Nalgonda News: సాధారణంగా ఇరుగింటి పొరుగింటి పంచాయతీలు సర్వసాధారణం. అది కూడ ఆ చెత్త ఇక్కడికి వచ్చిందని, ఈ చెత్త అక్కడికి వెళ్లిందని తగాదాలు జరుగుతూ ఉంటాయి. ఇటీవల కొన్ని తగాదాలు పెంపుడు శునకాలతో కూడ వస్తున్నాయి. ఇటువంటి పంచాయతీలు చిలికి చిలికి గాలి వానగా మారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఘటనలు కూడ ఉన్నాయి. తాజాగా ఓ ఇంటి పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లగా, ఇప్పుడు పోలీసులు పెద్ద సంధిగ్దంలో ఉన్నారట. అయితే ఈ పంచాయతీ అలాంటి ఇలాంటి పంచాయతీ కాదు.. అందుకే పోలీసులు కూడ ఏం చేయాలన్న సంకోచంలో పడ్డారు.
అయితే ఎక్కడైనా ఒక బిడ్డ.. ఇద్దరు తల్లుల కథలు, వాస్తవ ఘటనలు చూసే ఉంటాం. ఆ బిడ్డ నా కొడుకని ఒకరు.. లేదు నా కుమారుడని మరొకరు ఇలాంటి వాదనలు మనం వినే ఉంటాం. తాజాగా ఇద్దరు మహిళలు కూడ ఇదే రీతిలో గొడవ పడ్డారు. చివరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి న్యాయం చేయాలని కోరారు. ఇంతకు వీరి గొడవకు గల కారణం తెలుసా.. ఓ పిల్లి. ఆ పిల్లి నాదంటే, నాదని వారిద్దరూ గొడవ పడ్డారు. ఇప్పుడు పోలీసుల వద్దకు పిల్లి పంచాయతీ చేరింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది.
నల్గొండ పట్టణంలో పుష్పలత అనే మహిళ మూడేళ్లుగా పెంచుకుంటున్న పిల్లిని పెంచుకుంటోంది. ఎంతో ప్రేమగా ఆమె పిల్లిని పోషించేది. అయితే ఏడాది క్రితం పిల్లి తప్పి పోయింది. ప్రేమగా చూసుకున్న పిల్లి కనిపించక పోవడంతో, పుష్పలత వెతుకులాడింది. ఎంత వెతికినా పిల్లి కనిపించక పోవడంతో ఆమె సైలెంట్ అయింది. తాజాగా తాను పోషించిన పిల్లి పోలికలతో ఉన్న పిల్లి పక్కింట్లో చూసింది. అరెరె.. ఆ పిల్లి నాదే అంటూ పుష్పలత గొడవకు దిగిందట.
Also Read: Tirumala Update: ఈ నెల 12న తిరుమల వెళ్తున్నారా.. ఈ పూజ మిస్ కావద్దు..
తన పిల్లి తనకు ఇవ్వాల్సిందేనని ఆమె పట్టుబట్టింది. అయితే పక్కింటి వారు పిల్లిని ఇవ్వకపోవడంతో, పుష్పలత ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎలాగైనా తన పిల్లి తనకు ఇప్పించాలని పోలీసులను వేడుకొంది. పోలీసులు కూడ ఇంతకు పిల్లి ఎవరిదనే కోణంలో విచారణ సాగిస్తున్నారట. మరి పిల్లి పంచాయతీకి పోలీసులు ఎటువంటి తీర్పు ఇస్తారో.. పిల్లి ఎవరికి చెందుతుందో.. తేలాల్సి ఉంది.
ఇదో పిల్లి పంచాయితీ…!
పిల్లి కోసం పక్కింటివారిపై పోలీస్ స్టేషన్లో మహిళ కేసు
నల్గొండ పట్టణంలో పుష్పలత అనే మహిళ మూడేళ్లుగా పెంచుకుంటున్న పిల్లి ఏడాది క్రితం తప్పిపోయిన వైనం
అలాంటి పోలికలతోనే ఉన్న పిల్లి పక్కింట్లో కనబడటంతో ఆ పిల్లి తనదేనని మహిళ వాగ్వాదం
పిల్లిని తనకు… pic.twitter.com/bHct6W61Am
— BIG TV Breaking News (@bigtvtelugu) February 8, 2025