Gold-Silver Prices Today: అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత, ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు మార్కెట్లపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఒక రోజు స్టాక్ మార్కెట్లు పెరిగితే.. రెండు రోజులు నేల చూపులు చూస్తున్నాయి. దీంతో మదపరులు బెంబేలెత్తుతున్నారు.
ఫలితంగా చిన్ని చిన్నపెట్టుబడుదారుల చూపు బులియన్ మార్కెట్‌పై పడింది. ఫలితంగా పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడం, కేంద్ర బడ్జెట్ తర్వాత ప్రతీ రోజూ బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
లేటెస్ట్‌గా ఫిబ్రవరి 10న దేశీయంగా గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 86, 843. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,440 గా ఉంది. అయితే ఆ ధరలు సోమవారం ఉదయం ఆరు గంటల వద్ద నమోదు అయినవి మాత్రమే. మార్కెట్ ప్రకారం ధరల పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు కూడా. ముఖ్యంగా ప్రాంతాలను బట్టి రేట్లలో తేడాలూ ఉంటాయి.
వెండి విషయానికి వద్దాం. సిల్వర్ సైతం పెరగడం, తగ్గడం జరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,02,600 వద్ద ఉంది. కొన్ని రాష్ట్రాల్లో లక్ష రూపాయల్లోపు ఉంది. ఇక చెన్నై, హైదరాబాద్, కేరళ రాష్ట్రాల్లో ప్రస్తుతం రేటు మూడు నాలుగు వేలు పెరిగింది.
ALSO READ: సొంతింటి కల నిజం చేసుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి..
ఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన సిటీలు, తెలుగు రాష్ట్రాల్లోని బంగారం, వెండి ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.86,830 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 79,590 వద్ద ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 86,660 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,440 కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,660 కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,440 ఉంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,660 వద్ద ట్రేడింగ్ సాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,440 కొనసాగుతోంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,660 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,440 సాగుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,660 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,440 ట్రేడింగ్ సాగుతోంది. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,660 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,440 ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,660 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,440 ట్రేడింగ్ అవుతోంది.