JIO IPO GMP: గడిచిన కొన్నాళ్లుగా దేశీయ స్టాక్ మార్కెట్ ఒక రోజు పెరిగితే నాలుగైదు రోజులు పడిపోతుంది. అంతర్జాతీయ పరిస్థితులు బాగా లేనప్పుడు డబ్బులు పొగొట్టుకోవడం ఎందుకని చాలామంది మదుపరులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అందరి దృష్టి ఐపీఓలపై పడింది. తాజాగా దసరాకు రిలయన్స్ జియో ఐపీఓకు రాబోతోంది. దీంతో పెట్టుబడుదారుల కళ్లు దానిపై పడ్డాయి. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడుదారుల చూపు దానిపై పడింది. ఇండియాలో ఇది అతి పెద్ద భారీ ఐపీఓ.
రిలయన్స్ జియో దసరాకు ఐపీఓకు వస్తోంది. దీనికి సంబంధించిన జూన్ లో ఐపీఓ కోసం పత్రాల్ని దాఖలు చేసింది. అక్టోబర్ 21న ఐపీఓ మొదలుకానుంది. దీనికి సంబంధించి కీలక అప్ డేట్స్ వెలుగులోకి వచ్చింది. ఈ ఐపీఓ ద్వారా 4 బిలియన్ డాలర్లు నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అంటే ఇండియా కరెన్సీలో చూస్తే దాదాపు 37 వేల కోట్లు పైమాట. దేశ ఐపీఓల చరిత్రలో ఇదే అతి పెద్దది కానుంది. దాని తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా 2024లో ఐపీఓ ద్వారా రూ. 27,859 కోట్లు సమీకరించింది.
ఇటీవల లిస్టయిన NSE రూ. 22,562 కోట్లు సేకరణకు రెడీ అయ్యింది. ఈ మూడు తర్వాత ఎల్ఐసీ, పేటీఎం వంటి సంస్థలున్నాయి. ఈ ఐపీఓలు లిస్టింగ్ సమయంలో అంతగా మదుపరులను ఆకట్టుకోలేదు. చాలావరకు నెగెటివ్ లిస్టింగ్ తర్వాత పతనం అవుతూ వచ్చాయి. ఇలాంటి సమయంలో జియో ఐపీఓ ఏ విధంగా ఉండబోతోందని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ కంపెనీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అక్టోబర్ 12 తర్వాత రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్-RHPను దాఖలు చేయనున్నట్లు సమాచారం.
ఐపీఓ ధర ఒక్కో షేరుకు రూ.1,150 నుంచి రూ.1,220 మధ్య ఉండే అవకాశం ఉందని ఓ అంచనా. ఐపీఓ ముందు అంటే అక్టోబర్ 19న యాంకర్ ఇన్వెస్టర్ల ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 నుంచి 23 మధ్య సాధారణ పెట్టుబడిదారుల కోసం ఓపెన్ చేయనుంది. అక్టోబర్ 28 నాటికి స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాలన్నది ఆ కంపెనీ ఆలోచన. జియో ప్లాట్‌ఫామ్ యాజమాన్యం అక్టోబర్ 30 లోగా ఐపీఓకు సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేయడానికి భావిస్తోంది.
ఐపీఓలో షేర్ ధర రూ.1150 నుంచి రూ.1220 ఉండవచ్చని అంచనాల నేపథ్యంలో జీఎంపీ ఎంత ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్ అఫీషియల్ గ్రే మార్కెట్లో ప్రీమియం అక్టోబర్ 6న ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 160 వరకు చూపిస్తోంది. 12 శాతానికిపైగా ప్రీమియం నమోదు చేస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఇదేమీ శాశ్వతం కాదని, ట్రెండ్‌ని ఏ రోజుకు ఆ రోజు మారుతూ ఉంటుంది. చివర రోజు అంటే 23న జీఎంపీ ఒక అంచనాకు రానుంది.
ALSO READ: ఆధార్ కార్డ్‌లో పేరు మార్చాలా? కొత్త రూల్స్ జారీ చేసిన ప్రభుత్వం.. పూర్తి ప్రాసెస్ ఇదే
జియో ఐపీఓ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది 27 కోట్ల కొత్త షేర్లతో కూడి ఉంటుంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ ఉండదు. ప్రస్తుతం ఉన్న ప్రధాన పెట్టుదారులు ఎవరూ తమ షేర్లను అమ్మలేదు. కంపెనీలో తమ వాటాను ఉంచుకుంటున్నారు. ప్రధాన పెట్టుదారులలో మెటా, గూగుల్, సిల్వర్ లేక్, కేకేఆర్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం విలువ రూ. 9.5 లక్షల కోట్లు లేకుంటే అంతకంటే ఎక్కువగా ఉండవచ్చని ఓ అంచనా.