SA20 2025: SA 20 2025 లీగ్ ఉత్కంఠభరితమైన మూడవ సీజన్ ముగిసింది. SA 20 2025 సీజన్ టైటిల్ ని ఎం.ఐ కేప్ టౌన్ సొంతం చేసుకుంది. జోహాన్ బర్గ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ పై 76 పరుగుల తేడాతో ఎం.ఐ కేప్ టౌన్ జట్టు ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఎం.ఐ కెప్టౌన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
Also Read: ILT20: టోర్నీ విజేతగా దుబాయి క్యాపిటల్స్
ఎం.ఐ బ్యాటర్ల లో వాన్ దేర్ దుససేన్ 23 పరుగులు, రికెల్టన్ 33, జార్జ్ లిండే 20, డేవాల్డ్ బ్రేవీస్ 38, కగిసో రబాడా 8 పరుగులు చేయగా.. రిజా హెండ్రిక్స్, రషీద్ ఖాన్, కార్బీన్ బాస్చ్ డకౌట్ అయ్యారు. రషీద్ ఖాన్ నేతృత్వంలోని ఈ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇక 182 పరుగుల లక్ష్య చేదనలో {SA20 2025} సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 18.4 ఓవర్లలో 105 పరుగులకే ఆల్ అవుట్ అయింది. సన్ రైజర్స్ బ్యాటర్లలో టామ్ అబెల్ 30 పరుగులు, టోనీ డి జార్జి 26, ట్రిస్టన్ స్టబ్స్ 15 పరుగులు చేశారు. ఇక కెప్టెన్ మార్క్రమ్ కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు.
ఎం.ఐ కేప్ టౌన్ బౌలర్లలో కగిసో రబాడా నాలుగు వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, జార్జ్ లిండే చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ పై ఎం.ఐ కేప్ టౌన్ 76 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. SA 20 మొదటి రెండు సీజన్లలో టైటిల్ గెలుచుకున్న సన్రైజర్.. మూడవసారి కూడా ఫైనల్ కీ దూసుకు వచ్చి హైట్రిక్ కొట్టాలని భావించింది. కానీ {SA20 2025} ఈ సీజన్ లో మొదటిసారి ఫైనల్ లో అడుగుపెట్టిన ఎం.ఐ కేప్ టౌన్ కి అదృష్టం కలిసి వచ్చి విజయం సాధించింది.
ఈ విజయం తర్వాత ఎం.ఐ కెప్టౌన్ జట్టుకు 34 మిలియన్ ర్యాండ్లు ( సుమారు 16.2 కోట్ల రూపాయలు) గ్రాండ్ ప్రైజ్ మనీ గెలుచుకుంది. ఇక ఫైనల్ లో ఓడిన సన్రైజర్స్ 16.25 మిలియన్ ర్యాండ్లు ( సుమారు 7.75 కోట్ల రూపాయలు) దక్కాయి. అయితే SA20 {SA20 2025} ఫైనల్ మ్యాచ్ కోసం సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఓపెనర్ డేవిడ్ బెడింగ్ హోమ్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. ఫిబ్రవరి 8న డేవిడ్ బెడింగ్ హోమ్ పెళ్లి జరగాల్సి ఉంది.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మకు ఒడిశా సీఎం అదిరిపోయే గిఫ్ట్ !
కానీ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ {SA20 2025} ఫైనల్ కీ అర్హత సాధించడంతో తన పెళ్లిని ఫిబ్రవరి 9 కి వాయిదా వేసుకున్నాడు. ” నాకు కాబోయే భార్య మేము ఫైనల్ కి వెళ్ళమని చెబుతూ వచ్చింది. మేం ఫైనల్ కి వచ్చేసాం. కాబట్టి పెళ్లిని వాయిదా వేసుకుంటున్నాం”. అని తెలిపాడు డేవిడ్ బెడింగ్ హోమ్. ఇక ఈ ఫైనల్ లో విజయంతో ఎం.ఐ ఫ్రాంచైజీ క్రికెట్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవడానికి మరింత దూకుడుగా ఎదుగుతుంది.