E-Paper
Advertisement

ఫైనాన్షియల్ గొడవలా? పెళ్లి మేటరా?.. రీతూ చౌదరి ఇష్యూపై నోరు విప్పిన డెమోన్ పవన్!

ఫైనాన్షియల్ గొడవలా? పెళ్లి మేటరా?.. రీతూ చౌదరి ఇష్యూపై నోరు విప్పిన డెమోన్ పవన్!
Advertisement

Demon Pavan Ritu Chowdary:బిగ్‌బాస్ తెలుగు 9లో పరిచయమైన డీమాన్ పవన్, రీతూ చౌదరి జోడీకి అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో చెప్పక్కర్లేదు .ఇక హౌస్‌ నుండి బయటకి వచ్చాక కూడా కలిసి ఫ్రెండ్లీ గా కనబడటంతో అభిమానులు వీళ్లను ‘రివాన్’ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఇక ఇద్దరూ కలిసి ఈవెంట్లు, డ్యాన్స్ షోలు, ప్రాజెక్టులు చేయడం, ‘బంగారం’ వంటి పాటలో కలిసి కనిపించడంతో వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఒక అంచనాకి వచ్చేశారు అభిమానులు .

అయితే రీసెంట్ గా పవన్ రీవాన్ అనే బాండింగ్ కి ఇక బ్రేకప్ అయిందని ఒక పోస్ట్ పెట్టడంతో అభిమానులు వీరి బంధానికి బీటలు వారిందా ఏంటి అంటూ సోషల్ మీడియా లో తెగ డిబేట్లు పెట్టేశారు.

Advertisement

తమ మధ్య ప్రేమే లేదు

దీంతో సోషల్ మీడియాలో తమ మధ్య ఎదో బ్రేకప్ అయిందని అనుకుంటున్నారని ,అసలు తమ మధ్య ప్రేమే లేదని కేవలం ప్రొఫెషనల్ గా కలిసి పని చేశామని ,అయితే తమ మధ్య ఎదో ఉంది అని అభిమానులు అనుకోవడం వల్లే అలా రిమోన్ అనే బాండ్ కి బ్రేకప్ అయిందని లీక్ అయిన ఆడియో కాల్ లో పవన్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది.

Advertisement

సోషల్ మీడియా లో గత కొన్ని రోజులుగా మంటలు పుట్టిస్తున్న  డెమోన్ పవన్ మరియు రీతూ చౌదరి వ్యవహారంలో ఇపుడు డెమోన్ పవన్ ఆడియో కాల్ లీక్  దానికి మరింత ఆజ్యం పోస్తుంది.

ఈ లీక్ అయిన ఆడియో క్లిప్‌లో పవన్ మాట్లాడుతూ కార్లలో నిజం లేదని స్పష్టం చేశారు. “మా మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదని, మేము ఎప్పుడూ రిలేషన్‌షిప్‌లో లేము” అని ఆయన చాలా స్పష్టంగా తెల్చి చెప్పారు.

రీతూ చౌదరితో తనకు గతంలో పెళ్లయిందనే విషయం తనకు తెలియదని, అలాగే ఆమెకు ఇదివరకే పెళ్లయిన విషయాన్ని తనకు ముందే చెప్పలేదనే ప్రచారంపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

రికార్డు స్థాయి వ్యూస్ కొట్టిన “బంగారం” మ్యూజిక్ ఆల్బమ్

సోషల్ మీడియాలో ఈ ఇద్దరి కాంబినేషన్ కి ఎంత క్రేజ్ ఉందొ. చెప్పక్కర్లేదు.ముఖ్యంగా వీరు కలిసి నటించిన “బంగారం” ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్ సాధించడంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందని అనుకున్నారు ఫ్యాన్స్ .

ఆ క్రేజ్‌ను చూసి వీరిద్దరూ నిజ జీవితంలోనూ రిలేషన్‌లో ఉన్నారని అంచనాకి వచ్చేశారు .అయితే, “జస్ట్ ప్రాజెక్ట్స్ వరకే మా బాండింగ్ పరిమితం. గత రెండు నెలకు పైగా మా మధ్య అసలు సరైన అని అభిప్రాయ భేదాల వల్ల మేమిద్దరం కలిసి వర్క్ చేయడం కూడా ఆపేశాం” అని పవన్ చెప్పుకొచ్చాడు.

ఎలాంటి ఫైనాన్షియల్ మేటర్స్ లేవు 

ఇక ఫైనాన్షియల్ లేదా ప్రాజెక్ట్‌లకు సంబంధించిన గొడవలు ఉన్నాయా అన్న ప్రశ్నకి రియాక్ట్ అవుతూ , తమ మధ్య ఎలాంటి ఫైనాన్షియల్ మేటర్స్ లేవని, కేవలం ప్రొఫెషనల్ థాట్ ప్రాసెస్‌లోనే విభేదాలు వచ్చాయని చెప్పారు.

గతంలో కూడా బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి, అమర్‌దీప్ చౌదరి, ప్రియాంక జైన్ వంటి వారి విషయంలోనూ ఇలాగే రూమర్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇప్పుడు రీతూ చౌదరి – డెమోన్ పవన్ ఎపిసోడ్ కూడా అలాగే  ట్రెండ్ అవుతుండటంతో, దీనిపై రీతూ చౌదరి ఎలా రియాక్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా.

also read:డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

Tags

Related News

ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Big Stories

Advertisement
×