E-Paper
Advertisement

భారతీయులకు ఫ్రీ ఎంట్రీ రద్దు.. వీసా రూల్స్ మార్చేసిన మలేసియా.. కారణం ఏంటంటే?

భారతీయులకు ఫ్రీ ఎంట్రీ రద్దు.. వీసా రూల్స్ మార్చేసిన మలేసియా.. కారణం ఏంటంటే?
Advertisement

Malaysia Visa Rules 2027: మలేసియా వెళ్లాలనుకునే భారతీయ పర్యాటకులకు ఆ దేశం బిగ్ షాకిచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వీసా రహిత ప్రవేశ సౌకర్యాన్ని రద్దు చేయబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మలేసియాకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది పెద్ద తలనొప్పేనని చెప్పాలి. ఇంతకీ మలేసియా తీసుకొచ్చ కొత్త వీసా రూల్స్ ఏంటి? అందులో ఎలాంటి నిబంధనలు పెట్టారు? భారతీయులకు ఫ్రీ ఎంట్రీ తీసివేయడం వెనుక కారణాలేంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

మలేసియా ఏం చెప్పిందంటే?

ఇప్పటివరకు ఉన్న మలేసియా ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం.. భారతీయ పౌరులు వీసా అవసరం లేకుండానే గరిష్టంగా 30 రోజుల పాటు ఆ దేశంలో ఉండేందుకు అనుమతి ఉండేది. 2027 జనవరి 1 నుంచి దీనిని రద్దు చేశారు. నవంబర్ 17న మలేసియా ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ (JIM) జారీ చేసిన నోటీసులో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కొత్త ఏడాది ప్రారంభం నుంచి భారతీయులకు వీసా మినహాయింపు ఉండదని.. ప్రయాణానికి ముందే అవసరమైన అనుమతులు పొందాలని సూచించింది.

వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Advertisement

ఇండియన్ పాస్‌పోర్ట్ కలిగిన వారు డిసెంబర్ 1 నుంచి వీసా దరఖాస్తులు సమర్పించవచ్చని మలేసియా ఇమిగ్రేషన్ విభాగం తెలిపింది. ‘MyVISA’ వెబ్‌సైట్ ద్వారా ఈ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వీసా మినహాయింపు లేని విదేశీ ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలను కూడా ఇమిగ్రేషన్ విభాగం వివరించింది. కనీసం ఆరు నెలల చెల్లుబాటు ఉన్న పాస్‌పోర్ట్ ఉండటంతో పాటు, పర్యటన ఖర్చులకు సరిపడా నిధులు ఉన్నాయనడానికి ఆధారాలు చూపించాల్సి ఉంటుందని షరతు విధించింది.

వీసా మినహాయింపు ఎందుకు తీసేస్తున్నారు?

వీసా రహిత సౌకర్యాన్ని అడ్డం పెట్టుకుని కొందరు భారతీయులు మలేసియాలో ఉద్యోగాల్లో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ (HCKL) స్వయంగా ఈ విషయాన్ని మలేసియా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో జారీ చేసిన అడ్వైజరీలో భారత హైకమిషన్ కీలక విషయాన్ని వెల్లడించింది. 30 రోజుల వీసా మినహాయింపు కింద ఉద్యోగాల వేట కోసం మలేసియా వెళ్తున్న భారతీయుల సంఖ్య బాగా పెరిగిందని పేర్కొంది. తగిన వర్క్ వీసా లేకుండా అక్కడ ఉండటం వల్ల ఇమిగ్రేషన్ సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారతీయులకు ఫ్రీ ఎంట్రీని మలేసియా రద్దు చేసినట్లు తెలుస్తోంది.

మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్

Advertisement

ఇదిలా ఉంటే కొత్త వీసా నిబంధనల్లో మలేసియా ప్రభుత్వం మెడికల్ ట్రావెస్ ఇన్సూరెన్స్ కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణ కాలం మొత్తానికి ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఇమిగ్రేషన్ విభాగం సూచించింది. విదేశీ పర్యాటకులకు పర్యటన సమయంలో అనుకోని వైద్య ఖర్చుల నుంచి ఆర్థిక రక్షణ కోసం ముందుగానే బీమా తీసుకోవడం మంచిదని అధికారులు సూచించారు. ఇన్సూరెన్స్ కోసం ‘మై ట్రిప్ పాస్’ (MyTripPass) ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌ను సిఫార్సు చేశారు. వీసా దరఖాస్తు సమయంలో సంబంధిత పత్రంగా ఆ ప్లాట్‌ఫామ్ నుంచి తీసుకున్న సర్టిఫికెట్ ఆఫ్ ఇన్సూరెన్స్ (CoI) జత చేయాలని దిశానిర్దేశం చేశారు.

Also Read: ప్రీపెయిడ్ ధరకే పోస్ట్‌పెయిడ్ కనెక్షన్.. రూ. 199కే BSNL అదిరిపోయే ప్లాన్.. సామాన్యులకు పండగే!

7 రోజులు దాటితే అప్లికేషన్ ఖతం

వీసా మినహాయింపు మార్పుతో పాటు దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు సంబంధించి మరో కొత్త నిబంధనను కూడా మలేసియా అమల్లోకి తెచ్చింది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన ప్రకారం.. 7 పనిదినాలకు మించి పెండింగ్ స్థితిలో ఉన్న దరఖాస్తులు వాటంతట అవే రద్దుకానున్నాయి. దరఖాస్తు గడువు ముగిసిన వారు కొత్త వీసా ఫారమ్ ఉపయోగించి మొదటి నుంచి మళ్లీ దరఖాస్తు ప్రక్రియను పునః ప్రారంభించాల్సి ఉంటుందని ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. అటు వీసా ఫీజు విషయంలోనూ ఇమిగ్రేషన్ విభాగం కఠినంగా వ్యవహరిస్తోంది. వీసా ఆమోదించినా, తిరస్కరించినా దరఖాస్తు ఫీజు తిరిగి చెల్లించబోమని స్పష్టం చేసింది. ప్రయాణ ప్రణాళికలు మారినా, వీసా నిబంధనల్లో మార్పులు వచ్చినా రీఫండ్ ఉండదని తెలిపింది.

Also Read: 90s కిడ్స్ ఫేవరెట్.. మార్కెట్లోకి నోకియా 1100 రీ-ఎంట్రీ.. ఇక బ్యాక్ టూ గోల్డెన్ డేస్ మామ!

Tags

Related News

రైల్వే గ్రూప్ బుకింగ్ రూల్స్ ఛేంజ్.. ఇక ఎన్ని బెర్తులైనా బుక్ చేసుకోవచ్చా?

అక్వాన్ తుఫాను ఎఫెక్ట్.. 69 రైళ్లు రద్దు.. మీ ట్రైన్ కూడా ఉందా?

ఆర్మీ వాహనానికి ఫైన్.. మహిళా అధికారిణిపై వేటు! అసలేం జరిగింది?

సముద్రం కాదు.. కానీ, సముద్రంలా కనిపిస్తుంది.. నల్లగొండలో ఈ అద్భుతం చూశారా?

దర్వేశిపురం ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ.. రూ.15 కోట్లతో భారీ అభివృద్ధి!

ఇప్పుడంటే టెక్నాలజీ ఉంది.. పూర్వం ఎల్ నినోను ఎలా ఎదుర్కొనేవారు? ఎలా బతికి బట్టకట్టేవారో తెలుసా?

వందే భారత్ జర్నీ సోషల్ మీడియా స్టేటస్‌గా ఎందుకు మారుతోంది? సైకాలజీ చెప్పే క్రేజీ సంగతి ఇదే!

Big Stories

Advertisement
×