IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఈరోజు భారత్ – ఆస్ట్రేలియా {IND vs AUS} మధ్య మూడవ టెస్ట్ ప్రారంభమైంది. ఉదయం 5:50 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మూడో టెస్ట్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. గబ్బా పిచ్ పై గత ఏడు టెస్టుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఓటమిపాలైంది. {IND vs AUS} ఈ నేపథ్యంలో టాస్ గెలవడం టీమిండియా కు కలిసివచ్చింది. రెండవ టెస్ట్ లో ఓటమిపాలైన టీమిండియా.. మూడవ టెస్ట్ లో రెండు మార్పులు చేసింది.
Also Read: World Chess Champion Gukesh: గుకేష్ తెలుగోడు కాదు…చంద్రబాబు వర్సెస్ స్టాలిన్ ?
జట్టులో అశ్విన్ కి బదులు మరో సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా వచ్చాడు. ఇక హర్షిత్ రానా ను పక్కనబెట్టి ఆకాష్ దీప్ కి అవకాశం ఇచ్చింది టీమిండియా. ఇక నితీష్ రెడ్డిని జట్టు నుంచి తప్పించే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ అతను రెండు టెస్టుల్లో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోను రాణించడంతో సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. అటు ఆస్ట్రేలియా సైతం మూడవ టెస్ట్ లో ఓ మార్పు చేసింది. బోలాండ్ ని పక్కన పెట్టి జోష్ హేజిల్ వుడ్ ని జట్టులోకి తీసుకుంది. ఈ గబ్బా పిచ్ పై ఇప్పటివరకు ఏడు టెస్ట్ మ్యాచ్ లు ఆడిన టీమిండియా ఐదు మ్యాచ్ లలో ఓడిపోయింది.
ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలుపొందింది. ఇక {IND vs AUS} ఆట ప్రారంభమైన తరువాత కొద్దిసేపటికి వర్షం పడడంతో ఆట నిలిచిపోయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ని అంపైర్లు కాసేపు ఆపేశారు. వర్షం కారణంగా దాదాపు గంట సమయం వృధా అయ్యింది. ప్రస్తుతం 13.2 ఓవర్లకు ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజ్ లో ఉస్మాన్ ఖవాజా (19*), నాథన్ మెక్ స్వీని (4*) నాటౌట్ గా ఉన్నారు. అయితే ఇంకా వర్షం పడుతూనే ఉంది. మ్యాచ్ పునః ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
Also Read: Vinod Kambli: పెన్షన్ డబ్బులతో బతుకీడుస్తున్న భారత మాజీ క్రికెటర్!
దీంతో క్రికెటర్లు డగౌట్ కే పరిమితం అయ్యారు. ఇక ఈ టెస్ట్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎలా ఆడతారన్నది ఆసక్తిగా మారింది. మొదటి టెస్ట్ లో అదరగొట్టిన కోహ్లీ.. రెండవ టెస్ట్ లో పెద్దగా రాణించలేకపోయాడు. మరోవైపు ఆరో స్థానంలో బ్యాటింగ్ కి దిగిన రోహిత్ శర్మ కూడా దారుణంగా నిరాశపరిచాడు. వీరిద్దరూ ఈ మ్యాచ్ లో రాణించడం జట్టుకు కీలకంగా మారింది. గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరి ఆటతీరు అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించే విధంగా ఉంది. వరుసగా బ్యాటర్లు అవుట్ అవుతుండడం టీమిండియా బలహీనత. ఇప్పుడు భారత్ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ పిచ్ కూడా పేసర్లకు అనుకూలంగానే ఉంటుంది. మరోవైపు ఆట ప్రారంభమైన తర్వాత వర్షం పడటంతో ఆట నిలిచిపోయింది. వరుసగా అన్ని టెస్ట్ లు గెలిస్తేనే భారత జట్టు వరల్డ్ కప్ ఫైనల్ కి అర్హత సాధించనుంది.
ఆగని వర్షం.. డగౌట్‌కు పరిమితమైన క్రికెటర్లు
IND vs AUS : ఇంకా వర్షం పడుతూనే ఉంది.మ్యాచ్ పునఃప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం.క్రికెటర్లు డగౌట్‌కే పరిమితం. pic.twitter.com/acOKlGshvp
— ChotaNews (@ChotaNewsTelugu) December 14, 2024