E-Paper
Advertisement

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కరోజులో ఎన్నివేలు పెరిగిందంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కరోజులో ఎన్నివేలు పెరిగిందంటే?
Advertisement

Today’s Gold Price Update: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఎఫెక్ట్ ప్రపంచ మార్కెట్లపై పడింది. పశ్చిమాసియాలో చాలా కాలంగా కొనసాగిన ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారుల దృష్టి మళ్లీ బంగారం మార్కెట్‌ పై పడింది. ఈ ప్రభావంతో సోమవారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి.

బంగారం ధరలకు రెక్కలు

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో పాటు దేశీయ మార్కెట్లో కూడా పసిడి రేట్లు ఎగబాకాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌ సైట్ వివరాల ప్రకారం, భారత్‌ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒకే రోజులో రూ.2,450 వరకు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,250 మేర పెరిగింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,840 వరకు దూసుకెళ్లింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Advertisement

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌ లో ఉదయం 10 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,530కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,900గా నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాల్లో కూడా దాదాపు ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,490గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,700కు చేరుకుంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,18,000గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, నాగ్‌పూర్ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,530గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,900గా నమోదైంది. ఈ నగరాల్లో 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,650గా ఉంది.  దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,680కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,050గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,800గా నమోదైంది. లక్నోలో కూడా ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. వడోదరా, భోపాల్ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,580గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,950గా నమోదైంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,700గా ఉంది.

కొనుగోలుదారులకు షాక్!

Advertisement

ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీగా పెరగడం కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. వివాహాలు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారిపై ఈ పెరుగుదల ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, పెట్టుబడిదారుల ఆసక్తి నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Read Also: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!

Related News

‘హోటల్ ధర కంటే స్విగ్గీలో డబుల్ ధర.. ఇదిగో ప్రూఫ్’

ఆయిల్ మార్కెట్‌లో ప్రకంపనలు.. బ్యారెల్ ధర 108 డాలర్లు, భారత్‌లో ధరలు పెరిగే ఛాన్స్?

యూట్యూబ్ వీడియోలు చూసి బిజినెస్ ప్రారంభం.. నెలకు రూ.25 లక్షల ఆదాయం

వినాయక చవితి వేళ పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధర

పిల్లల చదువులు, పెళ్లి, వైద్య ఖర్చుల కోసం EPF విత్‌డ్రా చేసుకోవచ్చా? కొత్త రూల్స్ ఇవే

బ్యాంక్ FD లేదా పోస్టాఫీస్ డిపాజిట్.. ఎందులో పెట్టుబడి చేయడం మంచిది

వైరల్ అవుతున్న 1980 ఏఐ ఫోటో ట్రెండ్.. మీ సెల్ఫీ అప్‌లోడ్ చేస్తే ప్రమాదకరం

సముద్రపు అడుగున పసిడి-వెండి ఖజానా.. చైనా శాస్త్రవేత్తల మైండ్ బ్లోయింగ్ శోధన! హైడ్రోథర్మల్ క్షేత్రం కూడా

Big Stories

Advertisement
×