E-Paper
Advertisement

ఆధార్‌ కార్డ్‌లో పేరు మార్చాలా? కొత్త రూల్స్ జారీ చేసిన ప్రభుత్వం.. పూర్తి ప్రాసెస్ ఇదే

ఆధార్‌ కార్డ్‌లో పేరు మార్చాలా? కొత్త రూల్స్ జారీ చేసిన ప్రభుత్వం.. పూర్తి ప్రాసెస్ ఇదే
Advertisement

Aadhaar Card Name Change| ఆధార్ కార్డులో పేరు తప్పుగా నమోదైతే దాన్ని సరిచేయడం చాలా అవసరం. పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకున్నా, పేరు స్పెల్లింగ్‌లో తప్పు ఉన్నా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే పేరు మార్పు కోసం అవసరమైన ప్రక్రియ మారే అవకాశం ఉంది. ఆధార్ జారీ చేసే UIDAI విభాగం.. కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ ప్రకారం.. పేరు మార్పులను వివిధ కేటగిరీలుగా పరిగణిస్తున్నారు. మార్పు రకాన్ని బట్టి సంబంధిత డాక్యుమెంట్స్, అఫిడవిట్ లేదా గెజిట్ నోటిఫికేషన్ అవసరం కావచ్చు.

చిన్న మార్పులకు కూడా ఆధార పత్రాలు అవసరం

పేరులో చిన్న స్పెల్లింగ్ తప్పులను మైనర్ నేమ్ చేంజ్‌గా పరిగణిస్తారు. పేరులో కొంత భాగాన్ని జోడించడం లేదా తొలగించడం కూడా ఈ కేటగిరీలోకి రావచ్చు. ఇనిషియల్స్‌ను పూర్తి పేరుగా మార్చడం కూడా కొన్ని సందర్భాల్లో ఇందులో ఉంటాయి. మిడిల్ నేమ్ లేదా లాస్ట్ నేమ్‌ను జోడించడం కూడా చిన్న మార్పుగా పరిగణించే అవకాశం ఉంది. ఆధార్‌లో నమోదు చేయాలనుకుంటున్న పేరును సంబంధిత ఆధార పత్రం చూపించాలి.

పెళ్లి లేదా విడాకుల తర్వాత పేరు మార్చడానికి ప్రత్యేక డాక్యుమెంట్స్ అవసరం

Advertisement

పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకోవాలనుకునే వారు సంబంధిత డాక్యుమెంట్స్ సమర్పించాలి. విడాకుల తర్వాత పాత పేరును తిరిగి పొందాలనుకున్నా ఆధారాలు అవసరం కావచ్చు. మ్యారేట్ సర్టిఫికేట్ (వివాహ ధ్రువీకరణ పత్రం) లేదా డివోర్స్ కోర్ట్ ఆర్డర్స్ (విడాకుల ఉత్తర్వు) వంటి డాక్యుమెంట్స్ ఉపయోగపడతాయి. అయితే అవసరమైన పత్రాలు కేసు, అప్‌డేట్ రకం ప్రకారం మారవచ్చు.

ఆపరేటర్ తప్పుగా నమోదు చేసిన పేరును సరిచేయడానికి అదనపు ఆధారాలు

మీరు సరైన పేరు ఇచ్చినా ఆపరేటర్ తప్పుగా నమోదు చేస్తే సవరణ అవసరం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో సరైన పేరు చూపించే గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వయస్సు, పరిస్థితిని బట్టి అదనపు పత్రాలు కూడా అడగవచ్చు. పూర్తిగా పేరు మార్చుకోవాలంటే గెజిట్ నోటిఫికేషన్ అవసరం కావచ్చు. పాత పేరును పూర్తిగా మార్చుకోవాలనుకుంటే సాధారణ సవరణ కంటే ఎక్కువ పత్రాలు అవసరం కావచ్చు. UIDAI మార్గదర్శకాల ప్రకారం మొదటిసారి లేదా పూర్తిగా పేరు మార్చే సందర్భాల్లో గెజిట్ నోటిఫికేషన్ అవసరం ఉంటుంది. పాత పేరును చూపించే చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం కూడా అవసరం కావచ్చు. గెజిట్‌లోని వివరాలు UIDAI నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.

Advertisement

Also Read: రాష్ట్రం మారితే మద్యం ధర ఎందుకు మారుతుంది? అత్యంత తక్కువ ధర రాష్ట్రాలు ఇవే

ఆధార్‌లో పేరు మార్చేందుకు ఈ విధానాన్ని అనుసరించాలి

ముందుగా మీ పేరు మార్పు ఏ కేటగిరీలోకి వస్తుందో తెలుసుకోండి. తర్వాత ఆ కేటగిరీకి అవసరమైన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. అఫిడవిట్ అవసరమైతే నిర్దేశించిన ఫార్మాట్‌లో దాన్ని సిద్ధం చేయండి. తర్వాత అవసరమైన పత్రాలతో సమీప ఆధార్ కేంద్రానికి వెళ్లండి. అక్కడ ఆపరేటర్ మీ వివరాలను నమోదు చేసి పత్రాలను పరిశీలిస్తారు. అవసరమైనప్పుడు బయోమెట్రిక్ ధృవీకరణ కూడా పూర్తవుతుంది. దరఖాస్తు సమర్పించిన తర్వాత అక్‌నాలెడ్జ్‌మెంట్ లేదా రిక్వెస్ట్ వివరాలను తప్పకుండా తీసుకోండి. ఆ వివరాలతో మీ అప్‌డేట్ అప్లికేషన్ స్టేటస్‌ని తర్వాత పరిశీలించండి.

Also Read: వయసు 21 ఏళ్లు.. ఒక్క నెలలో రూ.2.6 కోట్లు సంపాదన.. యువకుడి బిజినెస్ ఐడియా అదుర్స్

ఆధార్ కేంద్రానికి వెళ్లే ముందు తాజా UIDAI నిబంధనలు పరిశీలించండి

పేరు మార్పునకు అవసరమైన డాక్యుమెంట్స్ మార్పు రకాన్ని బట్టి భిన్నంగా ఉండవచ్చు. అందుకే దరఖాస్తు చేసే ముందు UIDAI అధికారిక మార్గదర్శకాలను పరిశీలించడం మంచిది. సరైన పత్రాలు తీసుకెళ్లడం వల్ల దరఖాస్తు ఆలస్యం లేదా తిరస్కరణ అవకాశాలు తగ్గుతాయి.

Related News

దసరాకు జియో ఐపీఓ.. ఒక్కో షేరు ధర ఎంత ఉండొచ్చు, మరి జీఎంపీ మాటేంటి?

మళ్లీ దిగుతున్న గోల్డ్-వెండి ధరలు, తెలుగు రాష్ట్రాల మార్కెట్లో ధరల మాటేంటి?

20 ఏళ్లు ఉద్యోగం చేస్తే మీ EPS పెన్షన్ ఎంత వస్తుంది? ఇలా లెక్కించాలి

పోస్టాఫీసు సూపర్ డూపర్ స్కీమ్.. రోజూ రూ.300 దాస్తే చాలు.. చేతికి రూ.6.4 లక్షలు!

ఖరీదైన మెడిసిన్ అంటే మెరుగైన చికిత్స అని అర్థం కాదు.. మందులపై MRP, డిస్కౌంట్ల గుట్టు విప్పిన డాక్టర్

పోస్టాఫీసులో ఆ స్కీమ్ గురించి తెలుసా? ఐదేళ్లలో రూ.4,50,000 వడ్డీ, ఇవే ఆ డీటేల్స్

బుధవారం జీఎస్టీ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్, అదే జరిగితే బంగారం-వెండి ధరలకు రెక్కలు

Big Stories

Advertisement
×