Harmanpreet Kaur: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ {డబ్ల్యూపిఎల్} లో భాగంగా గురువారం రోజు లక్నోలోని ఏక్నా స్టేడియంలో యూపీ వారియర్స్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో యూపీ వారియర్స్ జట్టు మరో పరాజయాన్ని చవిచూసింది. ఈ టోర్నీలో కొనసాగాలంటే తప్పక విజయం సాధించాల్సిన మ్యాచ్ లో యూపీ వారియర్స్ జట్టు చేతులెత్తేసింది.
దీంతో ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి.. పాయింట్స్ టేబుల్ లో రెండవ స్థానానికి చేరుకుంది. మరోవైపు ఈ ఓటమితో యూపీ వారియర్స్ జట్టు దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. డబ్ల్యూపిఎల్ లో భాగంగా జరిగిన ఈ 16వ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ జట్టు నిర్నిత 20 ఓవర్లలో 9 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఓపినర్ జార్జ్ వాల్ 33 బంతులలో 52 పరుగులు చేసింది. అలాగే గ్రేస్ హ్యరీస్ 28, కెప్టెన్ దీప్తి శర్మ 27 పరవాలేదు అనిపించారు.
ఇక మిగతా బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. కాగా ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమేలీయా కేర్ 38 పరుగులు ఇచ్చి 5 వికెట్లతో అదరగొట్టింది. అనంతరం యూపీ వారియర్స్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కి మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ అమిలియా కేర్ పది పరుగులకే పెవిలియన్ చేరింది. ఆ తరువాత వచ్చిన నాట్ షివర్ బ్రాంట్ తో కలిసి మరో ఓపినర్ హేలీ మ్యాథ్యూస్ దూకుడుగా ఆడింది.
ఫోర్లు, సిక్సర్లతో యూపీ బౌలర్ల పై విరుచుకుపడ్డారు. దీంతో వీరిద్దరూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరు కలిసి రెండవ వికెట్ కి 92 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తరువాత నాట్ షవర్ బ్రంట్ 37 పరుగుల వద్ద.. గ్రేస్ హ్యారిస్ బౌలింగ్ లో దీప్తి శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఆ తర్వాత దూకుడుగా ఆడే హేలీ మ్యాథ్యూస్ {68} ని క్రాంతి గౌడ్ అవుట్ చేసింది.
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 4 పరుగులు చేసే నిరాశపరిచింది. ఆ తర్వాత అమన్ జ్యోత్, యాస్తిక భాటియా ముంబై జట్టును విజయతీరాలకు చేర్చారు. ముంబై జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో 153 పరుగులు చేసింది. యూపీ బౌలర్లలో గ్రేస్ హ్యారిస్ 2, హెన్రీ, క్రాంతి గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ముంబై బ్యాటర్ హెలీ మ్యాథ్యూస్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
అయితే ఈ మ్యాచ్ లో చిన్నపాటి వివాదం చెలరేగింది. హర్మన్ ప్రీత్ కౌర్, సోఫీ ఎక్లేస్టోన్ మధ్య వాగ్వాదం జరిగింది. యూపీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ వేలెత్తి చూపిస్తూ సోఫీ ఎక్లెస్టోన్ వైపు దూసుకెళ్లింది. దీంతో కలగజేసుకున్న అంపైర్లు.. ఇరువురికి సర్ది చెప్పి వివాదాన్ని సర్దుమనిగించారు.
Heated moment between HarmanpreetKaur and Eccelstone in WPL.pic.twitter.com/s5am45ppsc
— Don Cricket 🏏 (@doncricket_) March 7, 2025