈ ఫోన్ ఇటీవలే రూ. 59,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అదే ధరకు లిస్ట్ అయ్యింది. కానీ మీరు HDFC బ్యాంక్ కార్డును ఉపయోగించి ఈ ఫోన్ కొనుగోలు చేస్తే, మీకు 10 శాతం తక్షణ తగ్గింపు లేదా రూ. 1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా ఈ ఫోన్‌పై రూ. 38,150 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. కానీ ఈ తగ్గింపు మీ పాత ఫోన్ పరిస్థితి, ఫ్లిప్‌కార్ట్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్‌లో 48Mp కెమెరా, 128Gb స్టోరేజ్ సపోర్ట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
Read Also: Mansukh Mandaviya: EPFO 3.0పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. ఆ పనులన్నీ కూడా..
ఈ సేల్ సమయంలో గెలాక్సీ S24 ను రూ. 52,999కే కొనుగోలు చేయవచ్చు. దీని ప్లస్ వేరియంట్ కు కూడా రూ. 2,000 మాత్రమే అదనంగా చెల్లించాలి. అన్ని ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ, గెలాక్సీ S24 ప్లస్‌ను రూ. 54,999 కు కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ సేల్లో గెలాక్సీ S25 సిరీస్, కంపెనీ ఫోల్డబుల్ ఫోన్‌లపై కూడా మంచి డిస్కౌంట్లు ఉన్నాయి.
ఈ సేల్‌లో ఫోన్ 2ఏ, ఫోన్ 2ఏ ప్లస్‌లపై కూడా మంచి తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అన్ని ఆఫర్ల తర్వాత రెండు ఫోన్‌లను వరుసగా రూ.19,999, రూ.25,499 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇవి కాకుండా Moto Edge 50, Moto G85, Poco X6 Pro వంటి అనేక మోడళ్లపై మంచి తగ్గింపులను పొందవచ్చు.