Post Office RD: సాధారణంగా చిన్న చిన్న పొదుపు మొత్తాలే భవిష్యత్తులో కొండంత ఆసరాగా నిలుస్తాయి. పెద్దగా ఆదాయ మార్గాలు లేని సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు కష్టకాలంలో ఈ చిన్న పొదుపు మెుత్తాలే కొండంత అండగా నిలబడతాయి. కాబట్టి ఈ పొదుపు సరైన పథకంలో పెట్టడం చాలా ముఖ్యం. ఇందుకోసం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. ప్రతీ రోజూ రూ.300 చొప్పున పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తులో రూ.6 లక్షలకు పైగా నిధిని కూడబెట్టవచ్చు. అదెలాగో ఈ కథనంలో చూద్దాం.
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ 5 ఏళ్ల ఆర్‌డీపై ఏటా 6.7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. కాబట్టి రోజుకు రూ.300 చొప్పున ప్రతీ నెలా రూ.9000 ఈ ఆర్డీ స్కీమ్ లో జమ చేస్తే.. 5 ఏళ్ల కాలానికి (60 నెలలు) మీ పెట్టుబడి రూ.5,40,000 అవుతుంది. దీనికి ఏటా 6.7 శాతం వడ్డీని కలుపుకుంటే దాదాపు రూ.1,02,292 ఆదాయం లభించనుంది. అసలు, వడ్డీ కలుపుకుంటే సుమారు రూ.6,42,292 డిపాజిట్ దారు చేతికి అందనుంది.
రోజుకు రూ.300 పొదుపు చేయడం అంటే నెలకు దాదాపు ₹9,000 అవుతుంది. అయితే ఆర్‌డీలో రోజూ డబ్బులు కట్టాల్సిన పనిలేదు. ప్రతి నెలా ఒకేసారి డిపాజిట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి రోజువారీగా రూ.300 దాచుకుని నెల ముగిసేసరికి ఆ రూ.9,000 మొత్తాన్ని ఆర్‌డీ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తమే అవసరం లేదు. కేవలం రూ. 100 తోనే పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ ఖాతాను ప్రారంభించవచ్చు. ఆపై రూ.10 రెట్లు వరకు ఎంత మొత్తాన్నైనా పెంచుకుంటూ పోవచ్చు. దీనికి గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. సాధారణంగా దీని కాలపరిమితి 5 సంవత్సరాలు కాగా కావలసి వస్తే ఈ వ్యవధిని మరికొన్నేళ్లు పొడిగించుకునే సౌకర్యం కూడా ఉంది.
Also Read: ‘దృశ్యం-3’ సినిమా చూసి ప్లాన్.. 2000 కి.మీ ప్రయాణించి.. గొడ్డలితో తండ్రి హత్య!
పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ అనేది కేంద్ర ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలలో ఒకటి. కాబట్టి మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా స్థిరమైన వడ్, సురక్షితమైన రాబడి ఈ స్కీమ్ ద్వారా అందనుంది. అయితే ఈ 6.7 శాతం వడ్డీ రేటు ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి మూడు నెలలకొకసారి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పులు చేస్తూ ఉంటుంది. ఆర్డీ స్కీమ్ లో ఖాతాను తెరిచే సమయానిది వడ్డీ రేటు ఎంత ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.