E-Paper
Advertisement

నెల్లూరు జిల్లాలో ఘరానా మోసం.. పోలీసుల ఉద్యోగాల పేరిట లక్షల వసూలు

నెల్లూరు జిల్లాలో ఘరానా మోసం.. పోలీసుల ఉద్యోగాల పేరిట లక్షల వసూలు
Advertisement

Nellore Police Scam: రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారితే ఆ బాధితులు ఎవరికి చెప్పుకోవాలి? కంచే చేను మేసిన చందంగా, నెల్లూరు జిల్లాలో పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు ఖాకీలు సాగించిన రూ. 25 లక్షల దందా ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

ఫేక్ జాయినింగ్ ఆర్డర్లు.. కల్లబొల్లి మాటలు

Advertisement

నెల్లూరు జిల్లా తిక్కవరం గ్రామానికి చెందిన పచ్చ అజయ్ అనే యువకుడిని పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, పలు విడతలుగా ఏకంగా రూ. 5.5 లక్షలు ఫోన్ పే ద్వారా వసూలు చేశారు. తిక్కవరానికే చెందిన బిక్కి చినబాబు, హేమంత్ కుమార్లతో పాటు అంకుల్పాటూరుకు చెందిన రెడ్డితల ప్రవీణ్ నుంచి కూడా మరో రూ. 5.5 లక్షలు కాజేశారు. బాధితులకు అనుమానం రాకుండా ప్రభుత్వ జీవో నంబర్లతో కూడిన నకిలీ జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చి మభ్యపెట్టారు. ఆ ఆర్డర్లలో పల్లం సుధీర్, గున్నం ప్రసాద్, నక్కా ప్రేమ్ కుమార్ వంటి పలువురి పేర్లు కూడా ఉండటం గమనార్హం.

ఖాకీల భాగోతం వెలుగులోకి..

Advertisement

ఈ మొత్తం వ్యవహారం వెనుక తిరుపతిలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ జగన్నాటి మస్తానయ్య, ఏఆర్ కానిస్టేబుల్ తువ్వూరు నాగేంద్రబాబు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మస్తానయ్య చెప్పిన మాటలు నమ్మి, బాధితులంతా నాగేంద్రబాబు బ్యాంకు ఖాతాకే విడతల వారీగా సుమారు రూ. 25 లక్షలు బదిలీ చేశారు.

పోలీసులపై కఠిన చర్యలు..

డబ్బులు తీసుకుని రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోగా, అడిగితే ఆ ఖాకీలు తప్పించుకు తిరుగుతుండటంతో చేసేదేమీ లేక బాధితులు చివరకు మీడియాను ఆశ్రయించి తమ బాధను వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని, దోషులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.

Also Read: హైదరాబాద్‌కి పోటీగా వరంగల్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు!

Tags

Related News

బలంగా ఢీ కొన్న లారీ-టిప్పర్, విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం, ఒకరు మృతి..

విజయవాడ శాప్ ఆఫీస్ ఘటన.. చంద్రబాబు ప్రభుత్వం సీరియస్, ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీ-ఒడిషా భారీ వర్షాలు, తెలంగాణలో కూడా

డీసీసీబీ స్కామ్‌పై పవన్ కళ్యాణ్‌కు లేఖ.. సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. హోంమంత్రి అనిత హెచ్చరికలు జారీ!

టీచర్లపై దాడి చేస్తే ఊరుకునేది లేదు.. వైసీపీకి మంత్రి నారా లోకేష్ వార్నింగ్

190 ఎకరాల భూ కబ్జా.. ఆధారాలు ఉన్నాయి.. తాడిపత్రిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×