Madharasi OTT : కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీ లోకి వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరో అయ్యాడు. ఆయన నటించిన సినిమాలో తెలుగులో కూడా రిలీజ్ అవడంతో తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితమే. అమరన్ చిత్రం తో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న శివ కార్తికేయన్ మరో సినిమాతో సందడి చేయబోతున్నాడు. తాజాగా ఆయన నటిస్తోన్న మూవీ మదరాసి. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మదరాసి ప్రీ రిలీజ్ బిజినెస్ పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఓటీటీ రైట్స్ గురించి ఓ న్యూస్ వినిపిస్తుంది..
మదరాసి ఓటీటీ రైట్స్..
కోలీవుడ్ హీరో శివకార్తీకేయన్ ప్రేమకథలే కాదు, సెంటిమెంట్, యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా చేయగలనని నిరూపించుకున్నారు.. ఈయన నుంచి గత ఏడాది వచ్చిన అమరన్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు మదరాసితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మదరాసి డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్‌ను పరిశీలిస్తే.. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ మదరాసి డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది.. ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ ను బట్టి సినిమాను థియేటర్లలోకి రిలీజ్ అయిన 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది..
Also Read : వార్ 2 డిజాస్టర్ ఎఫెక్ట్… బాలీవుడ్‌లో ఎన్టీఆర్ మూవీ రద్దు ?
బిజినెస్ & టార్గెట్…
తమిళ హీరో శివ కార్తికేయన్ బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకుడు కావడంతో తాజాగా వస్తోన్న మదరాసి సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే మదరాసి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. సెప్టెంబర్ 5న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మదరాసి రిలీజ్ కానుంది.. గత ఏడది వచ్చినా అమరన్ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. ఈ మూవీ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో జరుగుతుందని తెలుస్తుంది.
ఇకపోతే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను పార్శ్ ఫిల్మ్స్ దక్కించుకోగా.. అమెరికాలో ప్రత్యంగిరా సినిమాస్, యూరప్‌లో 4 సీజన్స్ క్రియేషన్స్ సంస్థలు రిలీజ్ చెయ్యనున్నాయి. నిజానికి సెప్టెంబర్ 5న బోలెడు సినిమాలు థియేటర్లలో కి రాబోతున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి పోటీని ఇస్తుందో చూడాలి.. ఈ మూవీపై ఆయనకు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇది కూడా హిట్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. దీని తర్వాత శివ కార్తికేయన్ మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. అతి త్వరలోనే వాటిని అనౌన్స్ చెయ్యబోతున్న వర్గాల్లో టాక్.