Thandel Day 3 Collections: అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం తండేల్.. కార్తికేయ 2 ఫేమ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకం పై బన్నీ వాసు నిర్మించారు. రియల్ స్టోరీ బేస్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ రెండు రోజు మంచి టాక్ ను అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. రెండు రోజుల్లో మంచి కలెక్షన్స్ను వసూల్ చేసిన ఈ తండేల్ మూవీ మూడో రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం..
ఒకప్పుడు అక్కినేని హీరోల ఖాతాల్లో వరుస హిట్ సినిమాలు పడేవి.. కానీ ఈ మధ్య నాగ చైతన్య ఖాతాలో ఒక్క హిట్ మూవీ పడటలేదు. సరైన హిట్ లేక సతమతవుతున్న నాగ చైతన్య.. సక్సెస్ పుల్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీలో నటించారు. ఈ మూవీ భారీ బడ్జెడ్ తో తెరకేక్కడంతో భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి.. రియల్ స్టోరీ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవితంలో జరిగిన యదార్థ గాథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా సముద్రం, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌తో కథ కొనసాగుతుంది.. కథ కాస్త కొత్తగా ఉండడంతో ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. మొదటి రోజు కాస్త డల్లుగా కలెక్షన్స్ వచ్చినా కూడా వీకెండ్ కావడంతో రెండు మూడు రోజులు బాగా పెరిగినట్లు తెలుస్తున్నాయి. రెండో రోజు 30 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన తండేల్ మూవీ తండేల్ మూవీ మూడో రోజు బాగానే వసూలు చేసింది. ఆ కలెక్షన్ల వివరాల గురించి ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం..
తండేల్ మూవీ మూడు రోజుల కలెక్షన్ల విషయానికొస్తే.. ఈ సినిమాను సుమారు 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.. ఈ మూవీ ఫస్ట్ డే ఊహించని విధంగా 21 కోట్లను వసూల్ చేసింది..రెండో రోజు కూడా తండేల్ అదే జోరును కొనసాగించింది. రెండో రోజు దగ్గర దగ్గర రూ.20 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తండేల్ మూవీ 2 రోజుల్లో రూ.41.20కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.. ఇక మూడో రోజు కూడా కలెక్షన్స్ భారీగానే వచ్చినట్లు తెలుస్తుంది. ఏపీ, నైజాంలో రూ. 9 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ. 2.5 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 2.5 కోట్ల గ్రాస్ తో వర్డల్ వైడ్ గా డే 3 నాడు దాదాపు రూ. 14 కోట్ల వరకూ వసూళ్లు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో తండేల్ మూవీ రూ.50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది.. ఇదే జోరును కొనసాగిస్తే మరో రెండు రోజుల్లోనే సినిమాకు పెట్టిన బడ్జెట్ ను వసూల్ చేస్తుంది.. ఇదే విధంగా కలెక్షన్స్ వస్తే మాత్రం కొద్ది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరడం పక్క అని అటు నాగచైతన్య ఫ్యాన్స్ ఇటు సినిమా ట్రేడ్ వర్గాల వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.. మొత్తానికైతే నాగచైతన్య ఈ మూవీతో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు..