Kantara Chapter1: 2023 లో వచ్చిన కన్నడ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ కాంతారా.. కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వంతో పాటుగా హీరోగా కూడా నటించారు. చిన్న స్టోరీగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూళ్ల సునామి సృష్టించింది.. కేవలం కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఈ సినిమాకు సీక్వెల్ గా కాంతారా చాప్టర్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. గత కొద్ది రోజులుగా సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో సినిమా వాయిదా పడింది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా సినిమా రిలీజ్ డేట్ పై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కనకవతి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కనకవతిగా రుక్మిణి లుక్ అదిరింది..
‘కాంతార ఛాప్టర్-1’ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. అయితే ఇప్పటివరకు చిత్ర బృందం ఈ సినిమా గురించి పెద్దగా ఏ వివరాలు వెల్లడించలేదు. కానీ, ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో, మేకర్స్ ఈ శుక్రవారం ఒక ప్రత్యేక అప్‌డేట్‌ను విడుదల చేశారు.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో రుక్మిణి రాజసమైన లుక్‌తో మెరిసిపోగా, ఆ పాత్రకు తగిన శక్తి, గంభీరత స్పష్టంగా కనిపిస్తోంది. పౌరాణిక వాతావరణం కలిగిన ఈ పాత్ర సినిమా కథలో కీలక స్థానాన్ని సంపాదించనుందని చిత్రబృందం చెబుతోంది.. కనకవతి లుక్ మొత్తానికి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది..
Also Read :‘ది ప్యారడైజ్’ అప్డేట్ వచ్చేసింది.. రెండు జడలతో నాని లుక్ అదుర్స్..
కాంతార ప్రీక్వెల్ షూటింగ్ పూర్తి..
‘కేజిఎఫ్’, ‘సలార్’, ‘కాంతార’తో పాటు రీసెంట్ ‘మహావతార్: నరసింహ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో ప్రొడ్యూస్ చేసిన హోంబలే ఫిలిమ్స్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసి అక్టోబర్ రెండన ‘కాంతార: చాప్టర్ 1’ విడుదల చేయనున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు. గాంధీ జయంతికి థియేటర్లలో సినిమా సందడి చేయనుంది. సాధారణంగా పాన్ ఇండియా రిలీజ్ అంటే హిందీతో పాటు దక్షిణాది నాలుగు భాషల్లో విడుదల చేస్తారు.. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. అంతే కాదు ఈ మూవీ తర్వాత కాంతారా పార్ట్ 3 కూడా రాబోతుందని చెబుతున్నారు. ఆ మూవీలో ఎలాంటి స్టోరీని చూపిస్తారో అని ఇప్పటినుంచే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అలాగే ఈ హీరో తెలుగులోని పలు చిత్రాల్లో కీలకపాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Introducing @rukminitweets as ‘KANAKAVATHI’ from the world of #KantaraChapter1.
ಕನಕವತಿಯ ಪರಿಚಯ ನಿಮ್ಮ ಮುಂದೆ.
कनकवती का परिचय आपके लिए.
కనకవతి ని మీకు పరిచయం చేస్తున్నాం.
கனகாவதியை பற்றிய அறிமுகம் உங்கள் முன் உள்ளது.
കനകാവതിയുടെ ആമുഖം നിങ്ങൾക്കുമുമ്പിൽ.
আপনাদের সামনে কনকবতীকে… pic.twitter.com/4JmMy901un— Hombale Films (@hombalefilms) August 8, 2025