Prasanth Varma : ఆ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. అయితే ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదని చాలామంది అనుకుంటారు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో అని హనుమాన్ సినిమాకు సంబంధించిన సినిమా ఈవెంట్లో ప్రశాంత్ వర్మ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆ సినిమా వల్ల నిర్మాత నాని ఎంత హ్యాపీగా ఉన్నాడో కూడా ప్రశాంత్ వర్మ తెలిపాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ తెరకెక్కించిన సినిమా కల్కి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో లేటెస్ట్ గా వచ్చిన సినిమా హనుమాన్.
తేజ హీరోగా నటించిన ఈ సినిమాకి మొదట థియేటర్లు దొరకలేదు. కానీ మెల్లగా ఈ సినిమా మౌత్ టాక్ తో మంచి హిట్ గా మారి చాలా థియేటర్లను దక్కించుకుంది. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. తేజ సజ్జ లాంటి హీరోతో ఇన్ని కోట్లు రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడితో పాన్ ఇండియా హీరో అయిపోయాడు తేజ. ఉన్నట్టుండి ప్రశాంత్ వర్మ కూడా రేంజ్ పెరిగిపోయింది. ప్రశాంత్ సినీమాటిక్ యూనివర్సల్ అంటూ తెలుగులో కూడా మొదలుపెట్టాడు.
Also Read : Allu Arjun Speech after Release : ఇదో ఛాలెంజింగ్ సిట్యుయేషన్… పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తా..
హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా దేవకి నందన వాసుదేవ అనే సినిమాకి కథను అందించాడు. తాను దర్శకత్వం చేయాలనుకున్న ఆ సినిమాకు అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ కి ఒక స్టోరీ ఓకే అయిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆ సినిమా మీదే కసరత్తు చేయనున్నాడు ప్రశాంత్ వర్మ. అలానే ఈ సినిమాకి రిషబ్ శెట్టి కథ అందిస్తాడు అని వార్తలు కూడా వస్తున్నాయి. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తేలాల్సి ఉంది.
నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇవ్వనన్న సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా చేస్తాడు అని ముందుగా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ డెబ్యూ ఫిలిం నందమూరి బాలకృష్ణ చేస్తాడు అని అధికారిక ప్రకటన కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ చేయాల్సిన సినిమా ఆగిపోయింది కాబట్టి కంప్లీట్ గా ప్రభాస్ సినిమా మీద ప్రశాంత్ వర్మ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ జనవరి 2026 లో రానుంది.
Also Read : Allu Arjun: డ్రంక్ అండ్ డ్రైవ్ మొదలు మహిళా మృతి వరకు.. ఎన్నిసార్లు వివాదాల్లో చిక్కుకున్నారో తెలుసా..?