Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్. లక్ష క్రాస్ చేసిన పది గ్రాముల బంగారం ధర భారీగా పడిపోనుందా? ఎందుకు తగ్గాయి? ఎందుకు పెరిగాయి? ఈ మొత్తం గోల్డ్ ర్యాలీలో మెయిన్ ఎలిమెంట్ ఏది? ఈ ధరల పెరుగుదల తగ్గుదలకూ యుద్ధాలకూ ఉన్న సంబంధమేంటి? ప్రస్తుతం బంగారం ధరల తగ్గుదలకు అసలైన కారణాలేంటి?
బంగారం ధర లక్ష దాటిందన్న వార్త హల్‌చల్
గత కొన్నాళ్లుగా బంగారం ధరలకు సంబంధించిన వార్తల సారాంశమేంటంటే.. పది గ్రాముల బంగారం లక్ష దాటిందని. దీంతో కొందరికి సంతోషం మరి కొందరికి దుఃఖం. కారణం.. తమ దగ్గర భద్రంగా ఉన్నవారు ఎగిరి గంతేయగా.. తాకట్టు పెట్టిన వారు మాత్రం.. తీవ్రంగా బాధ పడ్డ పరిస్థితులు. గోల్డ్‌కి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. బంగారం ధర భారీగా తగ్గనుందని. ఒక రకంగా చెబితే ఇది కొందరికి షాకింగ్ న్యూస్. మరొ కొందరికి గోల్డెన్ ఆఫర్ కిందే చెప్పాలి. బేసిగ్గా ఆషాడ మాసంలో బంగారం కొనుగోళ్లు తక్కువగానే ఉంటాయి. అయితే వచ్చేది పండగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. కొందరు ఇప్పటి నుంచే కొనుగోళ్లు మొదలు పెట్టే అవకాశముంది.
గోల్డ్‌రేట్ భారీగా తగ్గొచ్చంటోన్న నిపుణులు
కొందరు చెప్పే మాట ఏంటంటే జూలై నెలలో బంగారం ధర భారీగా పడిపోయే అవకాశముందని అంటున్నారు. వీరి అంచనాలను బట్టీ చూస్తే ఈ ధర 70 వేలకు పడిపోయినా పడిపోవచ్చని సూచిస్తున్నారు. కారణం.. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య మాత్రమే కాదు ఇజ్రాయెల్- హమాస్ మధ్య కూడా పరిస్థితి చల్లబడింది కాబట్టి.. ఇదే జరుగుతుందని అంటున్నారు. దానికి తోడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న ఊహాగానాలు బంగారం ధరలపై ఒత్తిడి పెంచవచ్చని అంటున్నారు.
2025 జూలైలో కనిష్ట ధరలు వద్ద స్థిరపడే ఛాన్స్
మార్కెట్ అనలిస్టుల అభిప్రాయం ప్రకారం.. బంగారం ధర 70 వేలకు పడిపోవడం.. ఇన్వెస్టర్లకు, జ్యువెలరీ మేకర్స్‌కి సదావకాశంగా భావిస్తున్నారు. ఈ తగ్గుదల జూలై 2025 నాటికి తన కనిష్ట ధరల దగ్గర స్థిరపడవచ్చని అంటున్నారు. ఇప్పటికే అది చేరాల్సిన పీక్ స్టేజ్ కి చేరిపోయింది కాబట్టి.. త్వరలోనే భారీ తగ్గుదల నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. బంగారం కొనుగోలు చేసేవారు.. కొంత సమయం వేచి చూస్తే.. ధరలు నేల మీదకు వస్తాయి కాబట్టి.. అప్పుడు కొంటే మేలు జరుగుతుందని అంటున్నారు. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో బంగారు ధరలు 3100 డాలర్లన నుంచి 3500 డాలర్ల మధ్య కుదుట పడతాయని తాము ఆశిస్తున్నట్టు చెబుతున్నారు కొందరు విశ్లేషకులు. మార్కెట్ డిమాండ్ భారీగా పడిపోవడంతో.. ధరల తగ్గుదలకే అవకాశం ఎక్కువగా భావిస్తున్నారు.
డాలర్ బలహీనతకు- బంగారం ధరలకూ లింకు
సోమవారం గోల్డ్ రేట్ స్వల్పంగా పెరిగింది. అమెరికా డాలర్ బలహీనతకూ బంగారం ధరల హెచ్చుతగ్గులకూ ఒక సంబంధం. అంతే కాదు ఈ వారం చివర్లో విడుదల కానున్న అమెరికా ఫైనాన్షియల్ డాటా కోసం పెట్టుబడిదారులంతా కలసి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమెరికా ప్రభుత్వ లోటు పెరుగుదల ప్రధాన వాణిజ్య భాగస్వాములతో ఒప్పందాలకు గల అవకాశాలనూ అంచనా వేస్తోంది మార్కెట్. యూరో, స్విస్ ఫ్రాంక్‌లతో పోలిస్తే డాలర్ బలహీన పడింది. ఇది బంగారు ధరలను ప్రభావితం చేస్తుంది. అంతే కాదు.. అమెరికా చైనా మధ్య ఖనిజాల గొడవ సైతం పరిష్కారమైంది. రెండు అగ్ర దేశాల మధ్య తదుపరి చర్చల కోసం ఇన్వెస్టర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. మిగిలిన చోట్ల అమెరికాతో నిలిచిపోయిన వాణిజ్య చర్చలు సైతం ఈ రేట్లను ఎఫెక్ట్ చేయనుంది. కెనడా యూఎస్ టెక్ కంపెనీలే టార్గెట్‌గా డిజిటల్ సేవల పన్ను రద్దు చేసింది. ఇలాంటి సమయంలో.. బంగారం ధరలు తక్కువ వడ్డీ రేట్లు వంటి అంశాలతో ముడి పడి ఉంటాయి. అంతే కాదు యూఎస్ ఏడీపీ ఎంప్లాయిమెంట్ డాటా కోసం కూడా పెట్టుబడి దారులు ఎదురు చూస్తున్నారు.
సిల్వర్, ప్లాటినం, పల్లాడియం లాభాల వైపు
ఒక్క బంగారం ధరను ఇలాంటి ఎన్నో అర్ధం కాని అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. ఈ త్రైమాసికంలో ఇప్పటి వరకూ సిల్వర్, ప్లాటినం, పల్లాడియం లాభాల వైపు పయనించడం కనిపించింది. మే 29 తర్వాత స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0. 6 శాతం పెరిగి 3300 డాలర్ల దగ్గర స్థిరపడింది.
ప్రస్తుతం బంగారు ధరలు ఎలా ఉన్నాయో చూస్తే.. గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 9,050 కాగా ఈ ధర పది గ్రాములకు 90,500 రూపాయల వరకూ పలుకుతోంది. ఇక 24 క్యారట్ల బంగారం ధర 9,873 రూపాయలు కాగా.. పది గ్రాములు 98,730 రూపాయల వరకూ ఉంది. అంటే తులంపై రూ.600 తగ్గింది. ఈ ధరలు అనూహ్యంగా డెబ్భై వేలకు పడిపోవడం సాధ్యమేనా? అని చూస్తే ఇప్పటికే 18 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది.
Also Read: 30 బాంబులతో 3 నగరాల్లో పేలుళ్లకు కుట్ర..
బంగారం కొనాలనుకునే వారు ఈ నెలలో కొని పెట్టుకోవడం మంచి అవకాశం అంటున్నారు నిపుణులు. ఇప్పుడు ఆశాడ మాసం.. తర్వాత వచ్చేది శ్రావణ మాసం, అప్పుడు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఫంక్షన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో అప్పుడు మళ్లి బంగారం పెరిగే అవకాశాలు ఉంటాయి. కావున తగ్గినప్పుడే కొని పెట్టుకుంటే మీరు డబ్బులు సేవ్ చేసుకున్నట్టే అని చెబుతున్నారు.