E-Paper
Advertisement

Realme 17 Pro Plus లీక్డ్ ఫీచర్లు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే.. లాంచ్ ఎప్పుడంటే?

Realme 17 Pro Plus లీక్డ్ ఫీచర్లు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే.. లాంచ్ ఎప్పుడంటే?
Advertisement

Realme 17 Pro Plus: రియల్‌మీ యూజర్లకు కంపెనీ మరో తీపి కబురు అందించడానికి సిద్ధమవుతోంది. తమ పాపులర్ ‘నెంబర్ సిరీస్’లో భాగంగా త్వరలోనే ‘రియల్‌మీ 17’ సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఇందులో ముఖ్యంగా ‘రియల్‌మీ 17 ప్రో ప్లస్’ మోడల్‌పై అందరి దృష్టి నెలకొంది. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెరుగైన పనితీరు..

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసిన సమాచారం ప్రకారం.. ఈ కొత్త ఫోన్‌లో 6.78 అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లే ఉండబోతోంది. ఇది 1.5K రెజల్యూషన్‌తో పాటు హై రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో వీడియోలు చూడటానికైనా, గేమ్స్ ఆడటానికైనా స్క్రీన్ చాలా స్మూత్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. రోజూ ఫోన్ వాడేటప్పుడు యూజర్లకు ఇది మంచి అనుభూతిని ఇస్తుంది.

Advertisement

Also Read: కెమెరా హిస్టరీలోనే బిగ్ చేంజ్.. 68MP స్క్వేర్ సెల్ఫీ కెమెరాతో వస్తున్న కొత్త ఫోన్ ఇదే!

కెమెరా నెక్ట్స్ లెవెల్..

ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీని కెమెరా సెటప్ మాత్రమే అని చెప్పాలి. రియల్‌మీ 17 ప్రో ప్లస్ వెనుక వైపు మూడు కెమెరాల సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇందులో మెయిన్ కెమెరాగా ఏకంగా 200MP సెన్సార్‌ను అందించనున్నారట. దీనికి తోడు దూరంగా ఉన్న దృశ్యాలను స్పష్టంగా తీయడానికి 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, విశాలమైన ఫొటోల కోసం 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉండనున్నాయి. ఫొటోగ్రఫీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.

మునుపటి మోడల్స్ కంటే మెరుగ్గా..

Advertisement

ఇటీవలే భారత్‌లో విడుదలైన రియల్‌మీ 16 ప్రో ప్లస్‌కు కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్ రాబోతోంది. ఇప్పటికే ఉన్న 16 ప్రో ప్లస్ మోడల్‌లో 200MP కెమెరా, 50MP పెరిస్కోప్ లెన్స్, 7000mAh పెద్ద బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి బలమైన ఫీచర్లు ఉన్నాయి. దీనికి తోడు కంపెనీ ఇటీవల రియల్‌మీ 16T 5G ఫోన్‌ను కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు రాబోయే 17 ప్రో ప్లస్ మోడల్ వీటి కంటే మరింత అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో యూజర్లను పలకరించనుంది.

లాంచ్ ఎప్పుడు ఉండొచ్చు?

ప్రస్తుతానికి ఇవన్నీ లీకైన వివరాలు మాత్రమే. రియల్‌మీ కంపెనీ ఇప్పటివరకు ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు లేదా లాంచ్ తేదీపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే లీకైన ఫీచర్లను బట్టి చూస్తుంటే.. ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌షిప్ విభాగంలో గట్టిపోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. కంపెనీ త్వరలోనే దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Also Read: అద్భుతమైన AI ఫీచర్లు, కళ్లుచెదిరే డిజైన్‌తో కొత్త 5G ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Tags

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×