Adani US Indictment| అదానీ గ్రూప్ కంపెనీ చైర్మెన్ గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ జైన్ పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని అమెరికా న్యాయ శాక (డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్) స్పష్టం చేసిందని అదానీ గ్రూప్ కంపెనీ బుధవారం అధికారికంగా ప్రకటించింది.
అదానీలు అధికారులకు లంచాలు ఆఫర్ చేశారని మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసినట్లు అదాపీ గ్రూప్ లో భాగమైన అదానీ గ్రీన్ కంపెనీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ తాజా ఫైలింగ్ లో పేర్కొంది. “మిస్టర్ గౌతమ్ అదానీ, మిస్టర్ సాగర్ అదానీ, మిస్టర్ వినీత్ జైన్ లపై ఉన్న ఆరోపణల్లో ఎఫ్‌సిపిఏ చట్ట (విదేశాల్లో అవినీతి చర్యల చట్టం) నిబంధనలు ఉల్లంఘించినట్లు లేదు అని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, అమెరికా స్టాక్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ తెలిపాయి” అని అదానీ గ్రీన్ కంపెనీ ప్రతినిధి తెలిపారు.
Also Read: మార్కెట్లోకి రిలయన్స్ రోబోలు.. వీటి రాకతో వచ్చే మార్పులేంటి..?
అదానీ గ్రూప్ డైరెక్టర్లు అయిన గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ లపై అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ లో అయిదు ఆరోపణలు ఉన్నట్లు మీడియా తెలిపింది. అయితే వీటిలో రెండు ఆరోపణలు విదేశాల్లో అవినీతి చర్యల చట్ట నిబంధనలు ఉల్లంఘించడం (అవినీతి, లంచం ఇవ్వడం), న్యాయ విచారణకు అడ్డుపడడం వంటి ఆరోపణలు లేవని అదానీ గ్రూప్ తెలిపింది. తప్పుడు ప్రచారం వల్ల అదానీ గ్రూప్ నకు చెందిన 11 కంపెనీలకు మొత్తం 55 బిలియన్ డాలర్ల నష్టం వచ్చిందని వెల్లడించింది. దీనివల్ల తమ పెట్టుబడిదారులు, షేర్ హోల్డర్లు నష్టపోయారని, తమ కంపెనీల అంతర్జాతీయ ప్రాజెక్టులు రద్దు అయ్యాయని తెలిపింది.
మరోవైపు అదానీలపై అంతర్జాతీయ, భారత మీడియా తప్పుడు ప్రచారం చేశాయని.. ఇదంతా అమెరికా కోర్టులో నమోదైన ఆరోపణలను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే జరిగిందని భారత మాజీ అటార్నీ జెనెరల్ ముకుల్ రోహత్గీ అభిప్రాయపడ్డారు.
“అమెరికా బ్యాంకుల నుంచి లక్షల కోట్లలో రుణాలు సమకూర్చుకునే క్రమంలో భారత ప్రభుత్వ అధికారుల చేత అబద్ధం చెప్పించేందుకు వారికి వేల కోట్ల లంచం ఆఫర్ చేశారని అదానీలపై మీడియాలో ఆరోపణలు వచ్చాయి. కానీ ఎవరికి ఎంత లంచం ఇచ్చారు. ఏ అధికారులు ఆ లంచం డబ్బుని పుచ్చుకున్నారు. అనే వివరాలు ఎక్కడా వెల్లడించలేదు. నేను ఒక లాయర్ ని అదానీ గ్రూప్ నకు నాకు ఎటువంటి సంబంధం లేదు. గతంలో అదానీ కంపెనీల కోసం కేసులు వాదించాను. ఇప్పుడు అమెరికా కోర్టులో అదానీ గ్రూప్ కంపెనీలపై ఆ సంస్థ ఉన్నతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించాను. ఇందులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీల పేర్లు అసలు లేవు. సెక్యూరిటీస్ అండ్ బాండ్స్ లో అవినీతి చేశారనే ఆరోపణల్లో అదానీలు, లేదా ఆయన అధికారుల పేర్లు లేవు. న్యాయ విచారణకు అడ్డుపడ్డారనే ఆరోపణల్లో కూడా అదానీల పేర్లు లేవు. అమెరికా కోర్టులో ప్రవేశపెట్టిన దస్తావేజుల్లో ఏదీ ప్రత్యేకించి చెప్పలేదు. ఎవరు ఏ నేరం చేశారనేది ఎక్కడా సరిగా లేదు. నేను చార్జిషీట్ ని బాగా చదవే ఈ విషయాలు చెబుతున్నా. ఈ తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకునే అధికారం అదానీలకు ఉంది.” అని మీడియా సమావేశంలో చెప్పారు.