E-Paper
Advertisement

మళ్లీ దిగుతున్న గోల్డ్-వెండి ధరలు, తెలుగు రాష్ట్రాల మార్కెట్లో ధరల మాటేంటి?

మళ్లీ దిగుతున్న గోల్డ్-వెండి ధరలు, తెలుగు రాష్ట్రాల మార్కెట్లో ధరల మాటేంటి?
Advertisement

Gold Price Today: బంగారం-వెండి ధరలు మార్కెట్లో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. చమురు‌లో ధరలు పెరుగుతున్న ప్రతీ‌సారి బంగారం ధరలు పతనమయ్యాయి. ఈసారి అలాంటి సంకేతాలు కనిపించడంతో బులియన్ మార్కెట్లో కాసింత స్తబ్దుగా ఉంది. మంగళవారం మార్కెట్లో కాస్త హెచ్చుతగ్గులకు లోనవుతోంది.

మళ్లీ దిగుతున్న బంగారం-వెండి ధరలు

ఈ వారం ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అక్టోబర్ 5 అనగా సోమవారం మార్కెట్ ప్రారంభమైనప్పుడు వెండి ధర పెరగగా, బంగారం ధర తగ్గింది. మార్కెట్లో జరుగుతున్న పరిణామాలతో వెండి ధరలు వేగంగా పడిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మార్కెట్లో ధరల అస్థిరత కొనసాగుతోంది. ఈ అస్థిరత నేపథ్యంలో మంగళవారం నాటి ధరలను పరిశీలిద్దాం.

అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఉదయం స్వల్పంగా తగ్గుదల

Advertisement

పసిడి ధరలపై అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు ప్రభావం కనిపిస్తోంది. ఈసారి ఫెడ్ వడ్డీ రేటు పెంపు ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే గోల్డ్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందనే ప్రచారం అప్పుడే మొదలైంది. మంగళవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్ కామెక్స్‌లో బంగారం-వెండి ధరలు తగ్గాయి. కామెక్స్ డేటా ప్రకారం.. ఈ వార్త రాసే సమయానికి బంగారం ధర 0.07 శాతం తగ్గి ఔన్సుకు 4153.80 కి చేరుకుంది. అదే సమయంలో వెండి ధరలు 0.43 శాతం తగ్గి ఔన్సుకు 61 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.

దేశీయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. మంగళవారం ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం బులియన్ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గతంలో పోల్చితే రూ.160 తగ్గి రూ.1,49,170 వద్ద ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.150 తగ్గి రూ.1,36,740 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు కూడా కిలోగ్రాముకు సుమారు రూ.2.25 లక్షల వద్ద ట్రేడింగ్ లావాదేవీలు జరుగుతున్నాయి. మార్కెట్లో జరుగుతున్న హెచ్చుతగ్గులపై కొందరు పెరుగుతుందని చెబుతుంటే, మరికొందరు మాత్రం తగ్గడం ఖాయమని అంటున్నారు.

Advertisement

ALSO READ: 20 ఏళ్లు ఉద్యోగం చేస్తే మీ EPS పెన్షన్ ఎంత వస్తుంది? ఇలా లెక్కించాలి

మెట్రో నగరాల్లో బంగారం-వెండి ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం. న్యూఢిల్లీ 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ. 148,320 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 137,960 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగుళూరు, కోల్‌కత్తా నగరాల్లో రూ. 200 అటు ఇటుగా కొనసాగుతోంది. చెన్నై మాత్రం దాదాపు ఢిల్లీ స్థాయి ధరకు అటు ఇటు ట్రేడింగ్ నడుస్తోంది. దేశంలో వెండి ధర కిలో సుమారు రూ. 2,25,860 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ మొదలైన తర్వాత ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.

Related News

ఆధార్‌ కార్డ్‌లో పేరు మార్చాలా? కొత్త రూల్స్ జారీ చేసిన ప్రభుత్వం.. పూర్తి ప్రాసెస్ ఇదే

20 ఏళ్లు ఉద్యోగం చేస్తే మీ EPS పెన్షన్ ఎంత వస్తుంది? ఇలా లెక్కించాలి

పోస్టాఫీసు సూపర్ డూపర్ స్కీమ్.. రోజూ రూ.300 దాస్తే చాలు.. చేతికి రూ.6.4 లక్షలు!

ఖరీదైన మెడిసిన్ అంటే మెరుగైన చికిత్స అని అర్థం కాదు.. మందులపై MRP, డిస్కౌంట్ల గుట్టు విప్పిన డాక్టర్

పోస్టాఫీసులో ఆ స్కీమ్ గురించి తెలుసా? ఐదేళ్లలో రూ.4,50,000 వడ్డీ, ఇవే ఆ డీటేల్స్

బుధవారం జీఎస్టీ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్, అదే జరిగితే బంగారం-వెండి ధరలకు రెక్కలు

రూ.50 వేల పెట్టుబడితో నెలకు రూ.7.5 లక్షల ఆదాయం.. తెలుగోడి స్పెషల్ ఇడ్లీ బిజినెస్

Big Stories

Advertisement
×