Gold Rate Today: అరే ఏంట్రా ఇది.. రోజు రోజుకు బంగారం ధరలు బయపెడుతున్నాయి. బంగారం రేటు చెబుతుంటేనే సామాన్య ప్రజలలో ఓణుకు పుడుతుంది. రోజూ ఇలా పెరుగుతూ పోతే బంగారంపైన పక్కా ఆశ చంపుకోవాల్సిందే అంటున్నారు. ఈ మధ్య కాలంలో బంగారం తగ్గడం అనే మాటే లేదు… రోజూ పెరగడమే ఉంది. నిన్న గురువారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,02,550 ఉండగా.. నేడు అనగా శుక్రవారం రోజూ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,03,310 వద్ద పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర నిన్న రూ. 94,000 కాగా.. నేడు రూ.94,700 వద్ద ఉంది. అంటే ఒక్క రోజూ తులంపై రూ.760 పెరిగింది.
పగబట్టిన పసిడి..
మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంగారం పక్కా కొంటాము.. అలాగే మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ప్రస్తుతం పెరిగిన బంగారం ధరలతో ప్రజలు షాక్‌కి గురవుతున్నారు. ఇలా పెరిగడం వల్ల సామాన్య ప్రజలు విలవిల లాడుతున్నారు.
వరలక్ష్మీ వ్రతం రోజు మహిళలకు బిగ్ షాక్..
మహిళలు ఎంతో ఇష్టంగా చేసుకునే వరలక్ష్మి వ్రతం రోజూ పక్కా కొంచెం బంగారం అయిన కొంటారు. కానీ అదే పండుగ రోజు వారికి బంగారం భారీ షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు శ్రావణమాసం.. చాలా మంది పెళ్లీళ్లు పెట్టుకున్నారు.. కానీ బంగారం కొనాలంటే భయపడుతున్నారు. ఇంతలా పెరిగితే ఎలా కొనాలని ఆందోళన చెందుతున్నారు. సామాన్య ప్రజలకు అందనంతా ఎత్తుకు పెరిగిపోయింది. బంగారం ఇలా పెరుగుతూ ఉంటే.. సామాన్య ప్రజలకు వన్ గ్రామ్ గోల్డ్ దిక్కా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
ట్రంప్ టారిఫ్ దెబ్బ..
ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ బంగారం రేటుపై పడింది. ఇప్పటికే లక్ష మార్క్ దాటిన పసిడి.. మళ్లీ ఇంకా పెరుగుతూనే ఉంది. ట్రంప్ దిగుమతులపై అమెరికా అదనపు సుంకాల విధించడంతో.. బంగారంపై భారం పడింది. దీంతో కొనుగోలు దారులు గోల్డ్ వైపు చూసేందుకు కాస్త ఆలోచిస్తున్నారు.
పలు ప్రాంతాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్ నేటి బంగారం ధరలు
నిన్నటి బంగారంతో .. నేటి బంగారం ధరలు పోల్చగా నిన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,550 కాగా.. నేడు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,03,310 వద్ద కొనసాగుతోంది. అలాగే నిన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.94,000 కాగా.. నేడు రూ.94,700 పలుకుతోంది.
విశాఖపట్నం బంగారం ధరలు
విశాఖలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,03,310ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.94,700 వద్ద ఉంది.
విజయవాడలో బంగారం ధరలు
విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,03,310 కాగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర తులం బంగారం ధర రూ.94,700 వద్ద కొనసాగుతోంది.
ముంభై బంగారం ధరలు
ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,03,310 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.94,700 వద్ద పలుకుతోంది.
Also Read: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?
ఢీల్లీ బంగారం ధరలు
ఢీల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,03,460 కాగా..22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.94,850 వద్ద ఉంది.