భారతీయ రైల్వే ప్రయాణీకులు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని పొందేందుకు ఎప్పటికప్పుడు కీలక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే రైల్వే స్టేషన్లు, రైళ్లలో అమ్మే వస్తువుల ధరలను కంట్రోల్ చేసేందుకు కఠిన ఆంక్షలు పెట్టింది. ఎమ్మార్పీకి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకూడదని తేల్చి చెప్పింది. ఎక్కువ ధరలకు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తో పాటు లైసెన్సులు రద్దు చేయనున్నట్లు వెల్లడించింది. రైల్వే ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఇతర విక్రేతల మాట అటుంచితే, కనీసం రైల్వే క్యాటరింగ్ సిబ్బంది కూడా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
తాజాగా ఓ రైల్లో క్యాటరింగ్ సిబ్బంది ఆహార పదార్థాలను నిర్ణయించిన ధరకు మించి అమ్మడంపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా క్యాటరింగ్ సిబ్బంది రూ. 80 ధర ఉన్నథాలీని రూ. 120కి అమ్ముతున్నారు. దీన్ని గమనించి క్యాటరింగ్ సిబ్బంది మోసాన్నిఓ ప్రయాణీకుడు బయటపెట్టాడు. ఉన్న ధరకు మించి ఎలా అమ్ముతారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రైల్వే సిబ్బంది కూడా ఎక్కువ ధరలకు అమ్మడం ఏంటంటూ నిలదీశాడు. అయితే, సదరు సిబ్బంది మాట మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అటు ఈ వీడియోను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే సిబ్బంది కూడా నిబంధనలు పాటించకపోతే ఎలా? అంటూ మండిపడుతున్నారు. సదరు సిబ్బందిపై రైల్వే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చూసి చూడనట్లు వ్యవహరిస్తే.. ఇంకా రెచ్చిపోతారంటున్నారు. అందుకే, పెద్ద మొత్తంలో జరిమానా విధించడంతో పాటు లైసెన్స్ రద్దు చేయాలంటున్నారు.
Hard to believe, but Indian catering services are getting better.
A passenger exposed the fraud of catering staff selling an ₹80 thali for ₹120, and instead of beating him to a pulp, the staff quietly listened.
Just a few weeks ago, they would abuse and thrash passengers for… pic.twitter.com/u8gKXiDNi2
— THE SKIN DOCTOR (@theskindoctor13) September 24, 2025
ఈ ఏడాది జూలైలో క్యాటరింగ్ సిబ్బందిపై ఫిర్యాదు చేసిన ప్రయాణీకుడిపై దాడి చేసిన ఘటన సంచలనం కలిగించింది. 11463 నెంబర్ గల సోమనాథ్ జబల్పూర్ ఎక్స్ ప్రెస్ లో రైల్వే క్యాటరింగ్ సిబ్బంది.. ఓ ప్రయాణీకుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. వాటర్ బాటిల్ సహా ఇతర ఆహార పదార్థాలపై ఎమ్మార్పీకి మించి డబ్బులు వసూలు చేసినట్లు రైల్వే సేవకు ఫిర్యాదు చేశాడు. వెంటనే, రైల్వే సేవ అధికారుల నుంచి సదరు క్యాటరింగ్ సిబ్బందికి కాల్ వచ్చింది. వెంటనే సదరు ప్రయాణీకుడి దగ్గర ఎక్కువగా తీసుకున్న డబ్బులను వెనక్కి ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. సరే అని చెప్పిన క్యాటరింగ్ సిబ్బంది ఆ తర్వాత అసలు స్వరూపం చూపించారు. రైల్వే సేవా అధికారుల నుంచి కాల్ రాగానే, సదరు క్యాటరింగ్ సిబ్బందికి కోపం ఓ రేంజ్ లో తన్నుకొచ్చింది. తమ మీదే కంప్లైంట్ చేస్తాడా? అంటూ నేరుగా ప్రయాణీకుడి సీటు దగ్గరికి వచ్చారు. ఎందుకు ఫిర్యాదు చేశావంటూ పిడిగుద్దులు కురిపించారు. ఇతర ప్రయాణీకులు జోక్యం చేసుకున్నా ఆగలేదు. తమ కోపాన్ని అంతటినీ ప్రదర్శించారు. అటు రైలు నెంబర్ 14609 హేమకుంట్ ఎక్స్ ప్రెస్ లోనూ ఫిర్యాదు చేసిన ప్రయాణీకుడిపై రైల్వే క్యాటరింగ్ సిబ్బంది దాడి చేయడం సంచలనం కలిగించింది.
Read Also: ఏంటీ.. ఢిల్లీలో ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇదా? ఇన్నాళ్లు ఈ విషయం తెలియదే!