E-Paper
Advertisement

ఎంత సంపాదిస్తే భారతీయులు సంతోషంగా ఉంటారు? డబ్బు, సంతోషం మధ్య లింక్ ఉందా?

ఎంత సంపాదిస్తే భారతీయులు సంతోషంగా ఉంటారు? డబ్బు, సంతోషం మధ్య లింక్ ఉందా?
Advertisement

Money Can Buy Happiness| డబ్బు ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మంచి ఇల్లు, వైద్యం, విద్య, సౌకర్యాలు పొందాలంటే డబ్బు తప్పనిసరి. ఆర్థిక భద్రత పెరిగితే జీవితంపై సంతృప్తి కూడా పెరుగుతుంది. అందుకే ఎంత సంపాదిస్తే మనిషి సంతోషంగా, సంతృప్తిగా జీవించగలడు అని ఇటీవల రెమిట్లి అనే సంస్థ ఒక అధ్యయనం చేసింది. అయితే ఒక స్థాయికి చేరుకున్న తర్వాత అదనపు ఆదాయం ప్రభావం తగ్గుతుందని తాజగా ఒనివేదిక చెబుతోంది. భారతీయుల్లో ఈ సంతృప్తికర స్థాయిని ఏడాదికి సుమారు రూ.20 లక్షలుగా ఉన్నట్లు నివేదికలో ఒక అంచనా వచ్చింది. అయితే ఈ స్థాయి కూడా జీవితంలో సంతోషానికి హామీ ఇవ్వదని.. అసలు జీవితంలో సంతోషం పూర్తిగా సంపాద ఆధారంగానే లభించదని కూడా తేలింది.

సంతోషాన్ని ఎలా లెక్కించారు?

ప్రజల ఆనందాన్ని పలు అంశాల ఆధారంగా అధ్యయనంలో అంచనా వేశారు. ఇందులో జీవితంపై వ్యక్తిగత సంతృప్తి కూడా ఒక ముఖ్యమైన అంశం. అధ్యయనంలో పాల్గొన్న ప్రజలు.. తమ ప్రస్తుత జీవితాన్ని 0 నుంచి 10 వరకు రేటింగ్ ఇవ్వాలని కోరగా. ఇందులో 0 అత్యంత చెత్త జీవితాన్ని సూచిస్తుంది. 10 రేటింగ్ అత్యుత్తమ జీవితాన్ని సూచిస్తుంది. అలాగే గత రోజులో అనుభవించిన సానుకూల, ప్రతికూల భావోద్వేగాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ అంశాలను కలిపి ప్రజల జీవన సంతృప్తి, మానసిక పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు.

ఆదాయం పెరిగితే సంతోషం ఎందుకు పెరుగుతుంది?

Advertisement

ఎక్కువ ఆదాయం ఉంటే ప్రజలు మెరుగైన ఇల్లు, వైద్యం, విద్య వంటి సౌకర్యాలను పొందగలరు. అలాగే పొదుపు పెంచుకోవడం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం సులభమవుతుంది. ఇవన్నీ ఆర్థిక ఒత్తిడిని తగ్గించగలవు. అయితే ప్రతి వ్యక్తిపై ఆదాయ ప్రభావం ఒకేలా ఉండదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి జీతం పెరగడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే సమయంలో ఇప్పటికే ఆర్థికంగా స్థిరంగా ఉన్న వ్యక్తికి అదే పెరుగుదల సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు.

భారతీయులకు రూ.20 లక్షల ఆదాయంతో సంతృప్తి

రెమిట్లీ చేసిన అధ్యయన నివేదిక ప్రకారం.. భారత్‌లో ఆదాయ సంతృప్తి స్థాయి సుమారు 21,577 డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.20 లక్షలు. ఈ స్థాయికి చేరుకున్న తర్వాత ఇంకా ఎక్కువ ఆదాయం లభించినా.. దాని వల్ల సంతోషం, సంతృప్తి స్థాయి పెంపు లేదు. దీని అర్థం రూ.20 లక్షల కంటే తక్కువ సంపాదించే వారు సంతోషంగా ఉండరని కాదు. అలాగే అంతకంటే ఎక్కువ సంపాదిస్తే అందరూ సంతోషంగా ఉంటారని కూడా కాదు. వ్యక్తిగత సంబంధాలు, ఆరోగ్యం, భద్రత, జీవనశైలి, అనుభవాలు కూడా ఆనందాన్ని ప్రభావితం చేస్తాయి.

ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది?

Advertisement

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆదాయ సంతృప్తి లెవెల్స్ భిన్నంగా ఉన్నాయి. ఐస్‌లాండ్‌లో ఇది సుమారు 1,63,579 డాలర్లుగా అంచనా వేశారు. ఆస్ట్రేలియాలో ఈ మొత్తం 1,61,302 డాలర్లుగా ఉంది. స్విట్జర్లాండ్‌లో సుమారు 1,54,504 డాలర్లుగా ఉంది. న్యూజిలాండ్‌లో ఇది 1,37,361 డాలర్లు కాగా, అమెరికాలో సుమారు 1,34,827 డాలర్లుగా ఉంది. స్థానిక ధరలు, కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు, సామాజిక పరిస్థితులు ఈ తేడాలకు కారణమవుతాయి.

Also Read: నల్లధనం ఉందా మా దగ్గరకు రండి.. బంగారం, కళాఖండాలు దాచుకోవడానికి బంకర్లు.. ప్రైవేట్ కంపెనీ ఆఫర్

డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు

ఆదాయం మనకు మరిన్ని అవకాశాలను అందించగలదు. జీవితంలో ఆర్థిక ఒత్తిడిని తగ్గించి జీవన ప్రమాణాలను మెరుగుపరచగలదు. అయితే డబ్బు ఒక్కటే సంతోషానికి ప్రమాణం కాదు. మంచి సంబంధాలు, ఆరోగ్యం, భద్రత, అనుభవాలు, వ్యక్తిగత సంతృప్తి కూడా చాలా ముఖ్యమైనవి.

Also Read: బ్యాంక్ లాకర్‌ నుంచి రూ.50 లక్షల నగలు చోరీ.. చేతులెత్తేసిన బ్యాంక్.. నష్టపరిహారం ఎవరిస్తారు?

Tags

Related News

టెలికాం రంగంలో సంచలనం.. 126 కోట్లకు చేరిన మొబైల్ యూజర్లు.. ట్రాయ్ రిపోర్టులో షాకింగ్ లెక్కలు!

పుట్టుకతో ఎడమ చేయిలేదు.. పట్టుదలతో చదివి రూ.50 లక్షల ప్యాకేజీ ఉద్యోగం

దసరాకు జియో ఐపీఓ.. ఒక్కో షేరు ధర ఎంత ఉండొచ్చు, మరి జీఎంపీ మాటేంటి?

ఆధార్‌ కార్డ్‌లో పేరు మార్చాలా? కొత్త రూల్స్ జారీ చేసిన ప్రభుత్వం.. పూర్తి ప్రాసెస్ ఇదే

మళ్లీ దిగుతున్న గోల్డ్-వెండి ధరలు, తెలుగు రాష్ట్రాల మార్కెట్లో ధరల మాటేంటి?

20 ఏళ్లు ఉద్యోగం చేస్తే మీ EPS పెన్షన్ ఎంత వస్తుంది? ఇలా లెక్కించాలి

పోస్టాఫీసు సూపర్ డూపర్ స్కీమ్.. రోజూ రూ.300 దాస్తే చాలు.. చేతికి రూ.6.4 లక్షలు!

ఖరీదైన మెడిసిన్ అంటే మెరుగైన చికిత్స అని అర్థం కాదు.. మందులపై MRP, డిస్కౌంట్ల గుట్టు విప్పిన డాక్టర్

Big Stories

Advertisement
×