BigTV English

Mahesh Babu: తమ్ముడి జుట్టుతో ఆడుకున్న మంజుల.. వీడియో వైరల్

Mahesh Babu: తమ్ముడి జుట్టుతో ఆడుకున్న మంజుల.. వీడియో వైరల్
Advertisement

Mahesh Babu: ఘట్టమనేని కుటుంబం గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇంటిపేరును, సూపర్ స్టార్ కృష్ణ లెగసీని సూపర్ స్టార్ మహేష్ బాబు కాపాడుతూ వస్తున్నాడు. ఇక మహేష్ అక్క మంజుల ఘట్టమనేని మాత్రం.. ఒకపక్క బిజినెస్ లు చూసుకుంటూనే ఇంకోపక్క సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే మహేష్- మంజులకు ఉన్న బాండింగ్ గురించి అందరికి తెల్సిందే. చిన్నతనంలో మహేష్ చేసిన అల్లరి గురించి చెప్పాలంటే మంజుల వలనే అవుతుంది. ఆమె ఎన్నో ఇంటర్వ్యూలో వారి బాండింగ్ గురించి చెప్పుకొచ్చింది.


ఇక చాలా కాలం తరువాత ఈ అక్కాతమ్ముళ్ల మధ్య ఒక చిలిపి సంఘటన చోటుచేసుకోవడం,అది కెమెరాలో క్లిక్ అవ్వడం.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇట్టే జరిగిపోయాయి. అసలు ఈ ఘటన ఎక్కడజరిగింది అంటే.. తాజాగా ఒక పెళ్ళికి మహేష్ కుటుంబం హాజరయ్యింది. అక్కడ మహేష్ ను చూసిన మంజుల అతని జుట్టును పట్టుకొని.. ఏంట్రా జుట్టు ఇలా పెంచేశావ్ అని అడగడం.. దానికి మహేష్ నవ్వుతూసమాధానం చెప్పడం.. అందుకు మంజుల నవ్వడం కనిపించింది. ఈ అక్కాతమ్ముళ్ల సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ప్రస్తుతం మహేష్.. రాజమౌళి దర్శకత్వంలో ssmb 29 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం మహేష్ పొడవాటి జుట్టు పెంచుతున్నాడు. ఆ లుక్ లోనే ఇదుగో అలా పెళ్ళిలో ప్రత్యక్షమయ్యాడు. మహేష్ లుక్ చూసిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Related News

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Big Stories

×