BigTV English
Advertisement

Upcoming Diesel Cars in India: ఈ ఏడాది లాంచ్ కానున్న డీజిల్ కార్లు.. లిస్ట్‌పై ఓ లుక్కేయండి..!

Upcoming Diesel Cars in India: ఈ ఏడాది లాంచ్ కానున్న డీజిల్ కార్లు.. లిస్ట్‌పై ఓ లుక్కేయండి..!

Upcoming Diesel Cars in India 2024: దేశీయ ఆటో మార్కెట్‌లో కంపెనీల మధ్య పోటీ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొత్త సెగ్మెంట్‌లతో వాహనాలను పరిచయం చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో కార్ల కొనుగోలు ఖర్చులు కూడా పెరిగిపోయాయి. అయినప్పటికీ కొంతమంది కొనుగోలుదారులు ఇప్పటికీ పెట్రోల్ ఇంజన్ కార్ల కంటే డీజిల్ పవర్డ్ కార్లను ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఇటీవల అనేక డీజిల్ మోడల్‌లు తొలగించబడినప్పటికీ మంచి పనితీరు, ఇంధన సామర్థ్యం రెండింటినీ అందించే శక్తివంతమైన డీజిల్ కార్లకు ఇప్పటికీ డిమాండ్ ఉంది. భారతీయ ఆటోమోటివ్ మార్కెట్ 2024లో అనేక డీజిల్-ఆధారిత మోడళ్లను పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. ఈ సంవత్సరం భారతదేశంలో విడుదల చేయబోతున్న రాబోయే డీజిల్ కార్లలో కొన్నింటిని పరిశీలిద్దాం.


Mahindra Thar 5-Door
మహీంద్రా థార్ 5-డోర్ ఆగస్ట్ 2024లో భారత మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. 5-డోర్ల థార్ కూడా ప్రస్తుత 3-డోర్ థార్ ఇంజిన్ కాన్ఫిగరేషన్‌ని కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఇది 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికతో అందుబాటులో ఉంటుంది. డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్‌ని 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Also Read: కొత్త రంగుల్లో యమహా FZS V4.. ఈ సారి లుక్ అదిరిపోయింది!


Tata Curvv
టాటా కర్వ్ అనేది ఒక కూపే SUV. ఇది భారతదేశంలోని కార్ మార్కెట్‌లోని SUV సెగ్మెంట్‌లో హైప్ ఉన్న వెహికల్. Tata Curvv ఆగష్టు 2024 నాటికి ప్రారంభించే ఆలోచనలో ఉంది టాటా. Tata Curvv డీజిల్ వేరియంట్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో అందించబడుతుంది. ఈ డీజిల్ ఇంజన్ 115 bhp పవర్ అవుట్‌పుట్, 260 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా AMTతో వచ్చే అవకాశం ఉంది.

Kia Carnival Facelift
కియా గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ కోసం కొత్త-జెన్ కార్నివాల్‌ను తీసుకొచ్చింది. కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో చాలాసార్లు టెస్ట్ నిర్వహించింది. ప్రపంచ మార్కెట్ కోసం కొత్త-తరం కియా కార్నివాల్ మూడు ఇంజన్ ఆప్షన్‌తో తీసుకురానుంది. ఇది 3.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ,హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో కూడిన కొత్త 1.6-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఇండియా స్పెక్ కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ 200 bhpతో 440 Nm టార్క్ శక్తిని ఉత్పత్తి చేయగల 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ద్వారా పవర్ పొందుతుంది.

Also Read: సిట్రోయెన్ కొత్త స్మార్ట్ SUV.. హైటెక్ ఫీచర్లతో వచ్చేస్తోంది.

Hyundai Alcazar Facelift
హ్యుందాయ్ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ 2024 మధ్య నాటికి భారతీయ మార్కెట్లో విడుదల కానుంది. అయితే  ఇప్పుడు సెప్టెంబరు నుండి అక్టోబర్ 2024 నాటికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఆల్కజార్ ఫేస్‌లిఫ్ట్ రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది – a 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. డీజిల్ ఇంజన్ 116 బిహెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

Related News

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Big Stories

×