Mansukh Mandaviya: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో 3.0ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) దీని గురించి కీలక సమాచారాన్ని అందించారు. ఈపీఎఫ్‌ఓలో ప్రభుత్వం అనేక మార్పులు చేస్తోందని ఆయన అన్నారు. దీంతో EPFO సభ్యులు అనేక సౌకర్యాలను మరింత సులభంగా వినియోగించుకోవచ్చని మంత్రి అన్నారు. దీంతో ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు.
రాబోయే రోజుల్లో EPFO 3.0 వెర్షన్ వస్తుందని, ఇది కూడా యూజర్లకు ఒక బ్యాంక్‌గా మాదిరిగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి మాండవీయ అభిప్రాయం వ్యక్తం చేశారు. మీరు బ్యాంకులో లావాదేవీ చేసినట్లే, మీరు దీనితో వ్యవహరిస్తారన్నారు. మీరు మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ ద్వారా అన్ని లావాదేవీలు చేసుకోవచ్చన్నారు. బ్యాంకులో లావాదేవీలు జరిగినట్లే, EPFO సభ్యులు తమ UANతో అన్ని పనులు నిర్వహించుకోవచ్చన్నారు.
EPFO लाभार्थी आज किसी भी बैंक में जाकर अपनी पेंशन निकाल सकते हैं। Claim Transfer के लिए बहुत सारी फ़ॉर्मालिटी करनी पड़ती थी, उससे भी लोगों को मुक्ति दी जा चुकी है… pic.twitter.com/2QVBoeZNdv
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 6, 2025
ఈ క్రమంలో మీరు ప్రభుత్వ EPFO కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదని, అలాగే మీరు కంపెనీల వద్దకు కూడా వెళ్లాల్సిన అవసరం రాదన్నారు. వచ్చే రోజుల్లో మీరు ఎప్పుడైనా ATMకి వెళ్లి మీ డబ్బును తీసుకోవచ్చని హామీ ఇస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ.
Read Also: DA Hike: హోలీ పండుగకు ముందే ఉద్యోగులకు శుభవార్త.. ఈసారి డీఏ ఎంత శాతమంటే..
హైదరాబాద్‌లో తెలంగాణ జోనల్ కార్యాలయం, EPFO ప్రాంతీయ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ఈ సమాచారం అందించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో EPFOలో అనేక మార్పులు జరుగుతున్నాయన్నారు. దీంతోపాటు ఫిర్యాదులు తగ్గిపోయి, సేవలు పెరుగుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈపీఎఫ్‌ఓ పనితీరు క్రమంగా ప్రజలకు అనుకూలంగా మారుతోందని ఆయన అన్నారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి నిధుల బదిలీ, క్లెయిమ్, పేరు సవరణ, బ్యాంకు నుంచి పెన్షన్ ఉపసంహరణ వంటి వివిధ అంశాలను కూడా ప్రస్తావించారు.
దీంతోపాటు హైదరాబాద్ సంస్థలో జరుగుతున్న మార్పులను మాండవీయ ప్రశంసించారు. నిధులను చక్కగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. EPFO 8.5% వడ్డీ రేటును అందిస్తోందని, ఇది బ్యాంకుల కంటే ఎక్కువ అని మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం సంస్థ అందిస్తున్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సభ్యులకు సౌలభ్యాలు పెరుగుతాయన్నారు.
గత నెలలో జరిగిన EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో EPFO 3.0 ప్రణాళికను ప్రకటించింది. దీంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కూడిన సెంట్రలైజ్డ్ ఐటీ-ఎనేబుల్డ్ సిస్టమ్ (CITES 2.01) పై కూడా పని జరుగుతోంది. దీని కింద సంస్థ వికేంద్రీకృత డేటాబేస్ నుంచి కేంద్రీకృత వ్యవస్థకు మారుతోందని EPFO CBT ఎగ్జిక్యూటివ్ కమిటీకి తెలిపింది. ఇది మార్చి 31, 2025 నాటికి పూర్తవుతుందని సంస్థ కమిటీకి చెప్పింది. దీని ద్వారా క్లెయిమ్ సెటిల్మెంట్, చెల్లింపు ప్రక్రియ సులభతరం అవుతుంది.