Adani Wedding 10000 Cr Donation| గత జనవరిలో ప్రయాగ్ రాజ్‌లోని మహా కుంభమేళాకు కుటుంబ సమేతంగా విచ్చేసిన దిగ్గజ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మెన్ గౌతమ్ అదానీ తన కుమారుడు జీత్ అదానీ పెళ్లి చాలా సింపుల్ గా, సంప్రదాయపరంగా జరుగుతుందని చెప్పారు. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆయన తన మాట నిలబట్టుకున్నారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తి గల కుబేరుడు గౌతం అదానీ కుమారుడి పెళ్లి అంటే అందరూ అంగరంగ వైభవంగా, అన్ని ఆడంబరాలతో జరుగుతుందని ఊహించారు. మీడియాలో కూడా ఇదే ప్రచారం జరిగింది. అయితే గౌతం అదానీ తన కొడుకు పెళ్లి ప్రైవేట్ కార్యక్రమంలానే నిర్వహించారు. ఎటువంటి సెలబ్రిటీలను ఆహ్వానించలేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో స్నేహ సంబంధాలు ఉన్నా అదానీ వారందరినీ పిలవలేదు.
శుక్రవారం ఫిబ్రవరి 7, 2025న జీత్ అదానీ పెళ్లి చాలా సాదాసీదాగా జరిగింది. అయితే ఈ వివాహం సందర్భంగా బిలియనీర్ వ్యాపారవేత్త గౌతం అదానీ మాత్రం వేల కోట్లు దానం చేశారు. తన కొడుకు పెళ్లికి కానుకగా సమాజంలోని పలు కీలక రంగాల్లో ఆయన సేవా భావంతో రూ.10,000 కోట్లు దానం చేసినట్లు సమాచారం.
అదానీ సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతం అదానీ తన సామాజిక ఫిలాసఫీ ‘సేవా సాధన హై, సేవా ప్రార్థనా హై, సేవా పరమాత్మ హై’ కి అనుగుణంగా ఈ భారీ మొత్తాన్ని దానం చేశారు. ఈ పదివేల కోట్లలో సింహ భాగం.. వైద్య రంగం, విద్యా రంగం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం ఖర్చు చేయనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ సమాజం హితం కోసం కొనసాగుతాయి. వీటిలో ప్రపంచస్థాయి ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, ప్రైమరీ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన చేసే కె 12 స్కూళ్లు, ఉద్యోగ హామీనిచ్చే ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉంటాయి.
Also Read: చనిపోతున్న కూతురి కోసం ఆఫీసుకు సెలవు పెట్టిన మహిళ.. ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ
అహ్మదాబాద్ నగరంలోని అదానీ శాంతిగ్రామ్ టౌన్‌షిప్ లో ఉన్న బెల్వెడెర్ క్లబ్ లో శుక్రవారం మధ్యాహ్నం గౌతం అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం, ప్రముఖ వజ్రాల బిజినెస్ మెన్ జైమిన్ షా కుమార్తె దీవా షాతో జరిగింది. చాలా ప్రైవేట్ గా జరిగిన ఈ వివాహ వేడుకకు కేవలం బంధువులు మాత్రమే పాల్గొన్నారు. గుజరాతీ సంప్రదాయబద్దంగా చాలా సాదాసీదాగా ఈ వివాహం జరిగిందని స్వయంగా గౌతం అదానీ ట్విట్టర్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు.
మరోవైపు వరుడు జీత్ అదానీ దేశంలోని ఆరు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్‌ల నిర్వహణ బాధ్యతులు చూస్తున్నారు. నవీ ముంబైలో మరో కొత్త విమానాశ్రయం నిర్మాణం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ లో జీత్ అదానీ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. పెళ్లికి రెండు రోజుల ముందు ఆయన మంగల్ సేవా పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ సంవత్సరం 500 మంది దివ్యాంగ యువతుల వివాహం కోసం ఆయన ప్రతి ఒక్కరికి రూ.10 లక్షల కానుకగా అందిస్తారు. మంగల్ సేవా కార్యక్రమం ప్రారంభ సందర్భంగా కొత్తగా పెళ్లి చేసుకున్న 21 దివ్యాంగ జంటలను ఆయన కలిసి వారికి ఆర్థిక సాయం చేశారు.
జనవరి 21, 2025న గౌతమ్ అదానీ కుటుంబ సమేతంగా కుంభమేళాకు వెళ్లారు. ఆ సమయంలో ఆయనను మీడియా ప్రతినిధులు ఆయన కుమారుడి గురించి ప్రశ్నించారు. తన కొడుకు పెళ్లికి పెద్ద పెద్ద సెలబ్రిటీలందరూ చీఫ్ గెస్ట్ లుగా వస్తారా? అని ప్రశ్నించగా.. ఆయన సమాధానమిస్తూ.. “అదంతా తప్పుడు ప్రచారం.. మేము సామాన్య ప్రజల్లాగే జీవించడానికి ఇష్టపడతాం. ప్రస్తుతం గంగమ్మ తల్లి ఆశీర్వాదం కోసం వచ్చాం. నా కొడుకు పెళ్లి చాలా సింపుల్ గా, సంప్రదాయ బద్దంగా జరుగుతుంది.” అని చెప్పారు.
परमपिता परमेश्वर के आशीर्वाद से जीत और दिवा आज विवाह के पवित्र बंधन में बंध गए।
यह विवाह आज अहमदाबाद में प्रियजनों के बीच पारंपरिक रीति रिवाजों और शुभ मंगल भाव के साथ संपन्न हुआ।
यह एक छोटा और अत्यंत निजी समारोह था, इसलिए हम चाह कर भी सभी शुभचिंतकों को आमंत्रित नहीं कर सके,… pic.twitter.com/RKxpE5zUvs
— Gautam Adani (@gautam_adani) February 7, 2025