BigTV English

Gogoro New Pulse e-scooter: అదరగొట్టే ఫీచర్లతో మరో ఈవీ.. ధర కూడా చాలా తక్కువే!

Gogoro New Pulse e-scooter: అదరగొట్టే ఫీచర్లతో మరో ఈవీ.. ధర కూడా చాలా తక్కువే!
Gogoro New Pulse e-scooter

Gogoro New Pulse e-scooter: దేశంలో ఇప్పుడంతా ఎలక్ట్రిక్ స్కూటర్లదే హవా. ఏటేటా ఎలక్టిక్ టూ-వీలర్స్(E2W) అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తైవాన్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ స్టార్టప్‌ గొగోరో (Gogoro) తన అత్యంత శక్తిమంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. అధిక సామర్థ్యం, ప్రీమియం లుక్‌తో పల్స్ ఈ-స్కూటర్‌ (Pulse E Scooter)ను ఆవిష్కరించింది.


నగరాలు, పట్టణాల్లోని రైడర్లను ఆకట్టుకునేలా ఫీచర్లు, డిజైన్‌, బ్యాటరీ ప్యాక్‌‌తో దీనిని రూపొందించింది. మ్యాట్రిక్స్ LEDతో మరింత కాంతిని ఇచ్చేలా హెడ్‌లైట్‌ను తీర్చిదిద్దారు. దీనిలో 13 సింగిల్ LEDలు ఉండటం విశేషం. స్పీడ్‌, విజిబిలిటీ ఆధారంగా ఆటోమేటిక్‌గా కాంతిని ఎల్‌ఈడీ హెడ్‌లైట్ సర్దుబాటు చేసుకుంటుంది. టెయిల్‌ లైట్లూ ఆకర్షణీయంగా ఉన్నాయి.

10.25 అంగుళాలతో టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్‌ పెద్దదిగా ఉండటం మరో అనుకూల ఫీచర్. స్నాప్‌డ్రాగన్ QWM2290 ప్రాసెసర్‌ ఆధారంగా ఇది పనిచేస్తుంది. సాధారణ రైడ్ డేటాతో పాటు రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను దీని ద్వారా తెలుసుకోవచ్చు. బ్లూటూత్‌ కనెక్టివిటీ సరేసరి.


పవర్‌ట్రెయిన్‌ పరంగా చూస్తే.. ఎయిర్-కూల్డ్ హైపర్ డ్రైవ్ H1 మోటార్‌ను దీనికి అమర్చారు. గరిష్ఠంగా 9 కేడబ్ల్యూ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. 3 సెకన్లలోనే 0 నుంచి 50 కిలోమీ టర్ల వేగాన్ని అందుకొనే సామర్థ్యం ఈ దీనికి ఉంది. రైడర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆరు రైడింగ్ మోడ్‌లను అందించారు. పల్స్‌ ఈ-స్కూటర్‌ స్టైలింగ్‌, స్పెసిఫికేషన్లను చూస్తే దేశంలో బైక్ ప్రియులను ఆకట్టుకోవడం కచ్చితం.

Related News

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Big Stories

×