Badrinath Temple: కలియుగానికి సంకేతాలు మొదలయ్యాయా? మానవులకు ప్రశాంతత కరువైందా? వేసే అడుగు.. మాట్లాడే ప్రతీ మాటలో విషపూరిత ఆలోచనలు ఉన్నాయా? చివరకు దేవాలయం వద్ద అదే పరిస్థితి నెలకొందా? బద్రీనాథ్‌లో శివుడి దర్శనం వేల కిలోమీటర్లు నుంచి వచ్చిన భక్తులు కొట్లాటకు దిగిన వీడియో వైరల్ అయ్యింది. ఇంతకీ వారి మధ్య గొడవకు దారి తీసిన కారణేంటి?
ప్రశాంతత లేనివారు దేవాలయాలకు వెళ్తారు. కాసేపు అక్కడైన పరమ శివుడ్ని ధ్యానిస్తే కొంతలో కొంత ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. దానివల్ల ముక్తి కలగపోయినా చిన్నదైనా రిలీఫ్ వస్తుందని భావిస్తుంటారు. అక్కడా ఆవేశానికి లోనైతే ఇక చెప్పేదేముంది? అలాంటి ఘటన ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ టెంపుల్ ఎదుట జరిగింది? భక్తులు రెండు గ్రూపులుగా విడిపోయిన కొట్టాటకు దిగారు.
దేశంలోనే కాకుండా విదేశాల నుంచి భక్తులు పవిత్ర క్షేత్రమైన బద్రీనాథ్ దేవాలయానికి వెళ్తారు. అక్కడికి వెళ్తే మనసుకు ప్రశాంతత వస్తుందని చిన్న ఆశ. సెల్‌ఫోన్ల పిచ్చిలో పడి పర్ఫెక్ట్ ఫోటో తీయడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ గ్రూప్‌కు చెందిన భక్తులు.. మరొకటి మధ్య చిన్నపాటి మాటలు కాస్త తారాస్థాయికి చేరాయి.
ఆ తర్వాత వారిలోని రాక్షస బుద్దిని బయటపెట్టుకున్నారు. ఒకరిపై మరొకరు ముష్టిగాతాలకు దిగారు. తాము దేవుని దర్శనం కోసం వచ్చామన్న విషయాన్ని మరిచిపోయారు. దీంతో కొన్ని క్షణాలపై అక్కడ ఘర్షణ జరిగింది. అక్కడున్న ఇతర భక్తులు జోక్యం చేసుకుని వారిని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
ALSO READ: ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ భర్తకు తిరుగులేదు
ఆలయం మెట్ల మీద ఒక వ్యక్తి ఫోటో తీయడానికి ప్రయత్నించగా, మరొక వర్గం అతన్ని ఆపడానికి ప్రయత్నించడంతో గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీని ఫలితంగా ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పవిత్రమైన ప్రదేశంలో ఆయా వర్గాలు భక్తులు మిగిలినవారికి భంగం కలిగించారు. దీంతో మిగతా భక్తులు అసౌకర్యానికి గురయ్యారు.
దేవుని ఇంట్లో శాంతి లేదు.. వీరేం వ్యక్తులంటూ సోషల్‌మీడియాలో ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. దర్శనం కోసం వచ్చామా? ఫోటోషూట్ కోసమా వచ్చారా? అంటూ మరికొందరు ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. దేవుడి కంటే ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు ముఖ్యమైనవి భావించినప్పుడు ఇంతదూరం రావడం ఎందుకని మరికొందరు అంటున్నారు. మొత్తానికి సెల్ఫీ పిచ్చి పరాకాష్టకు చేరిందని చెప్పవచ్చు.
उत्तराखंड –
बद्रीनाथ मंदिर के गेट पर फोटो खिंचवाने के लिए श्रद्धालु आपस में ही भिड़ गए, खूब लात–घूंसे चले। ये श्रद्धालु मन में अगाध श्रद्धा लेकर "पुण्य" पाने को बद्रीनाथ धाम आए थे। pic.twitter.com/KdZnffUO7f
— Sachin Gupta (@SachinGuptaUP) July 3, 2025