Four Indian dishes: ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంటకాలు అన్నీ ఇన్నీకావు. ఒక్కో దేశం వంటకం రుచి వేర్వేరుగా ఉంటుంది. వాల్డ్ వైడ్‌లో కొన్ని మాత్రమే ఫేమస్ అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన వంటకాలను ప్రకటించింది టేస్ట్ అట్లాస్ సంస్థ. టాప్ -3లో గ్రీస్, ఇటలీ, మెక్సికో వంటకాలకు చోటు దక్కింది. ఇక భారతీయ వంటకాలకు 12వ ర్యాంక్ ఇచ్చింది. టాప్ -100లో నాలుగు భారతీయ వంటకాలకు ఇందులో స్థానం లభించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల నుండి రేటింగ్‌ల ఆధారంగా తీసుకుని వీటిని ప్రకటించింది ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్. ప్రపంచంలోని ఫేమస్ అయిన వంటకాలపై రేటింగ్ ఇచ్చింది. వాటిలో వెజ్, నాన్ వెజ్, స్వీట్స్ ఇలా తీసుకుంటే భారతీయ వంటకాలను 12వ స్థానం దక్కింది.
అత్యుత్తమ వంటకాల్లో అమృతసరి కుల్చా, బటర్ గార్లిక్ నాన్, ముర్గ్ మఖానీ (బట్టర్ చికెన్), హైదరాబాదీ బిర్యానీలను హైలైట్ చేసింది. టాప్ -100లో నాలుగు భారతీయ వంటకాలను చోటు కల్పించింది. ముర్గ్ మఖానీ- 29, హైదరాబాదీ బిర్యానీ- 31, చికెన్ 65-97, కీమా-100వ స్థానాల్లో వరుసగా నిలిచాయి.
బటర్ చికెట్, హైదరాబాద్ బిర్యానీలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుడ్ లవర్స్ ఇచ్చిన రేటింగ్ ఐదింటికి గాను 4.52 రేటింగ్ ఇచ్చారు. ఇక చికెట్ 65, కీమాకు 4.44 రేటింగ్ పొందాయి. వీటితో పాటు మంచి ఆహారాన్ని అందించే రెస్టారెట్లలో న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి నగరాలున్నాయి.
ALSO READ: రూ. 2 లక్షలకే టాటా నానో ఈవీ, ఫీచర్లు చూస్తే అవాక్కవ్వాల్సిందే!
ప్రపంచంలోని నెంబర్ వన్ వంటకానికి వద్దాం. కొలంబియాకు చెందిన వంటకం లెచోనా ఫుడ్. పంది, పచ్చ బఠానీ, పచ్చి ఉల్లిపాయలు, మసాలా దినుసులతో చేసినది. దీన్ని అవుట్ డోర్ వంటకంగా గుర్తించింది. దీన్ని గంటల తరబడి ఓవెన్‌లో తయారు చేస్తారు.
ఇటలీకి చెందిన పిజ్జా నెపోలెటానా, బ్రెజిల్‌కు చెందిన పికాన్హా, అల్జీరియాకు చెందిన రెచ్టా, థాయ్‌లాండ్‌కు చెందిన ఫనెంగ్ కర్రీ, అర్జెంటీనాకు చెందిన అసడో, టర్కీకి చెందిన కోకర్ట్‌మే కబాబ్, ఇండోనేషియాకు చెందిన రావాన్, టర్కీకి చెందిన కాగ్ కబాబ్, ఇథియోపియాకు చెందిన టిబ్స్ టాప్-10 జాబితాలో నిలిచాయి.